1. పిల్లలతో ప్రయాణమా? వారి క ...

పిల్లలతో ప్రయాణమా? వారి కోసం ఫుడ్ ప్లానింగ్ టిప్స్ ఇవిగో…

All age groups

Ch  Swarnalatha

2.0M వీక్షణలు

2 years ago

పిల్లలతో ప్రయాణమా? వారి కోసం ఫుడ్ ప్లానింగ్ టిప్స్ ఇవిగో…
వ్యాధి నిర్వహణ & సెల్ఫ్‌కేర్
పోషకమైన ఆహారాలు
Travelling with Children

సునీత వాళ్ళ ఫామిలీ దసరా సెలవులకి పదిహేను రోజుల నార్త్ ఇండియా టూర్ ప్లాన్ చేస్తోంది. అక్కడ ఉండే  ప్రముఖమైన పుణ్య క్షేత్రాలతో పాటు, అందమైన టూరిస్ట్ స్పాట్ లను కూడా చుట్టేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. అందుకు అవసరమైన రిజర్వేషన్స్, హోటల్ బుకింగ్స్ అన్నీ అయిపోయాయి కూడా. ఐతే ఇక్కడీ ఒక చిక్కు.. పెద్ద వాలాకి ఫుడ్ సంగతి పర్వాలేదు.. రెస్టారెంట్స్, ధాబాలుస్నాక్క్, టిఫిన్ లేదా స్నాక్స్ సెంటర్స్ ఇలా ఎన్నో అందుబాటులో ఉంటాయి. కానీ తన ముద్దుల బాబు, ఏడాది ఇపుడే నిండిన తన కొడుకు రితేష్ సంగతేంటి? టూర్ లో ఉన్నపుడు వాడికి సరైన, పరిశుభ్రమైన పోషకాహారం ఎలా అందించాలో సునీతకి అర్ధం కావడం లేదు. 

సెలవుల సీజన్‌తో, లేదా ఎప్పుడైనా పసివాళ్ళతో  ప్రయాణించడం అనేది సవాలుతో కూడినదే.  ముఖ్యంగా ప్రయాణ సమయంలో శిశువుకు ఏమి తినిపించాలి అనేది తల్లులకు చిక్కు ప్రశ్న.. మీ బిడ్డ కోసం ఏమి తీసుకువెళతారు, వారి ఆహారాన్ని ఎలా ప్లాన్ చేస్తారో అనేది,  మీరు ఎంచుకున్న ప్రయాణ విధానం, ఎక్కడ బస చేస్తారు అనేదానిపై ఆధారపడి ఉంటుంది. అవి..

More Similar Blogs

    • రోడ్డు మార్గంలోప్రయాణం

    • విమానం/రైలులో ప్రయాణం

    • విదేశాలకు ప్రయాణాలు 

    • హోటళ్లలో బస చేస్తున్నారా..లేదా బంధువుల ఇంటిలోనా

    ఏ సందర్భంలో అయినా మమ్మీలు ఆందోళన, ఎగ్సైట్ కావడం సహజం. అయితే ప్రయాణిస్తున్నప్పుడు మీ బిడ్డకు పోషకాహారం సులభంగా అందేలా మీరు ఎం చేయాలో  తెలుసుకోవడానికి చదవండి.

    ప్రయాణంలో మీ బిడ్డకు ఆహారాన్ని ఎలా ఎంచుకోవాలి?

    ప్రయాణిస్తున్నప్పుడు మీ శిశువు భోజనం కోసం మీరు ఏమేం పదార్ధాలు  తీసుకు వెళ్ళాలి అనేది  క్రింది కారకాలపై ఆధారపడి ఉంటుంది:

    తయారీ మరియు నిర్వహణ సౌలభ్యం: ఎక్కువ హడావిడి లేకుండా తయారు చేయగల ఆహారాలు - వీటిని మీ బిడ్డకు సులభంగా తినిపించవచ్చు

    పదార్థాల పరిశుభ్రత: మీరు స్వయంగా పదార్థాలను తీసుకువెళ్లినప్పుడు వాటి పరిశుభ్రత మరియు భద్రత గురించి మీకు ఖచ్చితంగా తెలుసు కాబట్టి టెన్షన్ ఉండదు

    పోషకాహారం: ఈ ఆహారాలు, మీ చిన్నారి కడుపు నింపడమే కాదు,  పోషకాలను కూడా అందిస్తాయి. 

