గర్భధారణ తర్వాత వ్యాయామం: ...
హాయ్ మమ్మీస్! గర్భం దాల్చి, డెలివరీ అయిన తర్వాత మీ కోసం మీరు చేయగలిగిన బెస్ట్ పనుల్లో ఎక్సర్సైజ్ చేయడం ఒకటి. మీది సమస్యలేవీ లేని గర్భధారణ ఇంకా సాధారణ ప్రసవం అయితే, డెలివరీ అయిన కొన్ని రోజుల తర్వాత లేదా మీరు సిద్ధం అని మీకు అనిపించిన వెంటనే వ్యాయామం మొదలుపెట్టడం సురక్షితం. అలాకాకుండా మీకు సిజేరియన్, డెలివరీలో సమస్యలు లేదా సంక్లిష్టమైన డెలివరీ అయితే , వ్యాయామ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించాలో మీ డాక్టర్ తో మాట్లాడండి.
గర్భధారణ తర్వాత వ్యాయామం యొక్క ప్రయోజనాలు
గర్భధారణ తర్వాత క్రమం తప్పకుండా వ్యాయామం చేయవచ్చు. దాని వల్ల ప్రయోజనాలేమిటంటే..
బరువు తగ్గడానికి సహాయపడుతుంది
మీ కార్డియోవాస్కులర్ ఫిట్‌నెస్‌ను మెరుగుపరుస్తుంది
ఉదర కండరాలను బలోపేతం చేస్తుంది. మీ పొట్ట భాగాన్ని టోన్ చేస్తుంది
మీ శక్తి స్థాయిని పెంచుకోండి
శారీరకంగా చురుకుగా ఉండటం కూడా సహాయపడుతుంది:
ఒత్తిడిని తగ్గిస్తుంది
మెరుగైన నిద్రకు దోహదపడుతుంది
ప్రసవానంతర౦ కనిపించే డిప్రెషన్ యొక్క లక్షణాలను తగ్గిస్తుంది
మీ దినచర్యలో శారీరక శ్రమను చేర్చడం వలన రాబోయే సంవత్సరాల్లో మీ పిల్లలకు మీరేఒక మంచి రోల్ మోడల్ సెట్ చేయవచ్చు
ఇదిలా ఉంటే.. తల్లిదండ్రులు తమ పిల్లలతో వివిధ మార్గాల్లో బంధం ఏర్పరుచుకుంటారు. మరి మిషేల్లె అనే ఓ మహిళ, తన 5 నెలల వయస్సున్న బిడ్డ ఆస్టిన్ తో ఎక్షర్సైజ్ ద్వారా ప్రేమను పంచుకుంటోంది. మాతృత్వం కోసం బలాన్ని పెంచడానికి ఎక్సర్అవసరమైన సైజ్ తనకు ఉపయోగపడిందని మిషేల్లె వివరిందింది. వీరిద్దరూ కల్సి బెంటోవర్ రో, సుమో స్క్వాట్, షోల్డర్ ప్రెస్, స్టాటిక్ టెంపో లుంజ్ లాంటి ఎన్నో వ్యాయామాలు చేయడం ఈ వీడియోలో మనం చూడవచ్చు.
కనీసం సరిగా కూర్చోగాలరా అనే వయసులో, ఆస్టిన్ అతికష్టమైన ప్లాంక్ చేయడం చూసే వాళ్ళ మతి పోగోడుతు౦ది. ఇక ఈ మమ్మీ అండ్ బేబీల బేబీ యోగా విన్యాసాలు చూసేయండి మరి!
Be the first to support
Be the first to share
Comment (0)