భలే ఫోటో షేర్ చేసిన బాలీవ ...
బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఒక ప్రత్యేకమైన పోస్ట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ కపూర్ ప్రిన్సెస్ ఇపుడు pregnant అనే విషయం మీకు తెలిసిందే. ఈ పోస్టులో సోనమ్ వాచిన తన పాదాల ఫోటోను పెట్టింది.. గర్భధారణ కొన్నిసార్లు అందంగా ఉండకపోవచ్చని ఓ ఆసక్తికరమైన వ్యాఖ్యను కూడా దానికి జోడించింది.
సోనమ్ కపూర్ మార్చిలో తాను గర్భం దాల్చినట్లు ప్రకటించింది. సోనమ్, ఆమె భర్త ఆనంద్ అహూజా తమ తొలి సంతానం బేబీ షవర్ ఫంక్షన్ ను లండన్‌లో నిర్వహించారు. అప్పటి నుండి, ఆమె తన pregnancy జర్నీని ఇన్‌స్టాగ్రామ్‌లో డాక్యుమెంట్ చేస్తోంది. ఆమె తన ప్రెగ్నెంట్ షూట్ ఫోటోలను, బేబీమూన్ ఫోటోలను కూడా పోస్ట్ చేసింది.
సోనమ్ కపూర్ మాత్రమే కాదు, గర్భధారణ సమయంలో మహిళలు తమ ఆరోగ్యం మరియు మానసిక స్థితిలో వివిధ మార్పులను అనుభవిస్తారు. కొన్ని మార్పులు బాధాకరమైనవి మరియు అసౌకర్యంగా ఉంటాయి. చాలావరకు వాటికవే మెరుగపడతాయి.. లేదా గైనకాలజిస్ట్ సహాయంతో వాటిని సరిచేయవచ్చు. మరి, సోనమ్ చెప్పినట్టుగా గర్భధారణ సమయంలో కాళ్ళ వాపు ఎందుకు వస్తుంది? దాన్ని ఎలా సరిదిద్దుకోవాలో చూద్దాం..
కడుపులో శిశువు ఎదిగే కొద్దీ మీ పొట్ట కూడా పెరుగుతూ ఉంటుంది. దానితో పాటుగా మీ శరీర భాగాలన్నీ కూడా ఉబ్బి పోవడాన్ని మీరు గమనించారా ! ముఖ్యంగా పాదాలు మరియు మడిమల విషయంలో ఇలా జరుగుతుంది. ఐతే దీన్ని సీరియస్ విషయంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. గర్భధారణ సమయంలో ఇది చాలా సాధారణం. శరీరంలో ఎక్కువ నీరు నిల్వ ఉండడం వల్ల ఇలా జరుగుతుంది. ముఖ౦ మరియు వేళ్ళకి కూడా వాపు వస్తుంది. మీరు కూడా గర్భధారణ సమయంలో వాపు తో బాధపడుతున్నారా? దానికి పరిష్కారం ఏమిటో తెలుసుకోవాలనుకుంటే ఈ బ్లాగ్ చదవండి.
గర్భిణీ స్త్రీలలో సగం మందికి ఈ విధమైన వాపు వస్తుంది. సాధారణంగా రెండవ త్రైమాసికం చివరి భాగం లోనూ, మూడవ త్రైమాసికంలో సంభవిస్తుంది. వాతావరణాన్ని బట్టి వాపు ఎక్కువ తక్కువలుగా ఉంటుంది. అంటే వేసవి సమయంలో వాపు ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ సేపు నిలబడి ఉన్నా,నడవడం లేదా ఎక్కువ పని చేసినా ఆ సాయంత్రానికి మీ పాదాలు వాచినట్లుగా మీకే తెలుస్తుంది.
గర్భధారణ సమయంలో మిమ్మల్ని, మీ కడుపులో శిశువు ని రక్షించేందుకు శరీరం ఎక్కువ నీటిని నిల్వ చేసుకుంటుంది. ఈ అదనపు నీరు మీ శరీరంలోని గర్భాశయం లోని సిరలపై వత్తిడి కలిగి౦చి వాపునకు దారితీస్తుంది.
గర్భిణీలలో వాపు అన్నది చాలా సాధారణమైన సంగతి. కానీ ఈ విధంగా జరిగితే డాక్టర్లను తప్పనిసరిగా కలవండి:
నీ ముఖము లేదా చేతులు బాగా వాచిపోయి ఒక్కరోజులో తగ్గకుండా ఎక్కువగా బాధిస్తున్న ట్లయితే ఇది ప్రీఎక్లంప్సియా అంటే హైబీపీ కు దారితీయవచ్చు. మూడవ త్రైమాసికంలో ప్రీఎక్లంప్సియా కారణంగా అధిక రక్తపోటు, అధికంగా బరువు పెరగడంతోపాటు , కేవలం ఒక కాలి నరాలలో మాత్రం రక్తం గడ్డకట్టినట్లు అవుతుంది. అటువంటి సమయాలలో డాక్టర్లను సంప్రదించడం మంచిది.
