అమెరికా స్కూలులో కాల్పుల ...
చక్కగా ఇస్త్రీ చేసిన స్కూల్ యూనిఫాం.. పాలిష్ చేసిన నల్లటి బూట్లు.. బురద అంటుకున్న ఒక జత స్పోర్ట్స్ షూలు.. నాతో ఎవరు అడతారు అన్నట్టు ఉన్న బొమ్మలు.. వార్డ్‌రోబ్‌లో చక్కగా క్రేయాన్‌లతో గీసిన ఫామిలీ డ్రాయింగ్- సెప్టెంబరు 8, 2017 లో తన సీనియర్ విద్యార్థి చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఎనిమిదేళ్ల ప్రద్యుమ్న ఠాకూర్ తల్లితండ్రులకి మిగిలినవి ఇవే... పరీక్షలను ఇంకా పేరెంట్-టీచర్ మీటింగ్ ని వాయిదా పడేలా చూడడ౦ కోసం తానే ఆ పసివాడిని చంపినట్లు సదరు యువకుడు ఒప్పుకున్నాడు.
అదే సంవత్సరం ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో 1వ తరగతి విద్యార్థిపై అతని సీనియర్ బాలిక కత్తితో దాడి చేసింది - ఈ కేసు పైన చెప్పిన గుర్గావ్‌లోని ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో జరిగిన హత్య ఘటనను పోలి ఉంటుంది.
ఇక తాజాగా మంగళవారం టెక్సాస్‌లోని ఓ ప్రాథమిక పాఠశాలలోకి ప్రవేశించిన టీనేజ్ యువకుడు కాల్పులకి పాల్పడ్డాడు. ఈ ఘటనలో కనీసం 18 మంది పిల్లలు, ఇద్దరు పెద్దలు చనిపోయారు.
మరి ఇటీవల పెరుతుతున్న ఇలాంటి సంఘటనల్ని చూసాక, మన పిల్లలు పాఠశాలలో నిజంగా సురక్షితమేనా అనే ప్రశ్న ప్రతి తల్లితండ్రిలో తలెత్తడం సహజమే. ఈ నేపధ్యంలో పేరెంట్స్ జాగ్రత్త పడాల్సిన, పరిగణన లోకి తీసుకోవాల్సిన కొన్ని అంశాలు ఇవే..
పాఠశాల అత్యవసర పరిస్థితులను ఎలా నిర్వహిస్తుందో, ఇంకా విద్యార్థులు ఏ నియమాలను అనుసరించాలో తెలుసుకోవడం ముఖ్యం. ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో, మీ పిల్లలతో పాఠశాల హ్యాండ్‌బుక్‌ని సమీక్షించండి. ఈ గైడ్ సాధారణంగా దుస్తుల కోడ్, సందర్శకుల విధానం, ఏమర్జన్సీ నిర్వహణ, ఇంకా బెదిరింపులపై పాఠశాల వైఖరితో సహా తల్లిదండ్రుల అనేక ప్రశ్నలకు సమాధానమిస్తుంది. మరింత వివరణ కోసం స్కూల్ పరిపాలనా కార్యాలయాన్ని సంప్రదించండి.
పిల్లల భద్రత కోసం నిర్దారించుకోవాల్సిన అంశాలు
మీ పిల్లలు సురక్షితమైన వాతావరణంలోనే చదువు కుంటున్నారా అని తెలుసుకునేందుకు, అని పాఠశాల యాజమాన్యంతో ఈ అంశాలను నిర్ధారించుకోండి.
స్కూల్ లో చోటుచేసుకునే బెదిరింపులకు జీరో-టాలరెన్స్ పాలసీ ఉందా?
మీ పిల్లవాడు స్కూల్లో ఏవైనా అవాంచిత సంఘటనలు జరిగినపుడు పిల్లలను ఎలా సిద్ధం చేస్తారు లేదా అప్రమత్తం చేస్తారు?
ప్రకృతి వైపరీత్యాలు లేదా అత్యవసర పరిస్థితి ఏర్పడితే ఏ ప్రణాళికలు అమలు చేస్తారు?
అత్యవసర కసరత్తులు లేదా ఎమర్జన్సీ డ్రిల్ ను ఎన్నాళ్ళకు ఒకసారి నిర్వహిస్తారు?
సందర్శకులను పాఠశాల మైదానంలోకి లేదా తరగతి గదుల్లోకి అనుమతిస్తారా?
ఇటువంటి అంశాలను ఉపాధ్యాయులు మరియు నిర్వాహకులతో క్రమం తప్పకుండా మాట్లాడండి.
