1. పిల్లలు అబద్ధం ఎందుకు చె ...

పిల్లలు అబద్ధం ఎందుకు చెబుతారు -- అబద్ధం చెప్పే మనస్సు

All age groups

Aparna Reddy

3.0M views

3 years ago

 పిల్లలు అబద్ధం ఎందుకు చెబుతారు -- అబద్ధం చెప్పే మనస్సు
ప్రవర్తన

పిల్లలు పిల్లలలాగే ఉంటారు - కొన్నిసార్లు మీ విలువైన గాజు సామాన్లు పగుల కొడతారు. వస్తువులను పోగొడుతారు. వారు స్నాక్స్ తినాలి అనుకున్నపుడు రహస్యంగా తింటారు. సుపరిచితము గా ఉన్నాయా? దానిని మీరు గమనించినప్పుడు లేదు అని చెప్పారా ? ఇది వారిని చెడ్డ వారిగా చేస్తుందా ? చెడ్డవారు కాదు, అబద్ధాలు అన్నీ కూడా చెడ్డవి కావు ! నిజానికి అన్ని అబద్ధాలు అబద్దాలు కూడా కావు !! పిల్లలు అబద్ధం చెప్పే మనస్తత్వం గురించి మరియు ఎలా సహాయపడగలమో తెలుసుకుందాం 

పిల్లలు ఎందుకు అబద్ధం చెబుతారు ?

More Similar Blogs

    ఐదేళ్లలోపు పిల్లలు వారి సృజనాత్మకతను విస్తరించి విషయాలను ఊహించుకునే  అవకాశం ఉంటుంది. వారు ఊహా ప్రపంచంలో జీవించడానికి ఇష్టపడతారు.' నేను స్కూల్ లో అందరి కంటే మెరుగ్గా ఉంటాను'/' మనందరికీ పెంపుడు జంతువులు ఉన్నాయి' అటువంటి విషయాలు చెప్పినప్పుడు, అది వారి కోరిక. వారి ఆలోచనలో ఒక భాగం ! తల్లిదండ్రులుగా మీరు అబద్ధము మరియు నమ్మకం మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.

    ఒక్కరిని నొప్పించకుండా ఉండేందుకు :

    సాధారణంగా పది సంవత్సరములు దాటిన పిల్లలకు నిజము మరియు అబద్ధం అంటే ఏమిటో తెలుస్తుంది. పెద్దలు కొన్ని సార్లు అననుకూల పరిస్థితుల నుండి తప్పించుకోవడానికి దౌత్యపరంగా ఉండడానికి పచ్చిగా అబద్ధాలను చెబుతారు. పిల్లలు వారి ప్రవర్తనను గమనించి , గ్రహించి దానిని ఉపయోగిస్తారు. పిల్లలు తమ సంరక్షకులను మరియు తల్లిదండ్రులను బాధపెట్టడం ఇష్టంలేక సులభంగా అబద్ధం చెబుతారు.

    తోటివారి ఒత్తిడి :

    పిల్లలు వారి తోటి పిల్లలతో కలిసిపోయి వారిలో ఇమిడిపోవాలి అనుకుంటారు. యుక్తవయసులో (ఈరోజుల్లో టీనేజ్ 10 సంవత్సరాల నుండి ప్రారంభమవుతుంది!) చాలామంది పిల్లలు తమ తల్లిదండ్రులు పెట్టే కఠినమైన నియమాలు అన్యాయమైన  మరియు కష్టతరమైనవిగా భావిస్తారు. ఆ దశలో వారు స్నేహితుల మెప్పుకోసం  ఏమి చేయాలనుకుంటున్నారో అది చేయలేనప్పుడు చాలా వత్తిడికి లోనవుతారు. ఈ దశలో వారు తల్లిదండ్రుల నియమాలను ఉల్లంఘించి స్నేహితులతో అంగీకరించబడాలి అనే ధోరణిలోనే ఉంటారు. ఈ వయస్సులో తల్లిదండ్రులు కూడా చాలా అనుమానాస్పదంగా మరియు అనేక ఆంక్షలు విధిస్తూ ఉంటారు. గుర్తుంచుకోండి, దీపానికి పురుగులు ఏవిధంగా ఆకర్షించపడతాయో, అదేవిధంగా యువత ఉత్సాహానికి ఆకర్షితులై ఏదో ఒక మార్గాన్ని కనుక్కుంటారు.

