1. పిల్లల్లో వచ్చే కడుపు నొప ...

పిల్లల్లో వచ్చే కడుపు నొప్పికి సాధారణ కారణాలు ఏమిటి ?

0 to 1 years

Aparna Reddy

4.7M వీక్షణలు

4 years ago

పిల్లల్లో వచ్చే కడుపు నొప్పికి సాధారణ కారణాలు ఏమిటి ?

శిశువు ఆరోగ్య విషయానికి వస్తే తల్లిదండ్రులు ఎప్పుడూ అదనపు జాగ్రత్త కలిగి ఉంటారు. తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సర్వసాధారణమైన సమస్య కడుపు నొప్పి. కడుపు నొప్పికి ఎన్నో రకాల కారణాలు ఉండవచ్చు. శిశువులు చాలా సున్నితంగా ఉంటారు. అందుకే వారి  విషయంలో జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంటుంది. ఒక శిశువు రోగ నిరోధక శక్తిని పొందడం ప్రారంభించే సమయంలో అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. శిశువులలో వచ్చే ఒక సాధారణమైన సమస్య కడుపు నొప్పి. చాలామంది తల్లిదండ్రులు ఏదో ఒక సమయంలో పిల్లల్లో వచ్చే ఈ కడుపునొప్పిని అనుభవిస్తూనే ఉంటారు.

 

More Similar Blogs

    శిశువులలో వచ్చే అత్యంత సాధారణమైన ఈ కడుపు నొప్పికి కారణాలు ఏమిటో తెలుసుకోవడానికి మరియు మీ బిడ్డకు మీరు ఎలా సహాయ పడగలరో తెలుసుకోవడానికి దీనిని చదవండి.

     

    శిశువులలో వచ్చే కడుపు నొప్పికి కారణాలు :

     

    శిశువులలో వచ్చే కడుపు నొప్పికి చాలా సాధారణమైన కారణాలు  ఇక్కడ ఉన్నాయి:

     

    జీర్ణవ్యవస్థ ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేసుకోలేక పోతుంది. ఇది అసౌకర్యము మరియు ఆహార అలర్జీకి కారణమవుతుంది. మలబద్ధకం లేదా సురక్షితంకాని ఆహారాన్ని తీసుకోవడం కూడా కడుపునొప్పికి కారణం అవుతుంది.

     

    కడుపు క్రింది భాగంలో కండరాలు విస్తరిస్తాయి. ఇది తరచుగా కడుపు నొప్పి రావడానికి కారణం అవుతుంది. దీనిని పైలోరిక్ స్టినోసిస్ అంటారు. దీనివలన వాంతులు కూడా సంభవిస్తాయి.

     

    గజ్జ చుట్టూ మంట మరియు పొత్తికడుపు దెబ్బతినడం వలన ప్రేగులో వక్రీకరణకు దారితీస్తుంది. దీని కారణంగా పిల్లలకు హెర్నియా వస్తుంది. హెర్నియా కణజాలాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

     

    శిశువులలో కడుపునొప్పికి కారణమైన వాటిలో గ్యాస్ అన్నది సర్వసాధారణం. గ్యాస్ ఏర్పడటం వలన వారు అసౌకర్యంగా మరియు ఇబ్బందికరమయిన పరిస్థితులను అనుభవిస్తారు.

     

    శిశువులకు ఆకలిని తట్టుకునే శక్తి ఉండదు. అదేవిధంగా , అతి దేనికి మంచిది కాదు అని చెప్పబడిన విధంగా అధికంగా ఆహారాన్ని ఇవ్వడం కూడా అనుచితమైన పరిస్థితులకు దారితీస్తుంది. ముఖ్యంగా బాటిల్ పాలు ఇచ్చే పిల్లల్లో ఇది గమనించవచ్చు.

     

    అపెండిక్స్ యొక్క తీవ్రమైన నొప్పి కూడా అపెండిసైటిస్ కి కారణం కావచ్చు. దీనిని శస్త్రచికిత్స ద్వారా తొలగించవలసిన అవసరం ఉంటుంది. పిల్లల్లో తలెత్తే అపెండిసైటిస్కి పరిష్కారం ఎలా? దీని చికిత్స ఇష్టపడనట్లయితే తీవ్రమైన పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది.