ఎక్కువమంది గర్భిణులలో ఈ వాపు అనేది పిలవని అతిధి లాగా వచ్చి తిష్ట వేస్తుంది. జీవనశైలి మరియు ఆహారంలో మార్పుల ద్వారా ఈ అసౌకర్యాలను తగ్గించగలము. గర్భధారణ సమయంలో వచ్చే వాపులను తగ్గించేందుకు కొన్ని చిట్కాలను ఇక్కడ చూడండి:
విశ్రాంతి :
గర్భధారణ సమయంలో ఏ పని లేకుండా ఎప్పుడు విశ్రాంతి లోనే ఉండటం మంచిది కాదు. అలాగే రోజంతా నిలబడి మరియు నడుస్తూ పనిచేస్తున్న వారికైతే విశ్రాంతి ఎంతో అవసరం. క్రమంతప్పకుండా విశ్రాంతి తీసుకుంటూ హాయిగా ఉండండి. మీ పాదాలను నడుము పైకి వచ్చేలాగా పైకి లేపుతూ ఉండండి. మీకు వీలు కుదిరినట్లయితే షు షాపుకి వెళ్లి గర్భధారణ సమయానికి అనుకూలమైన షూస్ ను ఖరీదు చేయండి. దీని వలన ఒత్తిడికి లోనవుతున్న మీ పాదాలు, కాలి వేళ్లు, మడమలు విశ్రాంతి పొందుతాయి.
వ్యాయామం:
గర్భధారణ సమయంలో విశ్రాంతి తీసుకోవడం అంటే మీరు అసలు కదలకుండా ఒకే దగ్గర కూర్చోవడం అని కాదు. వాకింగ్ ,ఈత ఇంకా pregnant యోగా మొదలైనవి మీ గర్భధారణ సమయం అంతా కూడా మీరు ఫిట్ గా ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతాయి. మీరు వ్యాయామాలను ప్రారంభించే ముందు, లేదా మీకు ఏదైనా మెడికల్ హిస్టరీ ఉన్నట్లయితే కనక గైనకాలజిస్ట్ను సంప్రదించండి.
నీరు తగ్గకుండా చూసుకోండి:
అసలే నీరుపత్తి కాళ్ళు వాపు గా ఉన్నప్పుడు కూడా ఎక్కువ నీటిని తీసుకోమని చెప్పినందుకు ఆశ్చర్యపోతున్నారా! ఎక్కువ నీటిని తీసుకోవడం ద్వారా మన ఒంట్లో ఉండే అదనపు సోడియంను బయటకు పంపటానికి వీలవుతుంది. ఆ విధంగా వాపు తగ్గేందుకు కూడా సహాయపడుతుంది. ఒక నీళ్ళ బాటిల్ ను మీతో పాటు ఎప్పుడూ ఉంచుకోండి. అందులో కొన్ని నిమ్మకాయ ముక్కలను మరియు కీరదోసకాయ ముక్కలను కలిపితే ఎంతో మంచిది.
ఆరోగ్యకరమైన ఆహారం :
ఏది ఏమైనప్పటికీ గర్భధారణ సమయం అంతా కూడా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. జంక్ ఫుడ్ లను తినకండి. ముఖ్యంగా ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తిన్నట్లయితే ఇది ఒంట్లో నీటిని బయటకు వెళ్ళనీయకుండా నిలిపి ఉంచుతుంది. ఎక్కువగా పండ్లను తీసుకోండి . ముఖ్యంగా సి విటమిన్ ఎక్కువగా ఉండే బత్తాయి, ఆరెంజ్, పుచ్చకాయ లాంటి వాటిని ఎక్కువగా తీసుకోండి.
ఇంటి చిట్కాలు :
శాస్త్రీయంగా ఎటువంటి రుజువులు లేనప్పటికీ ఇళ్ళలో పాటించే కొన్ని చిట్కాలు ఖచ్చితంగా మిమ్మల్ని స్వస్థ పరిచి విశ్రాంతిని ఇస్తాయి. వాపు తగ్గించేందుకు గళ్ళు ఉప్పు వేసిన నీటిలో మీ పాదాలను ఉంచండి. క్యాబేజ్ ఆకులను వాపు ఉన్న ప్రదేశంలో ఉంచుకోండి. ఆ ఆకులతో కట్టు కట్టినట్లుగా కట్టుకోండి. ఆకులు తడిగా అయిపోయాక వాటిని తీసి వేసి, వేరే ఆకులను కట్టుకోండి. లావెండర్ మరియు సైప్రెస్ ఆయిల్ తో మీ పాదాలకు బాగా మసాజ్ చేయండి.
గర్భధారణ సమయంలో శరీరంలో ఎన్నో మార్పులు సంభవిస్తాయి. కొన్నిసార్లు ఇవి బాధాకరంగా ఉంటాయి. తగిన శ్రద్ధ వహించండి. సంతోషంగా ఉండండి. వెనకకు చేరబడి కూర్చోవడం అలవాటు చేసుకోండి. పై చిట్కాలను పాటించండి. మీరు త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాము.
మీ పాదాల ఇంకా మడమల యొక్క వాపులను తగ్గించుకునేందుకు మా చిట్కాలు మీకు సహాయ పడ్డాయా ? ఈ క్రింది కామెంట్ల విభాగంలో మాకు తెలియజేయండి. అందరికీ తెలిసేలా షేర్ చేయండి!
Be the first to support
Be the first to share
Comment (0)