1. కరోనా కాలంలో జన్మించిన ప ...

కరోనా కాలంలో జన్మించిన పిల్లల అభివృద్ధిలో జాప్య౦? అధిగమించడానికి తల్లిదండ్రులు ఏమి చేయాలంటే..

0 to 1 years

Ch  Swarnalatha

2.3M వీక్షణలు

3 years ago

కరోనా కాలంలో జన్మించిన  పిల్లల అభివృద్ధిలో జాప్య౦? అధిగమించడానికి తల్లిదండ్రులు ఏమి చేయాలంటే..
ప్రవర్తన
చైల్డ్ ప్రూఫింగ్
వైద్య
శారీరక అభివృద్ధి
ప్రసంగం మరియు వినికిడి

కోవిడ్-19 మహమ్మారి ప్రపంచంలో ప్రతి ఒక్కరినీ వణికించింది.  ఈ ప్రాణాంతక వైరస్ వల్ల పెద్దలు మరియు పిల్లలు కూడా  శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా తీవ్రంగా ప్రభావితమయ్యారు. మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. కరోనా  తలెత్తిన మొదటి సంవత్సరంలో జన్మించిన పిల్లలను కూడా  మహమ్మారి ప్రభావితం చేసి ఉండవచ్చని ఇటీవలి పరిశోధనలు సూచిస్తున్నాయి.

పిల్లల జీవితంలో మొదటి ఐదు సంవత్సరాలు వారి శారీరక, మేధో మరియు సామాజిక-భావోద్వేగ వికాసానికి చాలా కీలకమైనవి అని మనకి తెలిసిందే. అయినప్పటికీ, మహమ్మారి సమయంలో జన్మించిన శిశువులు వారి అభివృద్ధి దశలో కొన్ని అడ్డంకులను, ఆలస్యాన్ని  ఎదుర్కొంటారని ఒక తాజా  అధ్యయనం పేర్కొంది. దాని గురించి వివరంగా తెలుసుకుందాం.
 

More Similar Blogs

    అధ్యయనం ఏం చెపుతోంది?

    కొలంబియా యూనివర్శిటీకి చెందిన ఇర్వింగ్ మెడికల్ సెంటర్ పరిశోధకులు నిర్వహించిన తాజా అధ్యయనం ప్రకారం, కరోనా సంక్షోభానికి ముందు జన్మించిన పిల్లలతో పోలిస్తే మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలు సామాజిక మరియు చాలన (కదిలే)  నైపుణ్యాలలో అభివృద్ధి ఆలస్యం అయ్యే ప్రమాదం దాదాపు రెండు రెట్లు ఎక్కువ.  ఆరు నెలల వయస్సు గల పిల్లల పై జరిపిన ఈ అధ్యయనం లో.. అంతర్జాతీయ  మహమ్మారి ప్రారంభానికి ముందు జన్మించిన పిల్లల కంటే, తరువాత జన్మించిన పిల్లలు పిల్లలు సామాజిక మరియు ప్రేరక  అభివృద్ధి పరీక్షలలో తక్కువ స్కోరు సాధించారని అధ్యయనం కనుగొంది.

    అభివృద్ధి జాప్యం లక్షణాలు

    పిల్లల అభివృద్ధిలో జాప్య౦ అనేది, ఊహాపరమైన అభివృద్ధి దశలను దాటడంలో  పిల్లలు వెనుకబడటాన్నిసూచిస్తుంది. చిన్నారి అనుకున్నదానికంటే ఆలస్యంగా మాటలు  నేర్చుకోవడం, , అస్సలు మాట్లాడకపోవడం లేదా మాటల  కంటే సంజ్ఞలను ఉపయోగించినప్పుడు మనం సందేహించవచ్చు. ఇంకా ప్రతిస్పందన తక్కువగా ఉండటం, సూటిగా కంటిలోకి చూడలేకపోవడం  ఇంకా  ఏకాగ్రత లోపం వంటికి కూడా ఇతర లక్షణాలు. 

    అభివృద్ధి జాప్యానికి కారణాలు

    పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, ఇతర కారణాలతో పాటు తోటి  పిల్లలతో తక్కువ పరస్పర చర్య కారణంగా ఇది జరుగుతుంది. లాక్డౌన్ల కారణంగా తల్లిపై గల ఒత్తిడి, పని మరియు ఆరోగ్య సంబంధ సమస్యలపై ఆందోళన చెందడం దీని వెనుక ఉన్న మరొక కారణం.

