ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ను ఎలా ...
ఋతపవనాలు ఉక్క పోతల తో కూడిన వేడిమి నుండి ఎంతో ఉపశమనాన్ని కలిగించినప్పటికీ, వీటితో పాటుగా అనుకోని అతిథుల లాగా అక్కడక్కడా నిలిచిపోయే నీరు, జీర్ణ సమస్యలు మరియు చర్మ వ్యాధుల వంటి వివిధ అనారోగ్య ప్రమాదాలకు స్వాగతం పలుకుతాయి. తక్కువ రోగనిరోధకశక్తి గల పిల్లలకు అనారోగ్యకరమైన పరిస్థితులు తలెత్తుతాయి. వర్షంలో తడిసిన తర్వాత పిల్లలు ఎన్నో ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం ఉంటుంది. వివిధ అలర్జీలు మరియు బ్యాక్టీరియా లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ల కారణంగా 4 నుండి 10 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలు 20 శాతం మంది చర్మ వ్యాధులతో బాధపడుతున్నట్లుగా నమోదు చేయబడింది.
రుతుపవనాల సమయంలో చర్మవ్యాధులకు కారణమయ్యే అంశాలు :
అన్ని సీజన్లలోనూ పిల్లలకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పటికీ , రుతుపవనాల సమయంలో ఎక్కువగా బాధ పడతారని నిపుణులు అంగీకరిస్తున్నారు. ఎందుకంటే ఎన్నో రకాల క్రిములు వేడి మరియు తేమతో కూడిన వాతావరణంలో వృద్ధి చెందుతాయి . మరియు రుతుపవనాలు వాటికి సరైన వాతావరణాన్ని అందిస్తాయి. అదనంగా రుతుపవనాల సమయంలో చర్మవ్యాధులకు దోహదపడే 5 ఇతర అంశాలు.
* సరైన పరిశుభ్రతను పాటించకపోవడం .
* గాలి పీల్చుకో లేని సింథటిక్ పదార్థాలతో తయారు చేసిన బూట్లు మరియు సాక్స్ లను ఉపయోగించడం.
* చర్మము నీటిని పీల్చుకోవడానికి లేదా చెమట ఆవిరయ్యేలా చేయడానికి వీలు కాని సింథటిక్ దుస్తులను ధరించడం.
* కలుషితమైన నీటిలో చేతులను మరియు కాళ్లను ఎక్కువ సమయం ఉంచడం.
* ఊబకాయం ,డయాబెటిస్ లేదా ఇతర రోగనిరోధక అనారోగ్యాలు.
రుతుపవనాల సమయంలో సంభవించే సాధారణ ఫంగల్ ఇన్ఫెక్షన్ లు :
రింగ్ వార్మ్ :
ఇది ఒకరి నుంచి మరొకరికి సంభవించే ఒక చర్మ వ్యాధి. ఇది వృత్తాకారం లేదా రింగ్ ఆకారపు దద్దుర్లు గా కనిపిస్తుంది. ఇది సాధారణంగా చిన్నగా ఉండి ఎరుపు రంగు లో ఉంటుంది. దురద మరియు పొలుసులతో మచ్చ వలే మొదలై తలతోసహా శరీరంలోని అన్ని భాగాలకు వ్యాపిస్తుంది.
రింగ్ వామ్ కు కారణాలు .. మీ పిల్లలకు ఈ వ్యాధి రావడానికి అనేక కారణాలు ఉంటాయి. ఆ వ్యాధి సోకిన ఒక వ్యక్తి ద్వారా గాని, పెంపుడు జంతువుల ద్వారా కానీ కలుషితమైన బొమ్మలు లేదా బట్టలు, స్విమ్మింగ్ పూల్ లోగాని, పార్క్ లో మురికిగా ఉండే ఇసుక లో పలకడం వలన కానీ రింగ్వార్మ్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అధికమైన చెమట రింగ్వార్మ్ సంక్రమించే అవకాశాలను పెంచుతుంది.
గోటి వలన ఇన్ఫెక్షన్లు :
వర్షాకాలంలో గోర్లు ఫంగల్ ఇన్ఫెక్షన్లు తీసుకువచ్చే అతి ప్రమాదకరమైన ఆయుధాలు. చెమట కారణంగా పిల్లలు నిరంతరం గోకడం ప్రారంభిస్తారు. ఈ కారణంగా గోర్లు రంగుమారి పెలుసుగా మరియు గట్టిగా మారవచ్చు. చివరికి గోరు చర్మం నుండి వేరు చేయబడుతుంది. గోటి చుట్టు ఎరుపు ,వాపు మరియు చర్మం పై దురద కూడా మొదలవుతుంది.