     

    శిశువులలో కడుపు నొప్పికి చికిత్స ఏమిటి ?

     

    సమస్య తీవ్రతరం కాకుండా ఉండేందుకు ఇంటిలో చేయదగిన గృహ నివారణలు ఇక్కడ ఉన్నాయి. తర్వాత పిల్లల నిపుణులను సంప్రదించండి... క్రింద చదవండి.

     

    మీ పిల్లలు ఎదుర్కొంటున్న లక్షణాలను పరిశీలిస్తూ ఉండండి. వాంతులు, విరేచనాలు, నిద్ర లేకపోవడం, ఆహారాన్ని తీసుకోకపోవడం లేదా అధిక జ్వరం ఉన్నప్పుడు వెంటనే శిశువైద్యుడు సంప్రదించండి. దీనిని తనిఖీ చేయండి: విరోచనాలకు కారణాలు, లక్షణాలు మరియు నివారణ చిట్కాలు.

     

    క్లాక్వైజ్ లో మీ వేళ్ళతో శిశువు యొక్క పొట్ట పై సున్నితంగా రుద్దండి. అలా రుద్దడం వలన గ్యాస్ వలన వచ్చే నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. శిశువులలో వచ్చే కడుపు నొప్పిని నివారించడానికి ఇది అత్యంత శక్తివంతమైన చిట్కాలలో ఒకటి.

     

    పిల్లల్లో కడుపు నొప్పిని తగ్గించడానికి మితమైన వేడి నీటితో నింపిన బాటిల్ను పొట్టపై ఉంచడం ఉపశమనాన్ని కలిగిస్తుంది. నీరు ఎక్కువ వేడిగా లేకుండా ఉండే విధంగా జాగ్రత్త తీసుకోండి.

     

    శిశువును మృదువైన దుప్పటిలో కప్పడం మరియు వారిని చేతులతో ముందుకు వెనుకకు కదిలించడం ద్వారా కొంత ఉపశమనం కలుగుతుంది.

     

    మీ పిల్లలకు ఆహారంలో పెరుగును ఇవ్వడం ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది శరీరంలో కోల్పోయిన మంచి బ్యాక్టీరియాకి ప్రత్యామ్నాయంగా పనిచేసే అవకాశం ఉంది. వారికి మసాలాతో కూడిన ఆహారం ఇవ్వడం మానుకోండి. అది జీర్ణించుకోవడం చాలా కష్టం. దానికి బదులుగా పండ్లు మరియు తేనె ను ఇవ్వడం ప్రయోజనకరంగా ఉంటుంది. నిమ్మరసం మరియు పొదీనా కడుపునొప్పి నుండి ఉపశమనం ఇవ్వడానికి శక్తివంతంగా పనిచేస్తాయి. గోరువెచ్చని నీటిలో కొంచెం అల్లం వేసి ఇచ్చినట్లయితే బాగా పనిచేస్తుంది. కానీ రెండు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు ఇది ఇవ్వకూడదు.

     

    ఉపశమనానికి మరొక పద్ధతి ఏమిటంటే, ఎడమ పాదాన్ని మరియు కుడి చేతిని పట్టుకొని వాటిపై బొటనవేలు ద్వారా ఒత్తిడి తీసుకురావడం. శిశువులకు కడుపు నొప్పి ద్వారా విశ్రాంతిని ఇవ్వడానికి ఈ గృహ నివారణలు ఎంతో ఫలవంతమైనవి. ఇది కూడా తెలుసుకోండి: శిశువులలో పిన్ వార్మ్ ఇన్ఫెక్షన్ కారణాలు నివారణలు.


    ఈ బ్లాగు మీకు నచ్చిందా ? ఇది మీకు ఉపయోగకరంగా ఉందా ? దయచేసి దిగువ వ్యాఖ్యల విభాగంలో మీ అభిప్రాయాలను మరియు సూచనలను మాతో పంచుకోండి. మీ నుండి వినడానికి మేము ఎంతో ఇష్టపడతాము.

    Be the first to support

    Be the first to share

    support-icon
    Support
    bookmark-icon
    Bookmark
    share-icon
    Share

    Comment (0)