పాఠశాల భద్రతా విధానంపై అప్డేట్ గా ఉండటానికి మరియు ఏవైనా భద్రతా సమస్యలను నివారించడానికి ఉపాధ్యాయులు మరియు నిర్వాహకులతో రోజూ లేదా తరచుగా మాట్లాడటం ఉత్తమ మార్గం. ఈ సంభాషణల వాళ్ళ మీ పిల్లలు ఏవైనా సమస్యలు ఎదుర్కొంటున్నట్లైతే, అవి వెలుగులోకి వస్తాయి. COVID-19 లేదా ఇతర కారణాల వాళ్ళ వీలున్కాక్పోతే మీరు జూమ్ మీటింగ్, ఇమెయిల్ లేదా ఫోన్ ద్వారా కూడా ఈ విషయాలపై స్పష్టత కోరవచ్చు.
మీ చినారుల పాఠశాల పేరెంట్-టీచర్ మీటింగ్ లను ఏర్పాటు చేయకుంటే, ప్రతి సెమిస్టర్ లేదా ప్రతి విద్యా సంవత్సరం మధ్యలో లేదా ముగింపులో అడ్మినిస్ట్రేటర్ ను తప్పనిసరిగా కలవండి.
ఉపాధ్యాయులు లేదా నిర్వాహకులతో సమావేశాలకు హాజరైనప్పుడు, ప్రశ్నల వ్రాతపూర్వక జాబితాతో సిద్ధంగా ఉండండి. ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఉన్నాయి:
మీ పిల్లలతో ఓపెన్ గా మాట్లాడండి
మీ పిల్లలతో చక్కని సంభాషణను నిర్వహించడం, వారి ఆత్మగౌరవాన్ని మరియు పరస్పర గౌరవాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది. ఇది చాలా సమస్యలను నివారిస్తుంది. ఓపెన్ గా ఇంకా నిజాయితీగా మాట్లాడగలిగే సురక్షితమైన వాతావరణాన్ని ఇంట్లో సృష్టించడంపై మీరు దృష్టి పెట్టండి. కనీసం వారానికి ఒకసారి, మీ పిల్లలను డిన్నర్‌టైమ్ లేదా ఏదైనా అనుకూలమైన సమయంలో ఈ కింది ప్రశ్నలు అడగ౦డి.
ఆధునిక సాంకేతికత ద్వారా..
మీ పిల్లలకు ఆధునిక సాంకేతికతను అందించడం ద్వారా వారి సురక్షతను మీరు పర్యవేక్షి౦చవచ్చు. ఇందుకు మీరు కొంత సంకోచించవచ్చు. అయితే వారి పిల్లల సోషల్ మీడియా మరియు ఇంటర్నెట్ వినియోగం, ప్రస్తుత భౌతిక స్థానం మరియు మరిన్నింటిని పర్యవేక్షించడం ద్వారా వారిని సురక్షితంగా ఉంచే పరికరాలు ఉన్నాయి. ఈ పరికరాలు సైబర్ బెదిరింపుల గురించి మిమ్మల్ని హెచ్చరించగలవు. ఆ విధంగా మీ బిడ్డ అన్ని సమయాల్లో ఎక్కడ, ఎలా ఉన్నారో మీరు నిర్ధారించుకోవచ్చు. పిల్లలకు అనుకూలమైన, వారు ధరించగలిగే సాంకేతిక పరికరాలు వారికి ఇవ్వండి. వాటి ద్వారా మీ పిల్లలు ఎక్కడ, ఎలా ఉన్నారో ట్రాక్ చేయదానికి వీలవుతుంది.
పైన చెప్పిన చిట్కాలతో పాటు, మీ బిడ్డను సురక్షితంగా ఉంచడానికి ఉత్తమ మార్గం, వారితో మాట్లాడటం అని గుర్తుంచుకోండి. విద్యార్థులందరికీ రక్షిత వాతావరణాన్ని కల్పించినప్పుడు మాత్రమే, మీరు మీ బిడ్డ పాఠశాలలో అభివృద్ధి చెందడాన్ని మీరు చూడగలరు.
మరి, మీ బిడ్డను పాఠశాలలో సురక్షితంగా ఉంచడంలో మీరు విజయం సాధించారా? ఈ విషయమై ఇక్కడ వ్యాఖ్యానించండి ఇంకా ఇతర తల్లితండ్రులతో మీ చిట్కాలను షేర్ చేసుకోండి !
Be the first to support
Be the first to share
Comment (0)