1. డెలివరీ తరువాత వచ్చే పొట్ ...

డెలివరీ తరువాత వచ్చే పొట్ట, అదనపు బరువు తగ్గడానికి సూపర్ అండ్ సింపుల్ టిప్స్!

Pregnancy

Ch  Swarnalatha

2.6M వీక్షణలు

2 years ago

డెలివరీ తరువాత వచ్చే పొట్ట, అదనపు బరువు తగ్గడానికి సూపర్ అండ్ సింపుల్ టిప్స్!
జననం - డెలివరీ
రోజువారీ చిట్కాలు
వ్యాధి నిర్వహణ & సెల్ఫ్‌కేర్
మెదడుకు మేత
ఆహారపు అలవాట్లు
ఆహార ప్రణాళిక
ఇంటి నివారణలు
పోషకమైన ఆహారాలు
శారీరక అభివృద్ధి

ప్రసూన మొదటిసారి పండంటి పాపాయికి తల్లి అయింది. వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధే లేకుండా పోయింది. పాపకి జనని అని పేరుపెట్టుకుని ఇంట్లో వాళ్ళు, స్నేహితుల సహాయ సహకారాలతో తన బంగారు కొండని చాల జాగ్రత్తగా చూసుకుంటోంది. తల్లిప్రేమ, సంరక్షణలతో పాప హాయిగా, ఆరోగ్యంగా ఉంది. కానీ..

డెలివరీ తర్వాత కూడా ప్రసూన పొట్టపై భాగం చర్మం వదులుగా సాగినట్టు ఉండి ఎత్తుగా ఉండిపోయింది. దీనివల్ల అసౌకర్యంగా ఉండటమే కాకుండా మరల గర్భం ధరించినట్టు ఎత్తుగా కనిపించడంతో ఎం చేయాలో తెలియక అయోమయంలో పడింది. ఇంకా ఆలస్యమైతే తగ్గదని వీళ్ళు వాళ్ళు చెప్పడంతో కంగారు పడింది. డైటింగ్ మొదలుపెట్టి సరిగా తినడం మానేసింది. దానివల్ల పాపకు సరిపడా పాలు ఇవ్వలేకపోవడమే కాకుండా ఇతర సమస్యలు మొదలయ్యాయి.

More Similar Blogs

    ఐతే, ప్రసూన లాంటి వారు ఎటువంటి డైట్ చేయకుండా కొన్ని చిట్కాలను పాటిస్తే సులభంగా పొట్ట, బరువును తగ్గించుకోవచ్చు. ఎటువంటి డైటింగ్ లేకుండా సహజసిద్ధమైన పద్ధతిలో పొట్ట, బరువును తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. అపుడే తల్లి, బిడ్డ ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు అంటున్నారు. అవేంటో ఇప్పుడు ఈ బ్లాగ్ లో తెలుసుకుందాం..

    అసాధారణం కాదు: గర్భధారణ సమయంలో ఆ తరువాత కూడా బరువు ఎక్కువగా ఉండటం, పొట్ట ఎత్తుగా  అసాధారణమేమీ కాదని అర్ధం చేసుకోండి. అపుడే అది తగ్గడం సులువని మీకు అర్ధం అవుతుంది.. నమ్మకం కలుగుతుంది. కొందరు మహిళల్లో ఈ స్థితి ఒక సంవత్సరం పాటు ఉంటుంది. మళ్ళీ మామూలు కావడానికి కావాల్సిందల్లా ఓపిక, కాసింత జాగ్రత్త మాత్రమే.

    వేడి నీరు, నిమ్మరసం, తేనె: డెలివరీ తరువాత వచ్చే పొట్ట, బరువును తగ్గించుకునేందుకు గోరువెచ్చని నీరు చక్కటి పరిష్కారం. ప్రతిరోజు ఉదయం గోరువెచ్చని నీటిలో ఒక చెంచా నిమ్మరసం, ఒక స్పూన్ తేనె కలుపుకొని తాగండి. ఈ అలవాటు వల్ల పొట్ట భాగంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోయి, సాధారణ స్థితికి వచ్చెస్తుంది..బరువు కూడా సులభంగా తగ్గుతారు.