    అబద్ధం చెప్పడం సౌకర్యంగా ఉంటుంది :

    పిల్లలు కొన్నిసార్లు సమస్యల్లో చిక్కుకుంటారు లేదా బెదిరింపులకు గురవుతారు. వారు శిక్షకు భయపడతారు. నిజం చెప్పడం వలన తల్లిదండ్రుల కోపానికి గురి అవుతారు. అందుకే తల్లిదండ్రుల కోపాన్ని నివారించడానికి పిల్లలకు అబద్ధం చెప్పడం సులభంగా ఉంటుంది. ఇది తల్లిదండ్రులకు మరియు పెద్దలకు ఒక హెచ్చరిక. ఇటువంటి సమస్యను ఎదుర్కొనేటప్పుడు మనం పిల్లలతో ఎలా ప్రవర్తిస్తున్నాము ? అబద్ధం ప్రశాంతతను తెస్తుంది (కనీసం ఆ క్షణానికి) వారి అపరాధ భావం మరియు తల్లిదండ్రుల కోపంనుండి బయటపడడానికి అది సులువైన పరిష్కారంగా కనిపిస్తుంది.

    మానసిక స్థితి :

    చాలా మంది పిల్లలు ఈ అబద్ధం చెప్పే అలవాటును అధిగమిస్తారు. ఎదిగిన తరువాత కూడా ప్రతి చిన్న కారణానికి అబద్ధాలు చెప్పడం కొనసాగించినట్లయితే వారికి వృత్తిపరమైన సహాయం అవసరం ఉంటుంది. ఇటువంటి పరిస్థితి పరిష్కారంలేని విచారము, బాధ , దుఃఖము మరియు సంఘర్షణకు దారితీస్తుంది అని అర్థం.

    మన పిల్లలలో సమస్యలను ఎలా ఎదుర్కోవాలి మరియు వారికి విధంగా సహాయపడాలి?

    మొట్టమొదటిగా --  మీ దృష్టి పిల్లల మీద కాకుండా అబద్ధం మీద ఉంచండి. మీ వాగ్దానాలకు అనుగుణంగా ఉండండి. ఈ విధంగా ప్రయత్నించడం కష్టం , కానీ ఎంతో ఉపయోగకరమైనది. నిజాయితీగా ఉండడం వలన కోపపడటం లేదా  దెబ్బలు తినడం ఉండవు అని మీ బిడ్డకు భరోసా ఇవ్వండి. మీ పిల్లల ప్రవర్తనతో మీరు ఎంతకోపంగా మరియు చిరాకుగా ఉంటారో మీ మాటలతో వారికి తెలియజేయండి. మీ కోపం పిల్లలపై కాదు వారి ప్రవర్తనపై అని దయచేసి వారికి తెలియజేయండి. ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకుంటూ మరియు పిల్లలకు కూడా తరచూ గుర్తు చేస్తూ ఉండాలి. పిల్లలు మీతో ఓపెన్ గా ఉండడానికి సహాయపడుతుంది. దీనివలన పిల్లలు తమ తప్పులను కప్పిపుచ్చుకోకుండా ఉండడాన్ని కూడా నేర్చుకుంటారు. వారితో వ్యతిరేక ధోరణిలో ప్రవర్తిస్తే పిల్లలు కూడా అదే విధంగా చేస్తారు. దీని వలన భయంకరమయిన నష్టం జరుగుతుంది. వీటి నుండి బయటపడడానికి సానుకూలమైన మరియు ఉత్పాదకమైన 6 మార్గాలు ఇక్కడ ఉన్నాయి.

    నమూనాను మార్చడం :

    దండించే సమయంలోనూ మరియు శిక్షించే సమయంలోనూ ఆచరణాత్మకంగా ఉండండి. మీరు చెప్పిన మాటపై నిలబడండి. మీరు ఒక వారం రోజులపాటు టీవీ లేదు అని చెప్పి ఉన్నట్లయితే, దానికి కట్టుబడి ఉండండి. రెండు లేదా మూడు రోజుల తర్వాత ఇవ్వకండి. పిల్లలు చాలా తెలివైన వారు. మనం తిరిగిఇచ్చిన తర్వాత, వారు తమ అబద్ధాల నుండి బయటపడగలరు అని గ్రహిస్తారు.

    ప్రవర్తనపై మాత్రమే దాడి చేయండి :

    ఒకసారి మనము పిల్లలను అబద్ధాలకోరు లేదా అవినీతిపరులు అని ఒక ముద్ర వేస్తే వారు తమను తాము నమ్ముతారు మరియు అలాంటి ప్రవర్తననే కొనసాగిస్తారు. మనము వారికి  స్పష్టంగా తెలియజేయడం  చాలా ముఖ్యం. వారిని మనము ప్రేమిస్తున్నాము. కానీ,  వారు నియమాలను ఉల్లంఘించారని. అందువలన మేము కలత చెందుతున్నాము మరియు వారిని శిక్షిస్తున్నాము.

