వినాయక చవితి స్పెషల్: సుల ...
ఈ సంవత్సరం వినాయక చవితి, గణపతికి ఎంతో ఇష్టమైన రోజు- బుధవారం వచ్చింది. దీంతో ఈ ఏడాది గణేష్ చతుర్ధి ప్రాముఖ్యత పెరిగింది. ఇది చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ వినాయక చవితి ఉత్సవాలలో పెద్దల కంటే పిల్లల హడావుడే చాలా ఎక్కువగా ఉంటుంది. పిల్లవాడు చదువు సంధ్యల విషయంలో బలహీనంగా ఉంటే. వినాయక చవితి రోజున ఏకదంతుని పూజించడం శుభఫలితాలను ఇస్తుంది. చవితి ఉత్సవాలలో వరుసగా 10 రోజులు గణపతి ఆరాధనలో స్వచ్ఛమైన నెయ్యితో దీపం వెలిగించి, లంబోదరుని పూజిస్తే సకల బాధలు తొలగిపోయి శక్తి , తెలివి, జ్ఞానం లభిస్తాయని నమ్మకం.
ఆ పూజ సంగతి సరే, మరి పొట్ట పూజ సంగతి ఏమిటి అంటారా? గణేష్ చతుర్థి సందర్భంగా, బొజ్జ గణపయ్యతో సహా పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడే తియ్యటి ప్రసాదాలు - మూడు రకాల లడ్డూ వంటకాలను మీకు అందిస్తున్నాము. గబగబా చదివేసి.. చేసేయండి మరి..
మోతీచూర్ లడ్డూ
8 నుండి 10 లడ్డూలను తయారు చేయటానికి కావలసినవి
పాకం కోసం
1. 1 కప్పు చక్కెర
2. ½ కప్పు నీరు ( 250 మి.లీ)
3. చిటికెడు కుంకుమపువ్వు పొడి లేదా పొడిచేసిన కుంకుమపువ్వు
బూందీ తయారీకి కావలసిన పదార్థాలు:
4. 1 కప్పు బేసన్ / శనగ పిండి
5. చిటికెడు కుంకుమపువ్వు పొడి
6. ¾ కప్పు నీరు
7. 2 నుండి 3 నల్ల ఏలకులు (తొక్కలు తీసేయాలి)
8.½ టేబుల్ స్పూన్ పుచ్చకాయ గింజలు
9. డీప్ ఫ్రై కోసం నూనె
10. లడ్డూలను షేప్ చేసేటప్పుడు అరచేతులపై రాసుకోడానికి కొంచెం నూనె లేదా నెయ్యి
చక్కెర పాకం తయారీ:
ఒక పాన్‌లో పంచదార, కుంకుమపువ్వు మరియు నీటిని వేసి కరిగించి స్టవ్‌పై పెట్టి వెలిగించండి.
చక్కెర ద్రావణాన్ని తీగపాక౦ వచ్చేవరకు ఉడికించాలి.
బూందీ తయారీ:
3. శెనగపిండి, చూర్ణం చేసిన కుంకుమపువ్వు మరియు నీళ్లతో జారుగా పిండిని కలపండి. పిండి మందంగా లేదా పలుచగా ఉండకూడదు. అది ముద్దలు లేకుండా ప్రవహించే పిండిగా ఉండాలి. కలపవలసిన నీటి పరిమాణం పిండి నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి అవసరమైనప్పుడు మీరు రెసిపీలో పేర్కొన్న దానికంటే ఎక్కువ లేదా తక్కువ జోడించవచ్చు.
4. కడాయి లేదా పాన్‌లో డీప్ ఫ్రై చేయడానికి నూనె వేడి చేయండి. నూనె మధ్యస్తంగా వేడిగా ఉండాలి. చిల్లులు గల గరిటె తీసుకోండి. గరిటెను నూనె పైన ఉంచి వేయించాలి. వేయించిన బూందీలను తీసివేయడానికి మీకు మరొక గరిటె అవసరం.
5. ఒక పెద్ద గరిటతో సిద్ధంగా ఉన్న పిండిని తీసుకుని, చిల్లులు గల గరిటె మీద పోయాలి. రెండో గరిటతో నొక్కండి. అపుడు పిండి చిల్లుల గరిట నుండి వేడి నూనెలోకి వస్తుంది.
6. బూందీ బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. ఎక్కువగా వేయించవద్దు. నూనె మరగడం ఆగిపోయినప్పుడు, బూందీలను తీసివేయండి. బూందీలో సరైన ఆకృతిని పొందడానికి 45 సెకన్ల నుండి 1 నిమిషం వరకు సరిపోతుంది.
7 ఈ దశ ముఖ్యమైనది ఎందుకంటే బూందీ గట్టిగా మారితే మోతీచూర్ లడ్డూలు మెత్తగా ఉండవు, అవి చక్కెర పాకంను గ్రహించలేవు.
