తెలంగాణాలో సీజనల్ వ్యాధు ...
తెలంగాణా రాష్ట్రమంతా ఆగకుండా కురుస్తున్న వర్షాల కారణంగా తడిసి ముద్దయింది. ఇక్కడి మొత్తం ౩౩ జిల్లాలకు గాను 8 జిల్లాల్లో ఎడతెరిపి లేని వార్శాలు కురుస్తున్నాయి. ఈ పరిస్థితిలో వరద నష్టాలతో పాటు.. సీజనల్, అంటువ్యాధులు కూడా వ్యాప్తించే అవకాశం కూడా అధికంగా ఉంది. సీజనల్ వ్యాధులను నియంత్రిస్తూనే కరోనా వంటి వైరస్‌లను అరికట్టేందుకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. వాటి నియంత్రణకు, ప్రజల సహాయార్ధం తెలంగాణా ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో వార్ రూమ్ ఏర్పాటు చేసింది. ఈ వార్ రూమ్ 24 గంటలూ ప్రజల సహాయార్ధం అందుబాటులో ఉంటుందని అధికారులు ప్రకటించారు. దీనికి సంబంచించిన వివరాలు ఇపుడు ఈ బ్లాగులో..
మాన్సూన్ సమయంలో వచ్చి సీజనల్ మరియు అంటువ్యాధుల గురించి ప్రజలకు ఫోన్ ద్వారా అవగాహన, సహాయం అందిచే నిమిత్తం వారికి అన్ని సమయాల్లో అందుబాటులో ఉండే ఫోన్ నంబర్లను ఏర్పాటు చేసారు.
అవసరమైన వారు 90302 27324, 040-24651119 నంబర్లలో ఈ హెల్ప్ లైన్ అందుబాటులో ఉంటుందని అధికారులు వివరి౦చారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో 24 గంటలూ ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తారు. అంతేకాకుండా జిల్లా, డివిజనల్ స్థాయిలో రాపిడ్ రెస్పాన్స్ టీం లను ఏర్పాటు చేయాలని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు సూచించారు. అలాగే స్థానికంగా కూడా హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేయనున్నారు.
వివిధ మాధ్యమాలు, కరపత్రాల ద్వారా ప్రజలకు జాగ్రత్తలు తెలుపుతున్నారు. తీవ్రజ్వరం, తలనొప్పి, ఒళ్లునోప్పులు, కళ్ళు ఎర్రబడటం, విరోచనాలు, ఆకలి మందగించడం వంటి లక్షణాలు ఉన్నపుడు అశ్రద్ధ చేయరాదని సూచించారు. అల్లాంటి వారు సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి వేల్ల్లలని అధికారులు తెలిపారు.
ఇక, వ్యాధుల గురించి అప్రమత్తంగ ఉండేందుకు ఆరోగ్య శాఖ సీజనల్ వ్యాధుల కేలెండర్ రూపొందించింది. ఏ సీజన్లో ఏయే వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది... ప్రభుత్వం, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి అన్న సమాచారాన్ని అందులో వివరించింది. దీని ప్రకారం - జూలై నుంచి అక్టోబర్ మధ్య డెంగీ, మలేరియా, సీజనల్ జ్వరాలు, నవంబర్–మార్చి మధ్య స్వైన్‌ఫ్లూ, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు, ఏప్రిల్–జూన్ మధ్యకాలంలో వడదెబ్బ, డయేరియా వంటివి వ్యాప్తించి ఇబ్బంది పెడతాయని తెలుస్తోంది.
కానీ కరోనా మాత్రం సీజన్‌కు సంబంధం లేకుండా ఏడాది పొడవునా ఎప్పుడైనా సోకే ప్రమాదం ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి. దేశంలో ఇప్పటికే కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. పైగా కరోనా, డెంగీ వంటి సీజనల్ వ్యాధుల లక్షణాలు ఒకేవిధంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో సీజనల్ వ్యాధులను ఎదుర్కొనడానికి ప్రాజలు, ప్రభుత్వ శాఖలతో కలిసి పనిచేయాలని, కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని వైద్య, ఆరోగ్యశాఖ సూచించింది.
మీ సూచనలు మా రానున్న బ్లాగులను మెరుగుపరిచేందుకు ఎంతో ఉపయోగపడతాయి. దయచేసి కామెంట్ సెక్షన్లో వ్యాఖ్యానించండి. ఈ బ్లాగ్ ఉపయోగకరం అనిపిస్తే.. తప్పక షేర్ చేయండి.
Be the first to support
Be the first to share
Comment (0)