గోటి ఇన్ఫెక్షన్ కు కారణాలు .. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్లు కలుషితమైన నీటి లో అధికంగా ఉండటం వలన గోర్లు ఎక్కువ సమయం నీటిలో ఉండడం వలన గోరు దెబ్బతినడం లేదా చెమట ఉన్న ప్రదేశంలో గోటితో గోకడం వలన సంభవించవచ్చు. గోటి కింద చిక్కుకున్న తేమ లేదా ఏదైనా మురికి ద్వారా ఇన్ఫెక్షన్లు పెరగడానికి కారణం అవుతాయి. లోపల పెరిగిన గోర్లు కూడా ఇన్ఫెక్షన్లకు ఎక్కువగా గురి అయ్యే అవకాశం ఉంటుంది.
అథ్లెట్ ఫుట్ :
అథ్లెట్ ఫుట్ అనే చర్మ వ్యాధి కారణంగా పాదాలపై ఎరుపు దద్దుర్లు , దురద మరియు తేమను కలిగి ఉంటాయి. ఇది సాధారణంగా కాళ్ల దగ్గర మొదలై ఇతర ప్రాంతాల అన్నిటికీ ప్రాకుతుంది. దీని కారణంగా పాదాలపై బొబ్బలు , మంట మరియు దుర్వాసన వస్తుంది.
అథ్లెట్ ఫుట్ కు కారణాలు :
ఇది పసిబిడ్డలకు మరియు పిల్లలకు సాధారణంగా రాదు. కానీ ఇది వర్షాకాలంలో చెప్పులు లేకుండా బయట నడవడం ద్వారా సంభవిస్తుంది. ఇది వేడి మరియు తేమతో కూడిన వాతావరణంలో అభివృద్ధి చెందుతుంది. చెమటతో కూడిన బూట్లు లేదా సాక్సులు ధరించడం వల్ల కూడా ఈ వ్యాధి సోకే అవకాశం ఉంటుంది. ఇది ఒక భయంకరమైన అంటువ్యాధి. ఈ వ్యాధి సోకిన వారు నడిచిన ప్రాంతాలనుండి కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుంది.
రుతుపవనాల సమయంలో సంభవించే సాధారణ అలర్జీలు :
వర్షాకాలంలో తేమ కారణంగా ఫంగల్ ఇన్ఫెక్షన్లతోపాటు పసిబిడ్డలకు చర్మపు అలర్జీలు కూడా సులభంగా సంభవిస్తాయి.
వేడి దద్దుర్లు :
ఎరుపు రంగులో మొటిమల లాగానే ఉంటాయి. ఇది వేడి మరియు తేమ కలిగిన వాతావరణంలో మీ బిడ్డలకు సులభంగా సోకవచ్చు. ఈ వాతావరణంలో పిల్లలకు చెమట పట్టి చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. ఇవి చెమట నిలవ ఉండే మేడమీద , చేతుల క్రింది భాగంలోనూ, డైపర్ ప్రాంతం యొక్క అంచులలోనూ ఈ వేడి దద్దుర్లు అభివృద్ధి చెందుతాయి.
వేడి దద్దుర్లకు కారణాలు :
పిల్లలకు ఎక్కువగా చెమటలు పట్టినప్పుడు ఈ దద్దులు రావచ్చు. ఇది బాధాకరమైన కాదు. కానీ , దురద తో పిల్లల అసౌకర్యానికి గురవుతారు.
డైపర్ రాష్ :
ఇది చిన్నపిల్లల్లో ఇది చాలా సాధారణం. ఇది పిల్లల లోని జననాంగాలలోను మరియు దిగువ భాగంలోనూ మరియు చర్మం యొక్క మూడతలను వస్తుంది . ఈ దద్దుర్లు సాధారణంగా ఎరుపు రంగులో ఉండి చర్మం ఎర్రబడినట్లుగా కనిపిస్తుంది. సమయానికి వీటికి చికిత్స చేయకపోయినట్లయితే ఇది ఫంగల్ లేదా బ్యాక్టీరియాగా సంక్రమణం చెందుతుంది. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ చిన్న మచ్చలతో మొదలై ఎర్రటి పెద్ద మచ్చలు గా మారుతుంది . ఈ బ్యాక్టీరియా ఫలితంగా పసుపు రంగు మచ్చలు ,లేదా చీముతో కూడిన మొటిమలు వస్తాయి.
