పిల్లలనూ వేధిస్తున్న లాం ...
Only For Pro
Reviewed by expert panel
రెండేళ్లకు పైగా కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలపై తీవ్రమైన ప్రభావం చూపింది. కొన్ని లక్షల మంది మరణాలకు ఇది కారణమైంది. అయితే, కోవిడ్-19 సోకి కోలుకున్నప్పటికీ వారిని చాలాకాలం పాటు కొన్ని లక్షణాలు వేధిస్తున్నాయి. వీటిని లాంగ్ కోవిడ్ లక్షణాలు అంటున్నారు. ఇదిలా ఉండగా, ప్రముఖ సంస్థ లాన్సెట్ చేసిన అధ్యయనంలో 14 ఏళ్ల లోపు పిల్లల్లో లాంగ్ కోవిడ్ లక్షణాల గురించి కీలక వివరాలు వెల్లడయ్యాయి.
కరోనా పాజిటివ్‌గా గుర్తించిన పిల్లలు కనీసం రెండు నెలల పాటు సుదీర్ఘ కోవిడ్ లక్షణాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పరిశోధకులు కనుగొన్నారు. అలసట, కడుపు నొప్పి, మానసిక సమస్యలు, జ్ఞాపకశక్తి లోపాలు, దద్దుర్లు వంటివి 0-14 సంవత్సరాల వయసు ఉండే పిల్లలలో లాంగ్ కోవిడ్ ప్రధాన లక్షణాలు అని ఈ అధ్యయనం తేల్చింది. ‘ది లాన్సెట్ చైల్డ్ అండ్ అడోలసెంట్ హెల్త్’ అనే జర్నల్‌లో ఈ అధ్యయనాన్ని ప్రచురించారు. కోవిడ్ పాజిటివ్ అయిన పిల్లలు, కనీసం ఒక్క లాంగ్ కోవిడ్ లక్షణాన్ని అయినా ఎదుర్కొనే అవకాశం ఉందని ఈ రిసెర్చ్ నిర్ధారించింది.
ఈ పరిశోధన కోసం 2020 జనవరి నుంచి 2021 జూలై మధ్య కోవిడ్ పాజిటివ్‌గా తేలిన 0-14 సంవత్సరాల చిన్నారులపై సర్వే చేశారు. ఇందుకు పిల్లల తల్లిదండ్రులు, సంరక్షకులను ప్రశ్నించి వివరాలు రాబట్టారు. కరోనా సోకని 33,000 మంది పిల్లలతో కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిన 11,000 మంది పిల్లల హెల్త్ రికార్డులను పరిశోధకులు పోల్చి చూశారు.
లాన్సెట్ సర్వేలో సుమారు 23 వరకు లాంగ్ కోవిడ్ లక్షణాల గురించి పిల్లల ఆరా తీశారు. రెండు నెలల కంటే ఎక్కువ కాలం ఉండే లక్షణాలను లాంగ్ కోవిడ్ లక్షణాలుగా నిర్ధారించారు. 0-3 సంవత్సరాల పిల్లలలో మానసిక సమస్యలు, దద్దుర్లు, కడుపు నొప్పి వంటివి లాంగ్ కోవిడ్ లక్షణాలుగా ఉన్నట్లు అధ్యయనం తెలిపింది. ఇక, 4- 11 సంవత్సరాలు ఉన్నవారిలో మానసిక సమస్యలు, మతిమరుపు, ఏకాగ్రత లోపాలు, దద్దుర్లు వంటి లక్షణాలను గుర్తించారు. 12-14 సంవత్సరాల వారిలో అలసట, మూడ్ స్వింగ్స్, మతిమరుపు, ఏకాగ్రత లోపాలు ఉన్నట్లు గుర్తించారు. 12-14 సంవత్సరాల ఏజ్ గ్రూప్ వారి జీవన నాణ్యత స్కోర్లు ఎక్కువగా ఉన్నాయని, వీరిలో కోవిడ్ -19 పాజిటివ్ పిల్లల కంటే ఆందోళనలు (anxiety) తక్కువగా ఉన్నాయని కనుగొన్నారు. అన్ని వయసులవారిలో రెండు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు కనీసం ఒక లక్షణం బయటపడే అవకాశం ఉందని అధ్యయన ఫలితాలు కనుగొన్నాయి.
అయితే లాంగ్ కోవిడ్ ప్రభావం కరోనాపై, సామాజిక పరిమితులపై వారికి ఉండే అవగాహనతో ముడిపడి ఉండవచ్చు. క్లినికల్ టెస్టులు, సంరక్షణ మార్గాలు, లాక్‌డౌన్‌లు, టీకాలు తీసుకోవడం వంటి సామాజిక నిర్ణయాలకు మార్గనిర్దేశం చేయడానికి పిల్లలలో దీర్ఘకాల కోవిడ్ ప్రభావం గురించి తెలుసుకోవడం చాలా అవసరమని అధ్యయన౦లొ పాల్గొన్న నిపుణులు చెబుతున్నారు. వివిధ ఏజ్ గ్రూప్ పిల్లలందరిపై కోవిడ్-19 మహమ్మారి దీర్ఘకాలిక పరిణామాలను అర్థం చేసుకోవడానికి మరిన్ని పరిశోధనలు అవసరమని వీరు అభిప్రాయపడ్డారు.
ఈ బ్లాగ్ లో అందచేసిన సమాచారం మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి.
Be the first to support
Be the first to share
Comment (0)