భారత్ లో పిల్లలకు టమోటో ఫ ...
భారత్‌లో కాలుమోపుతున్న కొత్త వ్యాధి టమోటో ఫ్లూ గురించి వైద్య నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు. ఇది కొత్త రకం ముఖ్యంగా చేతులు, పాదాలు మరియు నోటిలో పొక్కులు, బొబ్బలు రావటం దీని ముఖ్య లక్షణం. కేరళ మరియు ఒడిశాలో టమోటో ఫ్లూ కేసులు కనుగొనబడ్డాయి. ప్రముఖ అధ్యనన సంస్థ లాన్సెట్ జర్నల్ ప్రకారం, టమోటో ఫ్లూ కేసులు మొదట కేరళలోని కొల్లంలోమే 6లో నమోదయ్యాయి. ఇప్పటివరకు 82 మంది పిల్లలకు సోకింది. ఈ చిన్నారులు 5 ఏళ్లలోపు వారేనని లాన్సెట్ నివేదిక పేర్కొనడం గమనించదగిన విషయం.
మీడియా నివేదికల ప్రకారం, ఇప్పటివరకు ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న సుమారు 100 మంది పిల్లలు టొమాటో ఫ్లూ బారిన పడ్డారు.
ఈ ఫ్లూ, దద్దుర్లు లేదా పొక్కులు, చర్మం సమస్య ఇంకా నిర్జలీకరణానికి కారణమవుతుంది.
టొమాటో ఫ్లూ అంటే ఏమిటి?
టొమాటో ఆకారపు బొబ్బలు శరీరంపై ఏర్పడటం వల్ల దీనికి టమాటో ఫ్లూ అనే పేరు వచ్చింది. దీనివల్ల దద్దుర్లు లేదా పొక్కులు, చర్మంపై చికాకు మరియు నిర్జలీకరణానికి కారణమవుతుంది. అయినప్పటికీ, ఇప్పటివరకూ ఇది వచ్చేందుకు కారణం ఏమిటి, ఇది చికున్‌గున్యా, వైరల్ ఫీవర్ లేదా డెంగ్యూ జ్వరానికి సంబంధించినదా అన్నది తెలియరాలేదు. ఇది సోకిన పిల్లలలో లక్షణాలు గుర్తించబడ్డాయి.
టొమాటో ఫ్లూ యొక్క లక్షణాలు -
పిల్లలలో ఈ లక్షణాలుకనిపిస్తే ఏమి చేయాలి?
మీ బిడ్డలో పై లక్షణాలలో కొన్ని లేదా అన్నే కనిపిస్తే, మొదటగా చేయవలసిన పని- వెంటనే వైద్యుడిని సంప్రదించడం. టొమాటో ఫ్లూ సోకిన పిల్లవాడు దద్దుర్లు లేదా పొక్కులను గోకడాన్ని నివారించాలి. సరైన పరిశుభ్రత పాటించాలి మరియు పిల్లవాడు వీలైనంత ఎక్కువ విశ్రాంతి తీసుకోవాలి.
టొమాటో ఫ్లూ బారిన పడకుండా ఎలా నిరోధించుకోవచ్చు?
పరిస్థితి ఆందోళనకరంగా లేనందున ఎవరూ భయపడనవసరం లేదు.. అయితే, మనం జాగ్రత్తగా ముందుకు సాగాలి. వీలైనంత ఎక్కువ నీరు తీసుకుని హైడ్రేటెడ్ గా ఉండండి. ఇంకా, కాచి చల్లార్చిన నీటిని మాత్రమే త్రాగాలి. టొమాటో ఫ్లూ సోకిన వ్యక్తి నుండి సరైన దూరం పాటించండి.
వ్యాధి సంక్రమణను నివారించడానికి చక్కని పరిశుభ్రతను పాటించండి.
Be the first to support
Be the first to share
Comment (0)