పానీపూరీ తింటే టైఫాయిడ్ అ ...
సాహితి పిల్లల్ని స్కూల్ నించి తీసుకొస్తోంది. దగ్గరే కావడంతో..రోజూ తనే తీసుకెళ్ళి తీసుకొస్తుంది. వచ్చే దారిలో రోడ్డు పక్కన ఈమధ్య కొత్తగా పానీపూరీ అమ్మే బండి ఒకటి పెట్టారు. ఇక స్కూల్ పిల్లలందరూ ఊరికే దానిమీద ఎగబడటం.. వాళ్ళని చూసి సాహితి పిల్లలు రియా, అమన్ ఇద్దరూ తమకూ పానీపూరీ కావాలని మారం చేయడం. ఇదిలా ఉంటే.. రోడ్డు పక్క స్టాల్స్ లో అమ్మే పానీపూరీలు తింటే టైఫాయిడ్ వస్తుందని తెలంగాణ ఆరోగ్య శాఖ ఇటీవల ప్రకటించింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. ఈ నేపధ్యంలో సాహితి ఇది నిజమా.. నిజమైతే ఎలా, ఎం జరుగుతుంది.. తనేం చేయాలి అని ఆలోచిస్తూ కూర్చుంది. మరి మీకు అలాంటి ప్రశ్నే ఎదురయిందా? ఐతే ఈ బ్లాగు చదివేయండి..
తెలంగాణలో పానీపూరి లేదా గోల్ గప్పాలను చాలా మంది ఇష్టపడి తింటారు. ఇక వర్షాకాలంలో బజారులో అమ్మే పానీపూరీ తినడం చాలామందికి క్రేజ్. నలుగురు ఫ్రెండ్స్ కానీ, స్టూడెంట్స్ కానీ కలిస్తే, వెళ్ళేది పానీ పూరీ బండి దగ్గరకే. మరి పానీపూరీ తింటే టైఫాయిడ్ వస్తుందనే ప్రకటనలో నిజం ఎంత? తెలంగాణలో ఎక్కువగా టైఫాయిడ్ కేసులు రావడానికి పానీపూరీయే కారణమా? పూర్తి వివరాల్ని ఈ బ్లాగులో చూద్దాం..
టైఫాయిడ్ అనేది పరిశుభ్రత, ఆహారానికి సంబంధించిన లోపాల వల్ల సంక్రమించే వ్యాధి. . ఇది వర్షాకాలంలో చాలా వేగంగా వ్యాప్తిస్తుంది. ఇక, నేపాల్ రాజధాని ఖాట్మండులో చాలా మంది ప్రజలు పానీపూరీ తిన్న తర్వాత టైఫాయిడ్ బారినపడటంతో పానీపూరీ అమ్మకాలపై నిషేధ౦ విధించిన సంగతి తెలిసిందే. తెలంగాణలోని కొన్ని ప్రదేశాలలో కూడా పానీపూరీ అమ్మకాలపై నిషేధించారు.
టైఫాయిడ్‌కు సరైన సమయంలో చికిత్స చేయకపోతే, ఈ వ్యాధి తీవ్ర నష్టం కలిగిస్తుంది. ఇది అలసట, పాలిపోయిన చర్మం, వాంతులు, అంతర్గత రక్తస్రావం కూడా కలిగి౦చి, ప్రాణాలకే ప్రమాదం కాగలదు.
పానీ పూరీ వ్యాధిగా ప్రసిద్ధి చెందిన టైఫాయిడ్ నిజానికి సాల్మొనెల్లా టైఫీ అనే ప్రమాదకరమైన బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఈ బ్యాక్టీరియా నోటి ద్వారా కడుపులోకి చేరి, ప్రజలను అనారోగ్యానికి గురి చేస్తుంది. ఈ బ్యాక్టీరియా వర్షాకాలంలో మరింత యాక్టివ్ గా ఉంటుంది. పానీపూరీకి వాడే నీరు శుభ్రంగా లేకపోతే, ప్రజలు దీనిని తీసుకోవడం ద్వారా సులభంగా టైఫాయిడ్ బారిన పడతారు.
టైఫాయిడ్ సోకిన వ్యక్తి టాయిలెట్ తర్వాత సరిగ్గా చేతులు కడుక్కోకుండా, ఆహారం లేదా త్రాగే నీటిని తాకినట్లయితే అవి వాడే ఇతర వ్యక్తులకు కూడా టైఫాయిడ్ సులభంగా వ్యాపిస్తుంది.
యాంటీబయాటిక్ చికిత్స తర్వాత టైఫాయిడ్ నుండి కోలుకున్న వ్యక్తులతో సంబంధం కలిగి ఉన్నా కూడా ప్రజలకు వ్యాధి సోకవచ్చు. లాంగ్ టైమ్ క్యారియర్లుగా ఉండే ఈ వ్యక్తులకు టైఫాయిడ్ లక్షణాలు ఏవీ ఉండవు. కానీ వారు వాడిన టాయిలెట్ల వాళ్ళ ప్రజలు ఆ వ్యాధి బారిన పడవచ్చు.
ఆహారం తినే ముందు, టాయిలెట్ కి వెళ్ళిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
బయటి నుంచి వచ్చిన తర్వాత చేతులు, కాళ్లను సబ్బుతో శుభ్రం చేసుకోవాలి.
దగ్గినప్పుడు, తుమ్మేటప్పుడు మీ నోటిపై రుమాలు ఉంచండి.
ముఖాన్ని పదే పదే తాకడం మానుకోండి.
స్ట్రీట్ ఫుడ్ తినేపుడు నీళ్లతో కూడిన పదార్థాలు తినవద్దు.
పానీపూరీలకు దూరంగా ఉండండి.
బయట అమ్మే చల్లటి పదార్థాలు తినకూడదు.
Be the first to support
Be the first to share
Comment (0)