ఆఫ్రికా బయట తొలి మంకీపాక్ ...
పొద్దున్నే కాఫీ కప్పుతో పాటు పేపర్ తీసింది అమృత. ఇతర దేశాల్లో మంకీపాక్స్ తో తొలి మరణం అన్న వార్త ఆమె దృష్టిని ఆకర్షించింది. ఇక తెలుగు రాష్ట్రాల వార్తలలోకి వస్తే.. పొరుగునే ఉన్న గుంటూరులో ఒక బాలుడికి ఆ వ్యాధి లక్షణాలు కనిపించాయని చదివింది. దానితో ఆమెకు కంగారు పుట్టింది. సరైన వివరాలు, సమాచారం గురించి మరింత వెదకడం మొదలుపెట్టింది. మరి అమృత లాంటి వారు ఎందరో ఉన్నారు కదా.. వారందరి కోసం మంకీపాక్స్ తాజా వివరాలతో ఈ బ్లాగ్.. మీకోసం!
పొరుగున ఉన్న తెలంగాణాలోని కామారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో ఒకొక్క అనుమానిత మంకీపాక్స్ కేసులు సంచలనం సృష్టించాయి. వాటిలో కామారెడ్డి వ్యక్తికి వ్యాధి సోకలేదని నిర్ధారణ కాగా, ఖమ్మం వ్యక్తికి సంబంధించిన వైద్య పరీక్షా ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది. ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ లో అనుమానిత మంకీపాక్స్ కేసు కలకలం సృష్టించింది. దద్దుర్లు కనిపించటంతో గుంటూరుకు చెందిన ఎనిమిదేళ్ల బాలుడిని జీజీహెచ్ ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. అక్కడ ప్రత్యేక వార్డులో ఉంచి వైద్యులు ఆ బాలుడికి చికిత్స అందిస్తున్నారు. మంకీపాక్స్ లక్షణాలు కనిపించటం వల్ల బాలుడి శాంపిల్స్‌ను గాంధీ ఆసుపత్రికి పంపించినట్లు తెలిపారు. ఇంతకుముందు విజయవాడలోనూ ఓ చిన్నారిలో లక్షణాలు కనిపించాయి. అయితే, పరీక్షల్లో నెగెటివ్‌గా తేలింది.
ఇదిలా ఉండగా, మంకీపాక్స్‌ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించి వారం గడవక ముందే మరిన్ని దేశాలకు వైరస్ విస్తరించింది. తాజాగా ప్రపంచంలో బయటిదేశాల్లో తొలి మంకీపాక్స్ మరణం రికార్డు అయ్యింది. ఈ వ్యాధి మొదటగా వెలుగు చూసింది ఆఫ్రికాలోనే. అప్పటి నుంచి ఆఫ్రికా దేశాల్లోనే అత్యధిక మంకీపాక్స్ కేసులు, మరణాలు సంభవించాయి. అయితే ఇపుడు తొలిసారిగా ఆ ఖండానికి వెలుపల ఓ మంకీపాక్స్ మరణం నమోదు కావడం గమనార్హం. దక్షిణ అమెరికా దేశమైన బ్రెజిల్‌లో ఓ 41 ఏళ్ల వ్యక్తి Monkeypoxతో మరణించాడని అక్కడి వైద్యాధికారులు ప్రకటించారు.
బ్రెజిల్, మినాస్ గెరాయిస్ రాష్ట్ర రాజధాని బెలో హోరిజోంటేలో ఒక వ్యక్తి మంకీపాక్స్‌తో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. అయితే అతనిలో రోగనిరోధక వ్యవస్థ (ఇమ్యూనిటీ) చాలా బలహీనంగా ఉందని, అతనికి అనేక ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయని వైద్యులు వెల్లడించారు.
జూన్ 10వ తేదీన యూరప్ నుంచి వచ్చిన ఓ వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు బయటపడ్డాయి. వైరస్ నిర్ధారణ కావడంతో బ్రెజిల్‌లో తొలి కేసు నమోదు అయ్యింది. ఇప్పటిదాకా వెయ్యి దాకా మంకీపాక్స్ కేసులు బ్రెజిల్‌లో నమోదు అయ్యాయి. సావో పాలో, రియో డీ జనెరియోలోనే ఎక్కువ కేసులు వెలుగు చూశాయి.
మంకీపాక్స్ ఎవరికైనా సోకవచ్చు. గట్టిగా తుమ్మినా, దగ్గినా తుంపర్ల ద్వారా ఈ వ్యాధి ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తోంది. ఐతే ఇది ప్రమాదకరం కాదు. సరైన చికిత్సతో ఈ వైరస్ నుంచి బయటపడొచ్చు.
మంకీపాక్స్ ఇంతకాలం ఆఫ్రికాకే పరిమితమై౦ది. కానీ, ఈ మధ్య బయటి దేశాల్లోనూ విజృంభిస్తోంది. డబ్ల్యూహెచ్‌వో గణాంకాల ప్రకారం.. ఇప్పటిదాకా 78 దేశాల్లో మంకీపాక్స్ కేసులు వెలుగు చూశాయి. 70 శాతం యూరప్ దేశాల్లో, 25 శాతం అమెరికాలో బయటపడ్డాయి.
జ్వరం, హై ఫీవర్, వాపు లక్షణాలు, చికెన్‌పాక్స్ తరహా ఒంటిపై దద్దర్లు తదితర లక్షణాలు కనిపిస్తే తక్షణమే వైద్యులను సంప్రదించాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇప్పటిదాకా నమోదు అయిన కేసుల్లో ఎక్కువ శాతం కేసులు లైంగిక ధోరణి వల్లే నమోదు అయ్యాయి. దీంతో WHO ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా .. సెక్స్ పార్ట్‌నర్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు సైతం జారీ చేసింది.
ఆ బ్లాగ్ మీకు నచ్చిందా? షేర్ చేయండి. మరింత ఉపయోగకరమైన సమాచారం కోసం parentune.com తెలుగులో ఫాలో అవండి!
Be the first to support
Be the first to share
Comment (0)