డైపర్ రాషెస్ కు కారణాలు :
దీనికి ముఖ్య కారణం మల మూత్ర విసర్జన సమయంలో కలిగే తడి. డైపర్స్ ను మీరు తరచుగా మారుతున్నప్పటికీ ఈ వర్షాకాలంలో ఉండే వేడి మరియు తేమ కలిగిన వాతావరణం ఈ డైపర్ రషెస్ కు కారణం కావచ్చు. మరియు ఇది తీవ్రమైన చర్మ వ్యాధులకు కూడా దారితీయవచ్చు.
తామర :
ఇది శిశువు యొక్క చర్మాన్ని పొడిగా, పొరలుపొరలుగా , పోలుసుగా మరియు దురద కు గురి చేస్తుంది. దీని కారణంగా శిశువు యొక్క చర్మం ఎర్రగా మరియు పగుళ్లు ఏర్పడి మంటగా ఉంటుంది. ఇది ఎక్కువగా చేతులు , ముఖం , మెడ , మోచేతుల లోపలి భాగాలు మరియు మోకాళ్ళ వెనుక భాగాలలో వస్తాయి.
తామర కు కారణాలు :
కొంతమంది పిల్లలకు తామర ఎందుకు వస్తుందో ఇప్పటివరకు ఎవరికీ తెలియదు ఇది బహిర్గత కారణమైన వాతావరణ మార్పు లేదా జన్యుశాస్త్రం వంటి అంతర్గత కారణాల వలన సంభవిస్తుంది. కారణాలు ఏమైనప్పటికీ, తామర తేమతో ప్రేరేపించబడి ఉంటుందని కచ్చితంగా చెప్పవచ్చు. మరియు ఉష్ణోగ్రతల్లో మార్పులు రుతుపవనాల సమయంలో ఇతర అసౌకర్యాలకు గురవుతారు.
గజ్జి :
ఇది పరాన్నజీవి పురుగులు వల్ల కలిగే చాలా దురదతో కూడిన దద్దుర్లు. ఈ దద్దుర్లు సాధారణంగా వేళ్ళ మధ్య మోచేతులు, చంకలు , కడుపు మరియు జననాంగాలపై కనిపిస్తాయి . చిన్న నీటి బొబ్బలు తో నిండి ఎర్రగా ఉంటాయి.
గజ్జి రావడానికి గల కారణాలు :
ఈ ఇన్ఫెక్షన్ సాధారణంగా ఇప్పటికే సోకిన వ్యక్తి నుంచి సంక్రమిస్తుంది . పొడి మరియు తేమతో కూడిన వాతావరణం ఈ చర్మ రోగం వ్యాప్తి చెందడానికి కారణం అవుతుంది.
ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారించడానికి చిట్కాలు మరియు నివారణ :
పైన పేర్కొనబడిన అన్ని అంటు వ్యాధులకు ముఖ్య కారణం అపరిశుభ్రత మరియు తేమ. సరైన పరిశుభ్రతను పాటించడం, చర్మాన్ని పొడిగా ఉంచుకోవడం మరియు స్వచ్ఛమైన బయట గాలి పీల్చుకోవడం ద్వారా మీరు వీటి నుండి రక్షించ బడతారు. మీరు ఈ క్రింది సూచనలను కూడా అనుసరించవచ్చు..
మీ బిడ్డకు ఈ వ్యాధి లక్షణాలు కనిపించినట్లయితే చర్మవ్యాధుల నిపుణులను సంప్రదించి వారి సూచన మేరకు నోటి లేదా పూత మందులను వాడండి.
మీ బిడ్డకు మందమైన వస్త్రాలను వేయకండి. ఈ వాతావరణంలో వదులుగా ఉండే పలుచని నూలు బట్టలు వాడటం ఉత్తమం.
ఈ వ్యాధి సోకిన వ్యక్తుల నుండి మీ పిల్లలను దూరంగా ఉంచండి.
మీ పిల్లల యొక్క గోళ్లను కత్తిరించండి. తద్వారా గోకడం వలన వ్యాప్తి చెందకుండా నిరోధించవచ్చు.