8. వేయించిన బూందీని ఉంచడానికి పెద్ద గరిట ఉపయోగించండి. బూందీని తీసివేసిన తర్వాత నూనె బాగా వోడనిచ్చి, వాటిని నేరుగా చక్కెర పాకంలో వేయండి. చక్కెర పాకం వేడిగా ఉండాలని కూడా గుర్తుంచుకోండి.
9. చక్కెర పాకం వేడిగా లేకపోతే, దానిని ఒకసారి వేడి చేయండి. ఒకవేళ, చక్కెర పాకం పెరుకుపోయినా, మళ్లీ వేడి చేయండి. బూందీల షేప్ గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తర్వాత వాటిని బ్లెండర్‌లో పొడి చేస్తాము.
10. ఇలా బూందీ తయారు చేసి, వాటిని వెంటనే పంచదార పాకంలో కలుపుతూ ఉండండి. కదిలిస్తూ, బాగా కలపాలి. పంచదార పాకంలో బూందీలు మెత్తబడాలి.
11. బ్లెండర్ లేదా మిక్సర్‌లో బూందీ మరియు షుగర్ పాకం వేయండి. రవ్వ లాగా అయేందుకు 1 టేబుల్ స్పూన్ వేడి నీటిని వేసి, బూందీ మిశ్రమాన్ని రెండు మూడు సార్లు పల్స్ చేయండి.
12. ఎక్కువగా పల్స్ చేయవద్దు. అలాఅయితే మీరు మోతీచూర్ లడ్డూలను చక్కని ఆకృతిలో చేయలేరు. జోడించాల్సిన నీటి పరిమాణం బూందీల ఆకృతిపై ఆధారపడి ఉంటుంది.
13. బూందీలు కొంచెం కరకరగగా ఉంటే, 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వేడి నీటిని జోడించండి. బూందీలు వేడి నీటిని గ్రహిస్తాయి, మృదువుగా మరియు తేమగా ఉంటాయి.
14. పుచ్చకాయ గింజలు మరియు ఏలకులు జోడించండి. బాగా కలపండి.
15. మీ అరచేతులపై కొద్దిగా నూనె లేదా నెయ్యి రాసి మోతీచూర్ లడ్డూలను గుండ్రంగా చేయండి. లడ్డూలను తయారుచేసేటప్పుడు ఆ మిశ్రమం వెచ్చగా ఉంటుంది. చల్లబడ్డాక అవి చక్కగా మారుతాయి.
16. మోతీచూర్ లడ్డూలను పుచ్చకాయ గింజలు, జీడిపప్పు లేదా ఎండుద్రాక్షతో అలంకరించవచ్చు. ఈ మోతీచూర్ లడ్డూలను నెయ్యితో తయారు చేయకాపోతే వాటిని ఫ్రిజ్‌లో ఉంచవచ్చు. వాటిని నెయ్యిలో వేయించినట్లయితే, ఫ్రిజ్లో పెట్టినపుడు అవి గట్టిగా అయిపోతాయి.
2. బేసన్ లడ్డూ
10 నుండి 12 లడ్డూలను తయారు చేయడానికి కావలసినవి:
1 1/2 కప్పులు - బేసన్ / గ్రాముల పిండి
1 టేబుల్ స్పూన్ - సూజి / రవ్వ / సెమోలినా
1/2 కప్పు - చక్కెర
1/2 కప్పు - నెయ్యి (కరిగినది)
3 టేబుల్ స్పూన్లు - తరిగిన జీడిపప్పు
3 టేబుల్ స్పూన్లు - తరిగిన బాదం
1 tsp - తాజా ఏలకుల పొడి
తయారుచేసే పద్ధతి
1. యాలకుల గింజలతో పంచదార గ్రైండ్ చేసి పొడి చేసుకోవాలి. బాదం, జీడిపప్పు చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
2. అడుగు మందంగా ఉన్న కడాయి / పాన్‌లో నెయ్యి వేడి చేసి, జల్లెడ పట్టిన శెనగపిండిని చిన్న మంటలో మంచి సువాసన వచ్చే వరకు వేడి చేయండి. లేత గోధుమరంగు వచ్చేవరకు నాన్‌స్టాప్‌గా వేయించాలి.
3. సూజి లేదా రవ్వ వేసి 2-3 నిమిషాలు వేయించి, తరిగిన నట్స్ వేసి వాటన్నిటినీ బాగా కలపండి. మరో 1-2 నిమిషాలు వేయించండి. చక్కెర పొడి వేసి, ప్రతిదీ బాగా కలిసేలా కలపండి, మంట ఆపేయండి.
