1. తమ బిడ్డకు పకోడీ అని పేరు ...

తమ బిడ్డకు పకోడీ అని పేరు పెట్టిన బ్రిటన్ జంట: చిన్నారికి పేరు పెట్టేటప్పుడు ఇవి గుర్తుంచుకో౦డి

0 to 1 years

Ch  Swarnalatha

2.2M వీక్షణలు

2 years ago

తమ బిడ్డకు పకోడీ అని పేరు పెట్టిన బ్రిటన్ జంట: చిన్నారికి పేరు పెట్టేటప్పుడు ఇవి గుర్తుంచుకో౦డి
వ్యాధి నిర్వహణ & సెల్ఫ్‌కేర్

భారతీయ వంటకాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి అంటే అతిశయోక్తి కాదు. ఐతే, మన భారతీయుల ప్రేమాభిమానాలు చూరగొన్న కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి. వాటి పేరు వింటేనే మనకు ఆకలి వేస్తుంది. అటువంటి ప్రత్యేక వంటలలో ఒకటి పకోడా, పకోరా అని కూడా పిలిచే మన పకోడీ. ఇక సంగతేమిటంటే, మన పకోడీలకు విదేశాల్లో కూడా ఆదరణ పెరుగుతోంది.  ఇప్పుడు విదేశీయులు కూడా దీనికి అభిమానులుగా మారుతున్నారు. మేము నమ్మం అంటారా? ఐతే, తమ బిడ్డకు "పకోరా" అని పేరు పెట్టి,  ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేసిన బ్రిటిష్ జంట గురించి ఈ రోజు మనం మీకు చెప్పబోతున్నాం. 

వినడానికి వింతగా అనిపించవచ్చు, కానీ ఇది నిజం. అంతే కాదు, పిల్లల పేరుపై పకోరా అనే పేరు పెట్టడంపై, నెటిజన్లు అని పెద్ద సంఖ్యలో తమ స్పందనను వ్యక్తం చేయడం ప్రారంభించారు. దీనిని బట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులు తమ బిడ్డకు ఏ పేరు పెట్టాలనే విషయంలో చాలా గందరగోళంలో ఉన్నారని మనకి  అర్థం అవుతోంది.

More Similar Blogs

    బిడ్డకు "పకోరా" అని పేరు! 

    కొంతమంది తమ పిల్లలకు దేవుడి పేరు పెడతారు. మరికొందరు తమ పిల్లలకు సెలబ్రిటీల పేర్లను కూడా పెడతారు అనేది తెలిసినదే. మరి ఇంగ్లాండ్‌లో, ఒక జంట తమ బిడ్డకు భలే  ప్రత్యేకమైన పేరు పెట్టారు. వీరు తమ మగబిడ్డకు ప్రముఖ భారతీయ వంటకం "పకోరస్" అని పేరు పెట్టారు. ఈ పేరు వినగానే మీనవ్వొస్తోంది కదా. ఇక ఈ జంట ఇంటర్నెట్‌లో వైరల్ అవ్వడానికి ప్రధాన కారణం కూడా అదే. ఈ వార్తలు అన్ని ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కవర్ అవుతున్నాయి. ఈ జంటకు భారతీయ వంటకాలంటే ఎంతో ఇష్టమట.. అందుకే వారు తమ బిడ్డకు పకోరా అని పేరు పెట్టాలని వింత నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు. ఐర్లాండ్‌లోని న్యూటౌన్‌బీలో Facem అనే ఒక రెస్టారెంట్ ఉంది. ఈ జంట తమను తరచుగా సందర్శించేవారని ఆ రెస్టారెంట్ పేర్కొంది. రెస్టారెంట్ అధికారులు కూడా ట్విట్టర్‌లో ఈ వార్తను, బిల్లును పంచుకున్నారు. ఈ ట్వీట్‌తో పాటు చిన్నారి పేరు కూడా వైరల్‌గా మారింది.

    మీ బిడ్డకు పేరు పెట్టేటప్పుడు ఇవి గుర్తుంచుకో౦డి 

    • జ్యోతిష్యం మరియు సంఖ్యా శాస్త్రంపై దృష్టి పెట్టండి- బిడ్డ పుట్టడానికి ముందు లేదా తర్వాత, తమ బిడ్డకు ఏ పేరు పెట్టాలనేది తల్లిదండ్రుల ముందున్న అతిపెద్ద సవాలు. వివిధ హిందూ ఆచారాల ప్రకారం, కొంతమందికి జ్యోతిష్యం మరియు జాతకంపై విశ్వాసం ఉన్నందున పిల్లల పేరు చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది.
    • కాలం చెల్లిన పేర్లపై ఆధారపడవద్దు- ఇది కాకుండా, మనం న్యూమరాలజీ గురించి మాట్లాడినట్లయితే, పేరులోని మొత్తం అక్షరాలకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. పేరును ఎంచుకునేటప్పుడు, పాతది కాని ప్రత్యేకమైన పేరును ఎంచుకున్నారని నిర్ధారించుకోండి.
    • 2 నుండి 3 పేర్లను కలపండి- ఇటీవలి కాలంలో, తల్లిదండ్రులు కూడా వారి పేర్లలోని కొన్ని అక్షరాలను కలపడం ద్వారా తమ పిల్లలకు పేరుపెట్టడంలో ప్రయోగాలు చేస్తున్నారు.
    • పేరు యొక్క అర్థం చాలా ముఖ్యమైనది- ఇది కాకుండా, మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, పేరుకు కొంత అర్థం కూడా ఉండాలి. ఇక్కడ Parentune వద్ద మేము మీ బిడ్డకు ప్రత్యేకమైన, అందమైన పేరును ఎంచుకోవడం ద్వారా మీకు సహాయం చేయగలమని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మేము 10,000+ కంటే ఎక్కువ పిల్లల పేర్లతో వాటి అర్థాలతో కూడిన సమగ్ర జాబితాను సిద్ధం చేసాము.

    చివరిగా..

    ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డకు ప్రత్యేకమైన మరియు అందమైన పేరును ఎంచుకోవాలని కోరుకుంటారు, ఎందుకంటే వారు తమ పిల్లల గుర్తింపు భిన్నంగా ఉండాలని కోరుకుంటారు. సరే, మీ పిల్లల చెవులకు పూర్తిగా ప్రత్యేకమైన పేరు పెట్టడం కంటే సంతోషకరమైనది ఏమీ ఉండదు. కాబట్టి మీరు మీ బిడ్డకు ఏ పేరు పెట్టాలని ఎదురు చూస్తున్నట్లయితే, మా బేబీ నేమ్స్ సెక్షన్ కి వెళ్లి, బోలెడన్ని పిల్లల పేర్లను స్క్రోల్ చేయండి.

    Be the first to support

    Be the first to share

    support-icon
    Support
    bookmark-icon
    Bookmark
    share-icon
    Share

    Comment (0)

    Reflections of A First Time Moms

    Reflections of A First Time Moms


    0 to 1 years
    |
    164.6K వీక్షణలు
    Being a Mother- The sweet reality

    Being a Mother- The sweet reality


    0 to 1 years
    |
    2.9M వీక్షణలు
    Being a Mother - The Delicate Balance

    Being a Mother - The Delicate Balance


    0 to 1 years
    |
    66.1K వీక్షణలు
    Being a mother - My aspirations

    Being a mother - My aspirations


    0 to 1 years
    |
    3.9M వీక్షణలు