    స్పందించి ప్రతిస్పందించండి :

    జీవితంలో ప్రతి దశలోనూ మనందరం దీనితో పోరాడుతాం. కోపంలో సరిగ్గా స్పందించడం మనకి కష్టంగానే ఉంటుంది. ఎప్పుడైతే మనం గట్టిగా అరవడం  కోపపడటం వలనవారు వింటారు అనుకుంటాము. కానీ దానికి వ్యతిరేకంగా జరుగుతుంది. మనం మౌనంగా ఉండేలా చేస్తుంది. వారు భయంతో పడుకోవడం శిక్ష నుండి తప్పించుకోవడం కొనసాగుతుంది. నీకు ఎంత ధైర్యం అంటూ కోపంగా స్పందించే బదులు మరొక విధంగా స్పందించండి. నీవు ఈ అబద్దం చెప్పావు. అందుకే రెండు రోజులు సాయంత్రం వేళలో బయటకెళ్ళి ఆడుకోవడానికి నీకు అనుమతి లేదు.

    తల్లిదండ్రులు గొప్పగా చెప్పుకోవడం :

    తల్లిదండ్రులు తమ పిల్లలు శిక్ష నుండి తప్పించుకున్నారని లేదా అబద్ధం చెప్పడం ద్వారా పాఠశాలలో తిట్లు నుంచి తప్పించుకున్నారని గొప్పగా చెప్పుకోవడం మనం వింటూ ఉంటాం. ఇది చాలా ప్రమాదకరం. అబద్ధం బాగుంది అని పిల్లలు దాన్ని వెంటనే నేర్చుకుంటారు.

    సమస్యలను పరిష్కరించండి :

    అబద్దం అనేది లోతైన సమస్యలకు ఫలితం. పిల్లలు అబద్ధం చెప్పడానికి అసలైన కారణం ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. పరిస్థితికి మూలకారణాన్ని అర్థం చేసుకోవడం సమస్యను పరిష్కరించడానికి సహాయపడుతుంది. ఒక పిల్లవాడు మార్కుల గురించి అబద్ధం చెప్పినట్లయితే దాని వెనుక కారణాలను పరిశీలించండి. పిల్లలలోని భయానికి కారణమైన సమస్యలను పరిష్కరించండి. సరైన వ్యక్తులను కలిసి సమస్యను పరిష్కరించండి.

    లోతుగా పరిశీలించండి :

    పిల్లలు నైతికత అనే దిక్సూచితో జన్మించరు. వారు మన నుండి నేర్చుకుంటారు. ట్రాఫిక్ రెడ్ లైట్లను విచ్ఛిన్నం చేయడం తల్లిదండ్రులు సాధారణంగా చేసే పని. ఒకసారి పట్టుబడే వరకు ఏ పని అయినా చేయవచ్చు అనేది పిల్లలు త్వరగా గ్రహిస్తారు.

    ప్రతి మంచి వ్యక్తి కూడా తప్పు చేయని వారు కాదు అని మీ పిల్లలకు చెప్పడం మర్చిపోకండి. మనమందరం కూడా కొన్ని సార్లు తప్పులు చేస్తాము. కాబట్టి నిజాయితీని మెచ్చుకోండి. పిల్లలకు అబద్ధాల వలన ప్రతికూల ప్రభావాలను కలిగించే కథలను చెప్పడం కంటే, నిజాయితీ వలన జరిగే మంచి పరిమాణాలతో ఉండే కథలను ఎంచుకోండి. అది వారి మనస్సులో తిరుగుతూ ఉండే విధంగా వారిని తయారు చేయండి.
    పిల్లల అబద్ధాలపై వచ్చిన ఈ బ్లాగ్ మీకు ఉపయోగకరంగా ఉందా ? పిల్లలతో ఓపెన్ గా, నిజాయితీగా ఉండే సంబంధాన్ని మీరు ఏ విధంగా కొనసాగిస్తారు ? ఈ క్రింది వ్యాఖ్యల విభాగంలో మాతో పంచుకోండి. మీ నుండి తెలుసుకోవడం మాకు చాలా సంతోషం.

    Be the first to support

    Be the first to share

    support-icon
    Support
    bookmark-icon
    Bookmark
    share-icon
    Share

    Comment (0)