    ప్రయాణిస్తున్నప్పుడు మీ బిడ్డ కోసం ఫుడ్ ఐడియాస్

    పై అంశాల ఆధారంగా, వయస్సు వారీగా కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి:

    6-9 నెలల వయస్సు పిల్లల కోసం

    పండ్లు: అరటిపండు, సపోటా వంటి పండ్లను తీసుకుని, మెత్తగా చేసి, సులువుగా మీ పిల్లలకు చెంచాతో తినిపించవచ్చు. 

    పాల పొడి: మీ బిడ్డ ఇప్పటికే ఫార్ములా మిల్క్‌లో ఉంటే, ప్రయాణం సమయంలో ఆ పాలపొడి, ఫ్లాస్క్‌లో వేడి నీటిని తీసుకువెళ్లండి. హోటళ్లలో బస చేస్తున్నప్పుడు ఇవి నిజంగా సౌకర్యవంతంగా ఉంటాయి.

    ముందుగా వండిన తృణధాన్యాలు:

    గప్లు రాగి మాల్ట్, సెరెలాక్, ప్రిస్టైన్ ఫస్ట్ బైట్స్, హోల్సమ్ ఫుడ్స్ రాగి సత్వా మొదలైన మంచి బ్రాండ్‌ల ఉత్పత్తులు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా, వీటిని సిద్ధం చేయడానికి వేడి నీరు ఒకటే అవసరం. కాబట్టి వీటిని ఉపయోగించడానికి సౌకర్యంగా ఉంటుంది.

    ఇంట్లో చేసిన స్నాక్స్:

    మఫిన్లు, బిస్కెట్లు, డ్రై కేక్‌లు, లడ్డూలు మరియు బర్ఫీలు వంటి గూడీస్ కూడా మీరు ఇంట్లోనే తయారుచేసుకుని, మీతో సులభంగా తీసుకువెళ్లే ఆహారాలు.

    ప్యాక్ చేసిన పాలు/పెరుగు:

    మీరు చిన్న టెట్రా ప్యాక్‌ పాలను తీసుకెళ్లవచ్చు. సీల్డ్ టెట్రాస్ ప్యాక్‌లకు శీతలీకరణ అవసరం లేదు.  కానీ ఒకసారి తెరిచినట్ తర్వాత, వాటిని వాదేయాలి లేదా ఫ్రిజ్ లో ఉంచాలి. అందుబాటులో ఉన్న ఇతర పాల కంటే ఇవి చాలా సురక్షితమైనవి మరియు పరిశుభ్రమైనవి. అదేవిధంగా, చిన్నపెరుగు ప్యాక్‌లను తక్కువ దూరం ప్రయాణం కోసం తీసుకువెళ్లవచ్చు.. లేదా ప్రయాణిస్తున్నప్పుడు ఎక్కడైనా నమ్మకమైన ప్రదేశం నుండి కొనుగోలు చేయవచ్చు.

    10 నెలల పైన చిన్నారుల కోసం

    మీ పిల్లవాది వయసు సుమారు ఒక సంవత్సరానికి దగ్గరగా ఉంటే, మీరు అతనికి పుల్లటి పండ్లు, తృణధాన్యాలు మొదలైన వాటిని ఇవ్వవచ్చు.  కాబట్టి, పైన పేర్కొన్న ఆహారాలే కాకుండా, మీరు పిల్లలకు కొంచెం వెరైటీని అందించవచ్చు. ఇవి ఈ కింద ఉన్నాయి:

    పండ్లు:

    అరటిపండు, సపోటాయే కాకుండా, మీరు నారింజ, కిన్ను మరియు ద్రాక్ష తీసుకువెళ్లవచ్చు. తినిపించేటప్పుడు వాటిని కొద్దిగా మెత్తగా చేయాలి. 

    ఇంట్లో చేసిన బిస్కెట్లు/మఫిన్:

    తృణధాన్యాలతో చేసినవైతే, ఇవి శిశువు యొక్క ఆహారానికి ప్రత్యామ్నాయం కావచ్చు, వారు ఇష్టంగా తింటారు కూడా.