మీ శిశువు యొక్క చర్మం పై చెమట, దూళి లేకుండా పరిశుభ్రంగా ఉంచండి. తద్వారా గజ్జి రాకుండా నివారించవచ్చు.
మీ పిల్లలకు క్రమం తప్పకుండా స్నానం చేయించండి. వారి చర్మాన్ని శుభ్రపరచడానికి తేలికపాటి క్రిమిసంహారిణిలను లేదా కొన్ని చుక్కల వేప నూనెను ఉపయోగించండి.
పిల్లలను ఎప్పుడూ పొడిగా ఉంచండి. ముఖ్యంగా చర్మపు మడతల భాగములలో పొడిగా ఉంచండి.
మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి.
మీ శిశువు యొక్క పాదాలను శుభ్రంగా మరియు పొడిగా ఉంచండి.
తప్పనిసరి అయితే పలుచని గాలి పీల్చుకొని కాటన్ సాక్స్ ను మాత్రమే వాడండి. మరియు వాటిని రోజుకి ఒక్కసారైనా మార్చండి.
మీ పిల్లలకు ఓపెన్ బూట్లు, ఫ్లోటర్ లు లేదా ఫ్లిప్ ఫ్లాపులను సరైన సైజువి వాడండి.
మీ పిల్లలకు అదనపు షూస్ ను తీసుకోండి. మీరు వాటిని మళ్ళీ పొడిగా ఎండ పెట్టడానికి అవకాశం ఉంటుంది.
మీ పిల్లల యొక్క బట్టలు లేదా టవల్ లు ఇతరులతో పంచుకోవడం లాంటివి చేయకండి.
వర్షాకాలంలో స్విమ్మింగ్ పూల్ లేదా పబ్లిక్ పార్క్ లకు వెళ్ళడం మానుకోండి.
చెమట అధికంగా పడుతున్నట్లయితే దానిని నయం చేసేందుకు ఆంటీ పెర్పిరెంట్ లోషన్ ను ఉపయోగించండి.
మీ చిన్నారికి తాజా రసాలు మరియు ఎక్కువగా నీరు ఇవ్వడం వలన శరీరం ఎప్పుడూ తాజాగా ఉంటుంది అని నిర్ధారించుకోండి.
దురద నుండి ఉపశమనం కలగడానికి గృహ చిట్కాలు :
ఈ చిట్కాలు మాత్రమే కాకుండా, సాంప్రదాయ గృహ నివారణలు మీ బిడ్డను చల్లగా ఉంచుతాయి . మరియు చర్మం యొక్క దురద నుండి ఉపశమనాన్ని కలిగిస్తాయి. దుమ్ము ద్వారా సంభవించే అసౌకర్యాల నుంచి ఇవి మిమ్మలను కాపాడుతాయి. వీటిని వ్యాధి సోకని పిల్లలకు కూడా ఉపయోగించవచ్చు. మీ శిశువు యొక్క వ్యాధి సోకిన చర్మంపై ఈ 5 గృహ నివారణలను ప్రయత్నించవచ్చు. బాగా ఆరిపోయిన తర్వాత వీటిని కడగాలి.
* తేనె, శెనగపిండి మరియు పాలతో పేస్ట్.
* ముల్తానామట్టి పేస్ట్.
* వేప ఆకుల పేస్ట్.
* పెరుగు ఆవనూనె మరియు చిటికెడు పసుపు కలిపి పేస్ట్.
* పన్నీరు(రోజ్ వాటర్) మరియు చందనం పొడితో కూలింగ్ పేస్ట్ .
ఈ వర్షాకాలంలో మీ బిడ్డ యొక్క చర్మాన్ని మరియు నవ్వులనూ రెండింటిని వికసించని ఇవ్వండి.
రుతుపవన సంబంధిత ఇన్ఫెక్షన్స్ పై డాక్టర్ అట్రే గారి సమాచారం మీకు నచ్చిందా ? వర్షాకాలంలో మీ చిన్నారులను సురక్షితంగా మరియు ఆరోగ్యంగా ఎలా ఉంచుతారు ? మీ అభిప్రాయాలను మరియు సూచనలను ఈ క్రింది కామెంట్స్ విభాగంలో మాతో పంచుకోండి. మీ నుండి వినడానికి మేము ఎంతో ఇష్టపడతాము.
Be the first to support
Be the first to share
Comment (0)