మగవారు తండ్రి కావడానికి స ...
పిల్లల విషయానికి వస్తే, మహిళల జీవితంలో అత్యంత సారవంతమైన సంవత్సరాలు తమ ఇరవైలని, ఇంకా 30 ఏళ్లు వచ్చేలోపు వారు మొదటి బిడ్డను కనడం ఎల్లప్పుడూ ఉత్తమం అని అంటారు. మరి పురుషులు తండ్రి కావటానికి ఉత్తమ వయస్సు ఏది?
పురుషులకు జీవ గడియారం చాలా ముఖ్య౦. వారిలో వయసుతో పాటు స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. ఒక వ్యక్తి తండ్రిగా ఉండటానికి అతని 25 నుండి 35 వరకు ఉత్తమమని.. ఆ సమయంలో అతని గరిష్ట స్థాయిని కొనసాగిస్తాడని నిపుణులు అంటున్నారు.
నిజానికి ఆరోగ్యకరమైన స్పెర్మ్ కౌంట్ ఉన్నంత వరకు పురుషుడు తండ్రి కాగలడు. అంటే మగవారు జీవితాంతం పునరుత్పత్తి శక్తిని కలిగి ఉంటారు. కాబట్టి ఏ వయసులో అయినా ఆరోగ్యకరమైన స్పెర్మ్ కౌంట్ కలిగి ఉంటే తండ్రి కావొచ్చు. ఇక వయసు గురించి కచ్చితంగా చెప్పాలంటే ఇక వ్యక్తీ సాధారణంగా 19 సంవత్సరాల నుంచి 70 ఏళ్ళ చివరిలో కూడా తండ్రి కాగలడు. తండ్రి కావడానికి ప్రత్యేక వయస్సు అంటూ ఏది లేదు.
మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నవి పూర్తిగా జీవ సంబంధమైనవి అయితే, తండ్రి కావడానికి వయస్సుతో పాటు సామాజిక, ఆర్థిక అంశాలు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఆర్థికంగా స్థిరంగా లేని వ్యక్తీ , తనకి, కుటుంబానికి అవసరమైన వాటిని సమకూర్చుకోలేక, పిల్లల్ని కనడం కాస్త ఆలోచిస్తాడు. ఎందుకంటే పిల్లలకి ప్రేమ, సంరక్షణ, సౌకర్యవంతమైన పరిసరాలనేవి చాలా ముఖ్యం.
ఒక వ్యక్తి తన 50 ఏళ్లు మరియు తరువాతి వయస్సులో ఉన్నా, బిడ్డకు తండ్రి కావడం సాధ్యమే. ఇదాహరనగా చెప్పాలంటే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం, 92 ఏళ్ల వయస్సు గల వ్యక్తి తండ్రి కావటం ఇప్పటి ప్రపంచ రికార్డు..
పురుషులలో స్పెర్మ్ ఉత్పత్తి ఎప్పటికీ ఆగదు. కానీ దీని అర్థం వారికి జీవ గడియారం పనిచేయదని కాదు. మనిషి వయస్సు పెరిగేకొద్దీ, అతని స్పెర్మ్ జన్యు ఉత్పరివర్తనాలకు లోనవుతుంది. ఇది స్పెర్మ్ యొక్క DNA దెబ్బతినే సంభావ్యతను పెంచుతుంది. ఇది సంతానోత్పత్తి మరియు భవిష్యత్తులో పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.
ముదిరిన వయస్సులో ఉన్న తండ్రులకు పుట్టిన పిల్లల్లో, నరాలకు సంబంధించిన అవకరాలు ఉండే అవకాశం ఉంది అని - 40 మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల పురుషుల సంతానాన్ని గురించిన 2010 అధ్యయనం పేర్కొంది. ఈ పిల్లలకు ఆటిజం, స్పెక్ట్రమ్ డిజార్డర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఐదు రెట్లు ఎక్కువగా ఉందని వారు గుర్తించారు.
సాధారణంగా, పురుషులు స్పెర్మ్ ఉత్పత్తి చేయడాన్ని ఎప్పటికీ ఆపరు - కాని వయస్సుతో పాటు దాని నాణ్యత క్షీణిస్తుంది. అందువల్ల, నాణ్యతను నిలుపుకోవడానికి తగినంత వ్యాయామం చేయడం, పని చేయడం, మరియు ఆరోగ్యకరమైన భోజనం ఇంకా జీవనశైలిని అనుసరించడం ముఖ్య౦. కాబట్టి, 35 ఏళ్లతర్వాత క్రమం తప్పకుండా స్పెర్మ్ క్వాలిటీని చెక్ చేసుకోవడం మంచిది.
పెద్ద వయస్సు మాత్రమే కాదు, కొన్ని సందర్భాల్లో, బిడ్డకు తండ్రి కావడానికి చాలా చిన్నవాడు కావచ్చు. జర్నల్ ఆఫ్ ఎపిడెమియాలజీ & కమ్యూనిటీ హెల్త్ పరిశోధన ప్రకారం, 25 ఏళ్లలోపు తండ్రి కావడం తీవ్రమైన ఆరోగ్య పరిణామాలకు దారి తీస్తుంది. మధ్య వయస్సులో అకాల మరణం కూడా సంభవించవచ్చు. ఈ పురుషులు చిన్న వయస్సులోనే చనిపోయే అవకాశం ఉంది. వీరు, వీరి తరువాత తండ్రిగా మారిన వారి కంటే తక్కువ ఆరోగ్యం కలిగి ఉంటారు.
తల్లిదండ్రులుగా మారడం చాలా బాధ్యతలతో కూడుకున్నది. మీరు మీ జీవన విధానంలో మార్పులు చేసుకోవాలి. మీ పిల్లలతో గడిపేందుకు సమయాన్ని వెచ్చించాలి. మీ జీవితంలో దాదాపు 3 నుంచి 4 సంవత్సరాలు పిల్లల చుట్టూ తిరుగుతుంది. ఎందుకంటే మీ చిన్నారికి మీనుండి చాలా జాగ్రత్త అవసరం. తల్లిదండ్రులుగా మారడం ద్వారా వచ్చే బాధ్యతలను స్వీకరించడానికి మీరు, మీ భాగస్వామి సిద్ధంగా ఉ౦టే, తండ్రి కావడానికి ఇదే సరైన సమయం మరి. ఆల్ ది బెస్ట్!
Be the first to support
Be the first to share
Comment (0)