    పరాథాలు, పూరీలు:

    మీరు 12-24 గంటల వరకు ఫ్రెష్ గా ఉండే సాదా పరాథా, పూరి, తేప్లాలు మొదలైన వాటిని తీసుకెళ్లవచ్చు. వాటిని వండుతున్నప్పుడు కొంచెం ఉప్పు, వాము జోడించండి. రుచికి రుచి.. అతోగ్యానికి ఆరోగ్యం.

    బ్రెడ్:

    బ్రెడ్‌ను మెత్తగా చేయడానికి వెన్నను ఉపయోగించి తవాపై టోస్ట్ చేయండి. అల్యూమినియం ఫాయిల్‌లో చుట్టండి మరియు దీన్నిప్రయాణంలో మీ చిన్నారికి తినిపించవచ్చు. 

    గుర్తుంచుకోవలసిన విషయాలు:

    • ప్రయాణానికి 2-3 రోజుల ముందు మీ బిడ్డను ఈ ఫుడ్స్ కి అలవాటు చేయండి. ప్రయాణంలో లేదా కొత్త ప్రదేశంలో అప్పటికప్పుడు కొత్త ఆహారాన్ని పెడితే, పిల్లలు సులభంగా తినకపోవచ్చు
    • మీరు లాంగ్ టూర్ ప్లాన్ చేస్తే వేడి నీటి కెటిల్, ఫ్లాస్క్, చిన్న హాట్ పాక్, ఇండక్షన్ ప్లేట్, హ్యాండ్ బ్లెండర్‌ని కూడా మీతో తీసుకెళ్లవచ్చు. జిప్ లాక్ పౌచ్‌లను కూడా తీసుకువెళ్లండి. కాల్చిన సూజీ, కొంచెం బియ్యం లేదా ఖిచ్డీ మిక్స్-ఇండక్షన్ ప్లేట్‌లపై సులభంగా తయారు చేయవచ్చు
    • చిన్న డబ్బాలతో పంచదార, ఉప్పు, డిస్పోజబుల్ కత్తిపీటలు, కత్తులు మొదలైన కూడా ప్రయాణంలో ఉపయోగపడతాయి.
    • పిల్లల మోసం వీలైనంత ఎక్కువ నీటిని తీసుకువెళ్లండి లేదా ప్రముఖ బ్రాండ్‌కు చెందిన మినరల్ వాటర్ బాటిల్ మాత్రమే కొనండి.
    • పాల విషయంలో కూడా, మీరు స్వంతంగా  తీసుకు వెళ్ళండి లేదా  టెట్రా ప్యాక్‌లనే వాడండి.. టెట్రా ప్యాక్ పాల రుచి గురించి తాగుతారో లేదో అని అనుమానం ఉంటె,  కొంచెం పెద్ద పిల్లలకు ఫ్లేవర్డ్ మిల్క్‌ను కూడా అందించవచ్చు.

    కొంచెం ప్లానింగ్ మరియు ప్రిపరేషన్‌ ఉంటే చాలు, చిన్నారులతో కలిసి  ప్రయాణించడం చాలా సరదాగా ఉంటుంది. మీ టూర్ అద్భుత౦గా ఉండాలని మేము ఆశిస్తున్నాము!

    మీరు శిశువుతో ప్రయాణిస్తున్నప్పుడు ఫుడ్ ఐడియాలను గురించిన పై ఈ బ్లాగ్ ఉపయోగకరంగా ఉందా? దయచేసి మీకు తెలిసిన టిప్స్ ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి!

    Be the first to support

    Be the first to share

    support-icon
    Support
    bookmark-icon
    Bookmark
    share-icon
    Share

    Comment (0)

    When is a Child ready for a Pet?

    When is a Child ready for a Pet?


    All age groups
    |
    2.2M వీక్షణలు
    Celebrating Independence at 65

    Celebrating Independence at 65


    All age groups
    |
    11.4M వీక్షణలు
    Diet Precautions & Tips for Your Diabetic Child

    Diet Precautions & Tips for Your Diabetic Child


    All age groups
    |
    4.9M వీక్షణలు