    "గర్భధారణ సమయంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఉన్న తల్లులకు జన్మించిన శిశువులకు న్యూరో డెవలప్‌మెంటల్ లోపాలు  వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.  కాబట్టి COVID  సమయంలో గర్భధారణ చేసిన తల్లులకు పుట్టిన  శిశువుల న్యూరో డెవలప్‌మెంట్‌లో కొన్ని మార్పులను మేము కనుగోన్నాము " అని ప్రధాన అధ్యయనవేత్త డాక్టర్ డాని డుమిత్రియు చెప్పారు. ఇదివరకు ఎప్పుడూ లేని కరోనా పరిస్థితి వాళ్ళ  గర్భిణీ తల్లులు  భారీ మొత్తంలో  అనుభవించిన ఒత్తిడి ఒక ముఖ్య  పాత్ర పోషించిందని ఫలితాలు సూచిస్తున్నాయి, అని  ఆమె వివరించారు.

    తల్లిదండ్రులు ఇలా  చేయవచ్చు

    పరిస్థితుల దృష్ట్యా, తల్లిదండ్రులు భయాందోళనలు మరియు గందరగోళ స్థితికి లోను కావచ్చు. కానీ సరైన వ్యూహాలతో  మీరు అన్ని సవాళ్లను అధిగమించవచ్చు. మీ చిన్నారి భాష మరియు ప్రేరణ నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో, ఇంకా వారి అభివృద్ధి మైలురాళ్ల పరంగా  వృద్ధి చెందడంలో సహాయపడటానికి  కొన్ని చిట్కాలు మరియు ఉపాయాలు ఉన్నాయి.

    1. మీ పిల్లలతో మాట్లాడండి, వారిని మాట్లాడేలా చేయండి

    చాలా సమస్యలకు కమ్యూనికేషన్ పరిష్కారం. భాషను ఉపయోగించడం దానిని సులభతరం చేస్తుంది. డెవలప్‌మెంట్‌లో జాప్యం ఉన్న పిల్లలు మాట్లాడటంలో  ఇబ్బందిపడతారు. అందువల్ల తక్కువ మాట్లాడతారు. , తల్లిదండ్రులుగా, మీరు తప్పనిసరిగా మాట్లాడటానికి ఇంకా మాటలకు స్పందించడానికి   ప్రోత్సహించే  వాతావరణాన్ని సృష్టించాలి. ఉదాహరణకు, పిల్లవాడు అతను లేదా ఆమె కోరుకున్నది పొందడానికి మాట్లాడవలసిన పరిస్థితులను కల్పించండి. మీరు వారితో మాట్లాడటం మరియు సంభాషణలో శ్రద్ధగా పాల్గోవడం కూడా చాలా ముఖ్యం.

    2. వారి భావాలను వారి పరిసరాలకు బహిర్గతం చేయండి

    శిశువు రెండవ లేదా మూడవ నెలల్లో, వారు తమ చుట్టూ జరుగుతున్న విషయాల గురించి తెలుసుకుంటారు. తల్లిదండ్రులు వారి భావాలను ఉత్తేజపరచాలి ఇంకా  వారిని పరిసరాలకు బహిర్గతం చేయాలి. వివిధ వస్తువులని  తాకనివ్వండి, అనుభూతి చెందనివ్వండి, వాసన చూడనివ్వండి, వారి చుట్టూ ఉన్న ప్రతిదాన్ని చూడనివ్వండి. ఈ విధంగా వారు తమ పర్యావరణం గురించి చాలా నేర్చుకుంటారు. అలాగే, ఇది వివిధ అనుభూతుల మధ్య తేడాను గుర్తించడానికి వారిని అనుమతిస్తుంది.

    3. వారికి  బొమ్మలు, చురుకైన  గేమ్‌లు ఇవ్వండి 

    మీ చిన్నారి కూర్చుని వస్తువులను పట్టుకోగలిగితే తనకు  మంచి చాలన నైపుణ్యాలను పెంపొందించుకున్నట్టే.  ఇందుకుగాను, వారికి  ఇంటరాక్టివ్ బొమ్మలు మరియు ఆటలను వారికి పరిచయం చేయవచ్చు. అదనంగా, షో అండ్ టెల్, ఫన్నీ ఫేసెస్, దొంగాట, ఫీల్ అండ్ గ్రాబ్ వంటి ఇంటరాక్టివ్ గేమ్‌లు మీ పిల్లలను మరి౦త త్వరగా నేర్చుకునేలా  సహాయపడతాయి. ఇవి పిల్లల దృష్టి కేంద్రీకరించేందుకు, వారు చురుకుగా కదిలేలా  ప్రోత్సహిస్తాయి. ఇంకా వారి ప్రతిక్రియలను వేగవంతం అయ్యేలా చేస్తాయి. 

    ఈ విషయమై ఇంకా చర్చిన్చాలనుకున్తున్నారా? మీ తోటివారితో  ఆలోచనలు పంచుకోవాలనుకుంటున్నారా? ఈ కింద మీ అభిప్రాయాలను తెలియచేయండి. 

    Be the first to support

    Be the first to share

    support-icon
    Support
    bookmark-icon
    Bookmark
    share-icon
    Share

    Comment (0)