    యాలకులు, సోంపు: ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీళ్లు మరిగించాలి. దానిలో  నాలుగు యాలకులు, ఒక స్పూన్ సోంపు వేసి బాగా కలపాలి. ఇలా మరిగించిన నీరు గోరువెచ్చగా అయ్యాక  తీసుకుంటే శరీరంలో జీవక్రియల రేటు పెరిగి పొట్ట భాగంలో పేరుకుపోయిన అధిక కొవ్వు సులభంగా కరిగిపోతుంది. అంతేకాకుండా ఈ మిశ్రమం తల్లి, బిడ్డల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

    నువ్వుల నూనె (మంచినూనె): నువ్వుల నూనెను కొన్ని ప్రాంతాల్లో మంచిన్నోనే అనికూడా అంటారు. దానిలో సుగుణాలు అలాంటివి మరి. ఈ సేసెం ఆయిల్ తో పొట్ట భాగంపై పది నిమిషాలపాటు బాగా మర్దన చేసుకోవాలి. తరువాత గోరువెచ్చని నీటితో కాపురం పెట్టుకోవాలి. ఇలారోజూ చేస్తే పొట్ట భాగంలోని కండరాలు బిగుతుగా మారతాయి. డెలివరీ తరువాత పొట్ట వదులుగా అయినవారు ఈ చిట్కాను అనుసరించడం మంచిది.  

    గ్రీన్ టీ: గ్రీన్ టీ లో ఆంటీ ఆక్సిడెంట్స్ తో సహా అనేక పోషకాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇవి శరీర బరువును తగ్గించడానికి సహాయపడతాయి. కనుక డెలివరీ తరువాత పొట్ట, అధిక బరువు సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయం గ్రీన్ టీ తీసుకుంటే మంచిది. ఈ అలవాటుతో మరెన్నో ఆరోగ్యప్రయోజనాలు కూడా  మీ సొంతం అవుతాయి. కనుక బాలింతలు క్రమం తప్పకుండా గ్రీన్ టీని తాగండి.

    తల్లిపాలు ఇవ్వడం: కొందరు మహిళలు బిడ్డకు తమపాలు అందిస్తే వారి అందం దెబ్బతింటుందని ఆలోచిస్తున్నారు. నిజానికి తల్లి  బిడ్డకు చనుపాలు ఇవ్వడం బిడ్డ ఆరోగ్యానికి మాత్రమే కాదు తల్లి ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. తల్లిపాలు ఇచ్చే వారే చక్కని ఫిట్నెస్ తో ఉంటారని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేసారు. చనుపాలు ఇవ్వడం, తేలికైన వ్యాయామాలు చేయడంతో ఉదర భాగం కొవ్వును, శరీరంలో అదనపు  కొవ్వును తొలగించవచ్చు. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ వంటి ఇతర అనారోగ్య సమస్యలు దరిచేరవు. ఇంకా మరెన్నో ఆరోగ్యప్రయోజనాలు మీ సొంతమవుతాయి.

    మరింకెందుకు ఆలస్యం.. ప్రసూన లాగే మీరూ ఈ సింపుల్ అండ్ సూపర్ టిప్స్ తో ఆరోగ్యాన్ని, అందాన్ని మీ స్వంతం చేసుకోండి. మీకు తెలిసిన మరిన్ని చిట్కాలను కామెంట్ సెక్షన్లో పంచుకోండి.. మిగిన వారికోసం మా బ్లాగ్ ను షెర్ చేయండి!

     

    Be the first to support

    Be the first to share

    support-icon
    Support
    bookmark-icon
    Bookmark
    share-icon
    Share

    Comment (0)