హైదరాబాద్ లో ఆరు లక్షల పా ...
మేఘనకి ఒక్కగానొక్క కూతురు రుచి. ఆరెళ్ళ ఈ పాప అంటే కుటుంబంలో అందరికీ ముద్దే. రుచి ఆడింది ఆట.. పాడింది పాట. ఆ పాపకి పావురాలంటే చాల ఇష్టం. సాయంత్రం పార్క్ కి వెళ్ళినపుడు వాటికీ దాణా వేయడమే కాకుండా.. ఇంట్లో కూడా ఒక డబ్బాలో వాటికీ ఫుడ్ పెడుతుంది. అవి తినడానికి పావురాలు రావటం.. కొన్ని వాళ్ళ ఇంటి ఆవరణలోనే గూడు పెట్టడం కూడా మాములే. ఐతే కొన్ని రోజులుగా రుచి ఆయాసపడటం, ఊపిరి గట్టిగా తీయడ, మేఘన గమనించింది. అశ్రద్ధ చేయకుండా పిల్లల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది. ఆయన పాప వివరాలు, అలవాట్లు అన్నే తెలుసుకున్నాక, చెప్పింది విని మేఘన ఆశ్చర్యపోయింది. పావురాల వల్లే పాపకు శ్వాసలో ఇబ్బందులు తలెత్తాయని ఆయన గుర్తించారు.
పావురం అంతర్జాతీయంగా శాంతికి చిహ్నంగా భావిస్తారు. పక్షుల పట్ల ప్రేమ, సరదా కోసం లేదా సెంటిమెంట్ గా కూడా మంచిదని హైదరాబాద్ లో చాలామంది పావురాలు పెంచుకుంటారు.. వాటికి ఫుడ్ పెడుతూ ఉంటారు. పావురాలకు ఆహారం పెట్టడం పుణ్యమని కొంతమంది నమ్ముతారు. పెద్దపెద్ద అపార్ట్ మెంట్లు, గేటెడ్ కమ్మ్యూనితీల్లో కూడా పావురాలకు దానా వేసే ప్రదేశాలను సరదా కోసం ఏర్పాటు చేస్తున్నారు. దీనితో నగరంలో పావురాల సంక్య ఆరులక్షలను దాటేసిందని ఓ అంచనా. ఐతే సిటీ వాసులు పెంచుకునే పావురాలు చిన్నపిల్లలతో సహా చాల మందిలో తీవ్రమైన శ్వాసకోస వ్యాధులకు కారణమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పావురాల విసర్జితాలు అంటే రెట్టల వల్ల అనేక అనారోగ్యసమస్యలు తలెత్తుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO హెచ్చరించింది.అలాగే, సిటీ అంతటా పెరుగుతున్న పావురాల సంఖ్య వల్ల హైదరాబాద్ అనారోగ్యాల నిలయంగా మారిపోగాలదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో పావురాల రెట్టలు వల్ల ఏసీ డక్ట్ లు ప్రమాదకరంగా మారాయి. ప్రజలు కిటికీలు తెరవకపోయినా, పావురం రెట్టలు ఎండిపోయి, పొడిగామారి గాలిలో కలుస్తాయి.. తద్వారా HPకి ప్రధాన కారకం అవుతాయి. ఈ గాలిని పీల్చేవారు, ముఖ్యంగా పిల్లలు శ్వాస సంబంధ వ్యాధులకు గురౌతారు. మగతగా ఉండటం, తలనొప్పి వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే.. అది క్రమంగా పక్షవాతానికి దారితీసి, మరణానికి కూడా కారణం అవుతుందని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. ఇపుడు హైదరాబాద్ ఆస్పత్రులలో ఇదే తరహా కేసులు అధికం అవుతున్నాయని గణాంకాలు చెపుతున్నాయి.
ఉదాహరణకు, హైపర్‌సెన్సిటివ్ న్యుమోనిటిస్ (HP) లేదా బర్డ్ ఫ్యాన్సీయర్స్ లంగ్ అనేది అధిక అలెర్జీని కలిగించే ఓకే వ్యాధి. ఇది పావురాల వంటి పక్షి రెట్టల వల్ల ఊపిరితిత్తులలో వాపును కలిగిస్తుంది. ఐతే దీని లక్షణాలు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌ల మాదిరిగానే ఉన్నందున, చాలా మంది వైద్యులు దీనిని న్యుమోనియాగా భావించి తికమకపడతారు.
పావురాల వచ్చే శ్వాసకోశ ప్రమాదాలను ఎదుర్కోవడానికి పిల్లలను పావురం రెట్టలకు దూరంగా ఉండటం కీలకమని వైద్యులు సలహా ఇస్తున్నారు. తమ సమీపంలో లేదా ఇళ్ళ వద్ద పావురాల సంచారం అధికంగా వారు N95 మాస్క్‌లను ఉపయోగించాలి. అంతేకాకుండా, ఇంటి వద్ద ఉండే పావురాలకు ఆహారం ఇవ్వవద్దని కూడా నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.
Be the first to support
Be the first to share
Comment (0)