ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఎం ...
ఒకప్పుడు, ఒక చిన్న అమ్మాయి నా కళ్లలోకి చూస్తూ, నేనే తనకు స్ఫూర్తి అని చెప్పింది. ఆమె నా స్టూడెంట్; ఆమె మాటలు నాకు స్ఫూర్తిగా నిలిచాయి. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా, మనం గొప్ప ఉపాధ్యాయులను స్మరించుకుంటాము. 7వ తరగతిలో ఇంగ్లీష్ మాడంని, ప్రాజెక్ట్‌ని పూర్తి చేయడంలో సహాయపడటానికి రాత్రి వరకు సహాయం చేసినప్రొఫెసర్‌ని, లేదా మీరు ఎప్పటికీ ఫిజిక్స్ చదవాలని కోరుకునేలా చేసిన 9వ తరగతి ఫిజిక్స్ టీచర్‌ని స్మరించుకుంటున్నాము.
ఉపాధ్యాయుల దినోత్సవ౦ అనేది ప్రపంచవ్యాప్తంగా, వివిధ దేశాలలో వివిధ రోజులలో జరుపుకునే ఒక సందర్భం. భారతదేశంతో సహా అనేక దేశాల్లో, డాక్టర్ రాధాకృష్ణన్ పుట్టినరోజు జరుపుకుంటారు. ఈ రోజు కొంతమంది ప్రముఖ వ్యక్తులను లేదా ఉపాధ్యాయులను స్మరించుకుంటారు. విద్యారంగంలో తాము సాధించిన ముఖ్యమైన మైలురాళ్ళను జరుపుకుంటారు. ఇతర ప్రదేశాలలో, విద్యార్థులు తమ ఉపాధ్యాయులకు గౌరవం ఇచ్చే రోజు ఇది. ఉదాహరణకు, నేపాల్లో ఆషాఢ మాసం పౌర్ణమి నాడు గురు పూర్ణిమగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇక USAలో మేలో టీచర్స్ అప్రిషియేషన్ వీక్ జరుపుకుంటారు. ఆ వారంలోని మంగళవారాన్ని టీచర్స్ డేగా పరిగణిస్తారు. అయితే, యునెస్కో సెప్టెంబర్ 5న ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని గుర్తించింది.
ఉపాధ్యాయ దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా మాత్రమే కాదు, వ్యక్తిగతంగా ప్రతి విద్యార్థికి ముఖ్యమైనది. గురుకుల వ్యవస్థ యువ రాజులు మరియు యోధులకు రాజ్య నైపుణ్యం, యుద్ధంతో పాటు కళలు మరియు సాహిత్యం నేర్పించేది. అనడికాలంలోనే ఇంతప్రతిభ కనబరిచిన మన దేశంలో, ఉపాధ్యాయులకు అన్ని కాలాల్లో చాలా గౌరవం ఉంది.
ఉపాధ్యాయులు మన పిల్లల మనస్సులను ప్రేరేపిస్తారు, ప్రకాశవంతం చేస్తారు. అదేవిధంగా, మన పిల్లలు కూడా వారి పాఠశాల లేదా విద్యా సంవత్సరం ముగింపుతో విద్య ముగియదని గ్రహించడం, తమ ఉపాధ్యాయుల పట్ల తగిన ప్రేమ మరియు గౌరవం ఇవ్వడమనే గొప్ప బాధ్యతను కలిగి ఉంటారు. జీవితం మనకు ఇచ్చే అనంతమైన అవకాశాలకు తమ మనస్సులను ఎలా తెరవాలో ఉపాధ్యాయులు విద్యార్ధులకు దారి చూపిస్తారు. తీచార్స్ డే నాడు పిల్లలు, ఉపాధ్యాయులకు స్వంతంగా తయారు చేసిన కార్డులు, పువ్వులు బహుమతిగా ఇవ్వడం, వారి కోసం ప్రోగ్రామ్‌లు చేయడం ఇంకా పెద్ద పిల్లలు, చిన్న తరగతులను నిర్వహించడం కు బాధ్యత వహించడం అద్భుతమైనది. ఆ రోజు ఉపాధ్యాయులు ఆటలతో సరదాగా గడుపుతారు. ఆ ప్రేమ, గౌరవం మరియు స్నేహాన్ని ఏడాది పొడవునా సజీవంగా ఉంచడం కూడా ఒక ముఖ్యమైన జీవిత పాఠం.
ఇప్పుడు ఆ చిన్న అమ్మాయి నా స్వంత చిన్న కుమార్తెలాగా కనిపిస్తుంది. ధృవీకరణ, ఆప్యాయత మరియు మార్గదర్శకత్వం కోసం, ఆమె ప్రతిరోజూ నా కళ్ళలోకి వెయ్యి సార్లు చూస్తుంది. తను చేసింది సరైనదా లేదా తప్పా అని మిలియన్ ప్రశ్నలు నన్ను అడుగుతుంది. నేను టీచర్‌గా కొనసాగుతున్నానని అది నాకు అర్థమయ్యేలా చేస్తుంది. ఇది బహుశా నా జీవితంలోనే అతిపెద్ద టీచర్ పాత్ర. తల్లిదండ్రులుగా, మనఓ కూడా వారికి గొప్ప ఉపాధ్యాయుల౦. వారి మార్గాన్ని వెలిగించటానికి, వారికి మంచి భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేస్తా౦. వారి జీవిత ప్రయాణంలో వారు స్వీకరించే మరియు వారిని ముందుకు తీసుకెళ్లే క్రమంలో మనం చాలా ముఖ్యమైన వ్యక్తులుగా ఉంటాము.
ముగించే ముందు, ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా, ఇప్పటికీ విద్యను పొందలేని కొంతమంది చిన్నారులు, పసివారందరినీ నేను గుర్తుంచుకోవాలనుకుంటున్నాను. నిజానికి, మన మహిళా జనాభాలో దాదాపు సగం కంటే ఎక్కువ మంది నిరక్షరాస్యులు. మన విద్యావ్యవస్థను మనం నిశితంగా పరిశీలించి, మన దేశంలోని చిన్నపిల్లలందరికీ మరింతగా కలుపుకొని, దానిని మరింత ఉత్తమమైనదిగా మార్చడానికి ఇదే సమయం!.
[ఈ కంటెంట్ పేరెన్ట్యూన్ నిపుణుల ప్యానెల్‌లోని వైద్యులు మరియు నిపుణులచే తనిఖీ చేయబడింది & ధృవీకరించబడింది. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సెలర్, ఎడ్యుకేషన్ & లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడియాట్రీస్ట్ ఉన్నారు.]
Be the first to support
Be the first to share
Comment (0)