గర్భిణీ స్త్రీలకు తెలంగ ...
శారద వాళ్ళ హస్బండ్ కి తెలంగాణాలోని ఒక చిన్న ఊరిలో జాబ్ కావడంతో తను అక్కడే ఉంటోంది. అక్కడ అన్నీ బాగానే ఉన్నా, ప్రస్తుతం గర్భవతి అయిన శారదకు ఆహారం విషయంలో ఇబ్బంది అవుతోంది. బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలో, ఏం తింటే ఏం ప్రయోజనమో మొదటిసారి తల్లి కాబోతున్న ఆమెకు తెలీయడం లేదు. ఇక అన్నిపనులు తనే చేసుకోవాల్సి రావడమో ఇంకా నీరసం అవుతోంది. ఇంతలో పేపర్లో చదివిన ఒక వార్తతో ఆమెకు ఎంతో సంతోషం కలిగింది. అదేమిటంటే..
కేసీఆర్ పోషకాహార కిట్
తెలంగాణ ప్రభుత్వం మహిళల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. గర్భిణుల్లో పౌష్టికలోపాల్ని తగ్గించి ఆరోగ్యవంతమైన శిశువులకు జన్మనిచ్చేందుకు కొత్తగా కేసీఆర్ పోషకాహార కిట్ (KCR Nutrition Kit)ను అందుబాటులోకి తీసుకురానుంది. రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు వివరాలు వెల్లడించారు. దసరా పండుగను పురస్కరించుకుని, సెప్టెంబర్ 25న ప్రార౦భం కానున్న బతుకమ్మ పండుగ కానుకగా ఈ కిట్‌లను ఆడపడచులకు అంది౦చనున్నారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు బిడ్డకు అవసరమైన 16 రకాల వస్తువులు ఉండే కె.సి.ఆర్. కిట్ పథకం, గర్భిణిలు ప్రసవం కోసం ఆసుపత్రికి వెళ్ళడంకోసం ప్రత్యేక వాహన సదుపాయాన్ని అందించే అమ్మఒడి పధకాలు ఇప్పటికే రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయి. ఇపుడు రాష్ట్ర ప్రభుత్వం గర్భవతుల సంక్షేమం కోసంఈ పౌష్టికాహార కిట్ పధకాన్ని తీసుకురానుంది.
కేసీఆర్ పోషకాహార కిట్ ఎ౦దుకు?
రాష్ట్రంలో ఎక్కువ శాతం గర్భిణులు రక్తహీనతతో బాధపడుతున్నారని ప్రభుత్వం గ్రహించింది. ప్రధానంగా రక్తహీనతతో బాధపడుతున్న కొమురంభీం, ఆదిలాబాద్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, వికారాబాద్, గద్వాల, నాగర్ కర్నూలు, ములుగు జిల్లాల్లోని గర్భిణీల కోసం ముందుగా కేసీఆర్ పోషకాహార కిట్ పథకం అమలు చేస్తామని వైద్య వర్గాలు వెల్లడించాయి. ఈ కిట్ వల్ల పేదలకు ఎంతో ప్రయోజనం కలుగుతోందని, అలాగే తల్లీబిడ్డల మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిందని అధికారులు వెల్లడించారు. ఈ న్యూట్రీషన్ కిట్‌తో రక్తహీనత తగ్గి గర్భిణలు ఆరోగ్యంగా ఉంటారంటున్నారు. మొదట 1.5లక్షల మందికి ఈ కిట్‌లు అందజేస్తామని, ఆ తర్వాత ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తారు.
ఈ కిట్ లో ఏం ఉంటాయంటే..
పోషకాహార కిట్‌లో ఒక కేజీ న్యూట్రీషనల్ మిక్స్ పౌడర్ (రెండు బాటిళ్లు), ఒక కేజీ ఖర్జూరం, మూడు బాటిళ్ల ఐరన్ సిరప్, ఒక అల్బెండజోల్ మాత్ర, అర కేజీ నెయ్యి ఉంటుంది. కిట్‌లో ఒక ప్లాస్టిక్ కప్‌ను కూడా ఇస్తారు. ఇవన్నీ కలిపి ఒక బాక్స్‌లో ఇవ్వాలని నిర్ణయించారు. మహిళల్లో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచేందుకు ప్రొటీన్లు, మినరల్స్ మరియు విటమిన్లు సమృద్ధిగా ఉండే ఉత్పత్తులు ఈ కిట్‌లో ఉంటాయి.
ఎవరికీ ఇస్తారంటే..
ఒక్కో కిట్ విలువ సుమారు రూ.2 వేల వరకు ఉంటుందని మంత్రి హరీశ్ తెలిపారు. గర్భిణీ స్త్రీలు గర్భం దాల్చిన మూడు, ఆరో నెలల్లో పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చినప్పుడు, వారికి ఈ కిట్‌లను అందచేస్తారు. ఇందుకోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి౦ది. ఇదిలా ఉండగా కేసీఆర్ కిట్ పథకం ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య 54 శాతం పెరిగిందని వైద్య వర్గాలు చెబుతున్నాయి.
మా బ్లాగ్ మీకు నచ్చిందా? ఉపయోగకరంగా ఉందా? మరి ఈ వివరాలు అందరికీ తెలిసేలా లైక్, కామెంట్, షేర్ చేయండం మర్చిపోవద్దు!
Be the first to support
Be the first to share
Comment (0)