4. శనగపిండి మిశ్రమాన్ని 5 నిమిషాల పాటు చల్లారనివ్వండి. ఆపై బాగా మిక్స్ అయ్యే వరకు చక్కెర పొడిని బాగా కలపండి. మిశ్రమాన్ని 10 నిమిషాలు చల్లబడనీయండి.
ఆ తరువాత మిశ్రమంలో కొంత చేతిలోకి తీసుకుని, లడ్డూ ఆకారంలో నొక్కండి. మిశ్రమం ఇంకా వేడిగానే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు లడ్డూను కట్టలేకపోతే లేదా అది విరిగిపోతుంటే, ఒకసారి 1 టేబుల్ స్పూన్ కరిగించిన నెయ్యిని వేసి మళ్లీ ప్రయత్నించండి.
5. లడ్డూను ఒక పెట్టెలో లేదా ప్లేట్‌లో వేసి వాటిని ఆరనివ్వండి, లడ్డూ మృదువుగా ఉన్నట్లు మీకు అనిపించినా, కొంత సమయం పాటు ఆరిన తర్వాత అవి బాగానే ఉంటాయి.
6. వాటిని పొడిగా ఉన్న డబ్బాలో నిల్వ చేయండి. ఈ లడ్డూలు కనీసం ఒక నెల పాటు ఉంటాయి.
3. కొబ్బరి ఖోవా గుల్కండ్ లడ్డూ
10 నుండి 12 లడ్డూలను తయారు చేయడానికి కావలసినవి:
2 కప్పులు - ఎండిన కొబ్బరి
3/4 కప్పు - తీపిలేని కోవా / మావా
3/4 కప్పు - చక్కెర
4 - గ్రీన్ ఏలకులు / ఎలాచి
2 టేబుల్ స్పూన్లు - గుల్కంద్
2 టేబుల్ స్పూన్లు - వెచ్చని పాలు
చిటికెడు - కుంకుమపువ్వు (ఇష్టమైతే)
2 టేబుల్ స్పూన్లు - తరిగిన పిస్తా (ఇష్టమైతే)
తయారీ పద్ధతి
1. కుంకుమపువ్వును గోరువెచ్చని పాలలో 5 నుండి 10 నిమిషాలు నానబెట్ట౦డి. అలాగే, పిస్తాను సన్నగా తరిగి పక్కన పెట్టండి.
2. పంచదార మరియు ఏలకులను మెత్తగా రుబ్బుకోవాలి.
3. కడాయిలో కోవా వేసి అది కరిగి , వదులుగా అయేవరకు 2-3 నిమిషాలు నెమ్మదిగా తక్కువ మంటలో ఉడికించాలి. మంటను సిమ్ లో మాత్రమే ఉంచండి లేదా కోవా మాడిపోతుంది. ఇపుడు మంటను ఆపివేయండి. ఈ కోవాలో కుంకుమపువ్వు పాలు, చక్కెర పొడి వేసి బాగా కలపండి. , చల్లబడనివ్వండి.
4. కోవా మిశ్రమంతో ఎండిన కొబ్బరిని వేసి, మెత్తని పిండిలాగా తయారు చేయడానికి బాగా కలపండి.
5. ఈ మిశ్రమాన్నిసమానమైన 10 నుండి 12 భాగాలుగా విభజించండి. ఒక భాగాన్ని తీసుకుని, బాల్ లేదా లడ్డూ లాగా రోల్ చేయండి. దానిని కట్లెట్ లేదా టిక్కీ లాగా చదును చేయండి.
6. 1 నుండి 2 టీస్పూన్ల గుల్కంద్‌ను మధ్యలో నింపి, జాగ్రత్తగా అంచులను ఒకచోట చేర్చి, మళ్లీ బాల్ లేదా లడ్డూగా తయారు చేయండి.
7. గుల్కంద్ పక్కల నుండి లీక్ అవ్వకుండా దీన్ని జాగ్రత్తగా చేయండి. ఆపై దానిని సున్నితంగా నొక్కండి. మీరు లడ్డూలో గుల్కంద్ చిన్న చుక్కలుగా కనిపిస్తే, అది అందంగా ఉంటుంది. మిగిలిన లడ్డూలను కూడా అలాగే చేసి, తరిగిన పిస్తాతో అలంకరించండి లేదా కొబ్బరిలో రోల్ చేయండి.
8. మిగిలిన డ్రై ఫ్రూట్స్ ఇంకా నట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేయండి.
మీకు ఇష్టమైన దేవుడు - గణేశుడికి రుచికరమైన లడ్డూలను నివేదించి మీరు, మీ పిల్లలు ఓ పట్టు పట్టండి! మీకు ఇలాంటి ఆసక్తికరమైన మరియు సులభమైన వంటకాలు ఏవైనా తెలిసిఉంటే, దయచేసి దిగువ కామెంట్ సెక్షన్లో షేర్ చేయడానికి సంకోచించకండి.
Be the first to support
Be the first to share
Comment (0)