మీ చిన్నారి మొదటి పుట్టిన ...
మీ బిడ్డ మొదటి పుట్టినరోజు పార్టీని ప్లాన్ చేస్తున్నారా? పుట్టినరోజు..మరీ ముఖ్యంగా మీ శిశువు మొదటి పుట్టినరోజు అనేది చాలా చాలా ప్రత్యేకమైన రోజు! బేబీ యొక్క ఫస్ట్ బర్త్ డే అనేది జీవితంలో ఒక్కసారే జరిగే వ్యవహారం. తల్లిదండ్రులుగా మనమందరం దానిని చిరస్మరణీయంగా మార్చాలని అనుకుంటాం కదా? అయితే, పార్టీ పనులు దేనితో ప్రారంభించాలి? థీమ్ ఎలా ఉండాలి? పార్టీ షెడ్యూల్ ఎలా ఉండాలి? అనే ప్రశ్నలు చాలానే ఎదురౌతాయి..
పిల్లల మొదటి బర్త్‌డే పార్టీ ఒత్తిడి లేకుండా ఇంకా గుర్తుండిపోయేలా చేయడానికి చిట్కాలు
ఫస్ట్ బర్త్ డే పార్టీ మీ కోసం మర్చిపోలేనిదిగా, ఒత్తిడి లేనిదిగా చేయడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.
వెన్యూ ఎక్కడ: ఇది ఇంట్లో, తోటలో కావచ్చు లేదా పార్టీకి వచ్చే పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని మీరు వేదికను బుక్ చేసుకోవచ్చు. వాతావరణాన్ని కూడా పరిగణనలోకి తీసుకోండి.
గడియారాన్ని చూడండి: పార్టీని తక్కువ సేపు ఉండేలా ప్లాన్ చేయండి. ఎందుకంటే చిన్న పిల్లలకు తక్కువ శ్రద్ధ, శక్తి ఉంటుంది. వారు త్వరగా ఆసక్తిని కోల్పోతారు. అందుకే శిశువు అలసిపోనప్పుడుఅంటే లేట్ మార్నింగ్ లేదా మధ్యాహ్నం తర్వాత, నిద్రానంతరం-పార్టీని ప్లాన్ చేయండి. అర్థరాత్రి పార్టీలకు దూరంగా ఉండండి.
విఐపిలు మాత్రమే: మీ బిడ్డకు భారం పడకుండా మరియు ఖర్చులను తగ్గించుకోవడానికి అతిథి జాబితాను పరిమితం చేయండి.
సహాయం కోసం అడగండి: హోస్ట్ గా మీ పనులను బ్యాలెన్స్ చేయడంలో సహాయం కోసం కుటుంబ సభ్యులను అడగడం వల్ల మీ భుజాలపై భారం తగ్గుతుంది, ఇంకా ప్రతి ఒక్కరూ పార్టీని ఆస్వాదించడానికి కూడా సహాయపడుతుంది.
అతిథులకు ఆహారం: సాండ్‌విచ్‌లు, రోల్స్, కేక్, చాక్లెట్, చిప్స్ వంటి సింపుల్ స్నాక్స్‌లను ఉంచండి, తద్వారా పార్టీకి వచ్చే ఇతర పిల్లలు కూడా ఆనందించవచ్చు.
పార్టీ గేమ్స్ మరియు ఆక్టివిటీస్: బిగ్గరగా వినిపించే సంగీతానికి బదులుగా నర్సరీ రైమ్స్ వినిపించండి. మీ చిన్నారితో కలిసి డాన్స్ చేయండి. చిన్న పిల్లలను భయపెట్టే పార్టీ పాపర్లు మరియు బెలూన్లు పేల్చడం వంటివి మానుకోండి.
థీమ్‌ను ఎంచుకోండి: మీ ఒక సంవత్సరం పిల్లలకు ఇది అర్ధం కానప్పటికీ మీరు ఒక చక్కటి థీమ్‌ను ఎంచుకోవచ్చు. కలర్-కోఆర్డినేటెడ్ థీమ్‌లు మరియు దుస్తులను ఎంచుకోవచ్చు. పార్టీకి వచ్చే వారందరూ ఆ ప్రత్యేక క్షణాలన్నింటినీ క్యాప్చర్ చేసినట్లు నిర్ధారించుకోండి.
రిటర్న్ గిఫ్ట్ బ్యాగ్: స్వీట్లు, బెలూన్‌లకు బదులుగా కొన్ని సురక్షితమైన, చిన్న, మృదువైన బొమ్మలను రిటర్న్ గిఫ్ట్ గా ఎంచుకోవచ్చు.
దీన్ని సింపుల్ గా ఉంచండి: భవిష్యత్తులో మరిన్ని పుట్టినరోజులు రానున్నాయి కాబట్టి ఒత్తిడికి గురికాకుండా ఆనందించ౦డి.
పుట్టినరోజు సందర్భంగా గుర్తుంచుకోవలసిన విషయాలు
పార్టీ సమయంలో మీరు గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు, క్రింద చదవండి...
పిల్లలపై నిఘా ఉంచండి. వారు మింగగలిగే ఏవైనా చిన్న లేదా హానికరమైన వస్తువులను తీసివేయండి. మీరు చూసిన వెంటనే దాన్ని క్లియర్ చేయండి.
దినచర్యలో మార్పు, అపరిచితులు మరియు మరెన్నో విషయాల వల్ల పిల్లలు చిరాగ్గా ఉంటారు. కాబట్టి మీ బిడ్డను ఒత్తిడికి గురి చేయకండి, మీరు కూడా టెన్షన్ పడకండి..
మీ బిడ్డ సంతోషంగా లేకుంటే, మీరు తనదగ్గరే ఉండేలా చూసుకోండి. ఏర్పాట్లలో పూర్తిగా మునిగిపోకుండా మీ చిన్నారిని జాగ్రత్తగా చూసుకోండి, ఆమె సంతోషంగా ఉండేలా చేయండి.
మీ బిడ్డ తన పుట్టినరోజున భోజనాన్ని దాటవేయకుండా చూసుకోండి.
పై చిట్కాలు మీకు తప్పకుండా సహాయపడతాయని మరియు మీ చిన్నారి తోలి పుట్టినరోజు పార్టీ గొప్పగా ఉండాలని ని పేరెంట్యూన్ తరపున మేము ఆశిస్తున్నాను. మీరు పార్టీని బయట పెట్టుకున్నా లేదా మీ కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో జరుపుకున్నా పర్వాలేదు - వేడుక హాయిగా ఉన్నంత వరకు, మీ పార్టీ పరిపూర్ణంగా ఉంటుంది.
ఈ కంటెంట్ పేరెంట్యూన్ నిపుణుల ప్యానెల్‌లోని వైద్యులు మరియు నిపుణులచే తనిఖీ చేయబడింది & ధృవీకరించబడింది. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సెలర్, ఎడ్యుకేషన్ & లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిసేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీడ్ ఉన్నారు.
Be the first to support
Be the first to share
Comment (0)