జంతువుల నుండి కొత్త కోవిడ ...
రచన, అవినాష్ భార్యాభర్తలు. వారికి ఒక బాబు, ఒక పాప. వాళ్ళు కాకుండా వాళ్ళ ఇంట్లో ఒక కుక్క షీరో కూడా ఉంటుంది. ఐతే ఇపుడు మళ్ళీ కోవిడ్ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. నిరంతర౦ కొత్త వేరియంట్‌లు వెలువడుతున్నాయని కూడా వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా రాబోయే కాల౦లో కొత్త వేరియంట్లు జంతువుల నుండి తలెత్తే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ విషయం విన్న రచన, తమ పెంపుడు కుక్క వల్ల ఏమైనా ప్రమాదం ఉందా అని ఆలోచనలో పడింది.
మనం మహమ్మారి యొక్క మూడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. ఇక తదుపరి ఏమి జరగవచ్చో అర్థం చేసుకోవడానికి శాస్త్రవేత్తలు కరోనావైరస్ గురించి నిరంతరం అధ్యయనం చేస్తున్నారు. ఇక తరువాతి COVID వేరియంట్ మానవుల నుండి కాకుండా, జంతువుల నుండి ఉద్భవించవచ్చని చాలా మంది ఆందోళన చెందుతున్నారు. ఏదైనా కొత్త మహమ్మారి లేదా తదుపరి COVID-19 వేరియంట్‌ను గుర్తించడానికి పరిశోధకులు జంతువులను పర్యవేక్షిస్తున్నారు.
"నిజానికి అనేక జంతు జాతులలో వందల, వేల కొరోనా వైరస్లు ఉన్నాయి," అని అమెరికాకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ (NIAID)లో ఇన్ఫెక్షియస్ డిసీజెస్ లాబొరేటరీ డిప్యూటీ చీఫ్ డాక్టర్ జెఫ్ టౌబెన్‌బెర్గర్ అన్నారు. “ఐతే అవంతా ఎక్కడ ఉన్నాయో మనకు తెలియదు. జంతువులలో కరోనా ఆవాసం ఏ స్థాయిలో ఉందొ కూడా పూర్తి స్థాయిలో మనకు తెలియదు. వాటివల్ల రాగల ప్రమాదాలు ఏమిటో కూడా మనకు తెలియదు." అని ఆయన వివరించారు.
కరోనావైరస్ మింక్‌లు, చిట్టెలుకలకు సోకినట్లు అధ్యయనాలు సూచించాయి. ఉత్తర అమెరికాలో, ఇది అడవి తెల్ల తోక జింకలకు సోకింది. ఇది మరిన్ని జాతులకు సోకుతున్నందున, ఈ జాబితా పెరుగుతూనే ఉంటుంది. ఈ మహమ్మారి మనకు తెలిసిన దానికంటే ఎక్కువ జంతు జాతులలోకి చొరబడి, మళ్లీ మానవులకు వ్యప్తించి, ఇలా కొత్త మరియు ప్రమాదకరమైన COVID వైవిధ్యాలకు కారణం కాగలడా అనే దిశగా ఇప్పుడు పరిశోధకులు ఆలోచిస్తున్నారు.
COVID మరిన్ని జాతులకు సోకడం మరియు మునుపటి కంటే ఎక్కువగా పరిణామం చెందడంతో, మరిన్ని వేరియంట్స్ నుండి రక్షించగల COVID వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడంపై నిపుణులు ఇప్పుడు దృష్టి సారిస్తున్నారు.
అమెరికా లోని వాల్టర్ రీడ్ ఆర్మీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్‌లోని శాస్త్రవేత్తలు అటువంటి యూనివర్సల్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నారు. ప్రస్తుతం ఇది మానవ ప్రయోగాల మొదటి దశలో ఉంది. ఈ యూనివర్సల్ వ్యాక్సిన్‌లో COVID-19 యొక్క వివిధ స్ట్రైన్ లకు వ్యతిరేకంగా రోగనిరోధకతను ప్రేరేపించగల వివిధ కరోనావైరస్ శకలాలు ఉంటాయి, అని ABC వార్తా సంస్థ నివేదిక తెలిపింది.
SARS-CoV-2 వాస్తవానికి చైనాలోని జంతు మార్కెట్ ద్వారా మానవులకు సంక్రమించి ఉంటుందని అంతా భావిస్తున్నారు. ఇంకా ఈ వైరస్ వివిధ రకాల జంతువులకు సోకుతుందని కూడా మనకు తెలుసు. కాబట్టి కొత్త SARS-CoV-2 వేరియంట్‌లకు జంతువులు మూలం కావచ్చని శాస్త్రవేత్తలు ఊహిస్తున్నారు. మరొక ఆలోచన ఏమిటంటే వాటికి మానవుల నుండి వైరస్ సంక్రమిస్తుంది. ఇది జంతువులలో ఉన్నపుడు సంక్రమణ సమయంలో పరివర్తన చెంది, ఆ కొత్త వేరియంట్ తిరిగి మానవులకు వ్యాపిస్తుంది. ఈ విధమైన జూనోసిస్ సాధారణం కాదు. కానీ వాతావరణ మార్పులు, అటవీ నిర్మూలన కారణంగా మానవులతో జంతువుల సాంగత్యం ఎక్కువ కావడంతో ఇది సాధ్యమవుతుంది.
నెదర్లాండ్స్ లోని మింక్ ఫామ్‌లలో జంతువుల నుండి మనిషికి కోవిడ్ సంక్రమించిన చోట, వైరస్ పరివర్తన చెందడ౦ గమనించారు. ఐతే, ఆ వ్యవసాయ కార్మికుల నుండి సమాజంలోకి ఈ వేరియంట్ సోకినట్టు ఎటువంటి ఆధారాలు లేవు. అదేవిధంగా, పక్షులతో దీర్ఘకాలంగా సన్నిహితంగా ఉండటం ద్వారా బర్డ్ ఫ్లూ సోకిన వ్యక్తులను మనం చాలా సందర్భాలలో గమనించాము. కానీ ఇతర మానవులకు సంక్రమించే సంఘటనలు చాలా తక్కువ. అంటే, జంతువులలో అప్పుడప్పుడు కొత్త వైవిధ్యాలు ఏర్పడినప్పటికీ, అవి తిరిగి మానవులకు తిరిగి ప్రసారం అయ్యి, వ్యాప్తి చెందే అవకాశం లేదు.
జంతువుల నుంచి ప్రజలకు వ్యాపించే ప్రమాదం
జంతువులకు COVID-19 వ్యాప్తి చెందే ప్రమాదం తక్కువ అనే అంటున్నారు. COVID-19కి కారణమయ్యే వైరస్ SARS-CoV-2ని ప్రజలకు వ్యాప్తి చేయడంలో జంతువులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని ఎటువంటి ఆధారాలు లేవు. కరోనా సోకిన క్షీరదాలతో దగ్గరి సంపర్కం వల్ల ప్రజలకు వైరస్ వ్యాప్తి చెందుతుందని కొన్ని నివేదికలు పేర్కోన్నాయి. అయితే ఇది చాలా అరుదు.
అసలు జంతువుల నుండి కాకుండా ఇతర వ్యక్తుల నుంచే ప్రజలకే COVID-19 సోకే అవకాశం ఉందని గుర్తుంచుకోవడం ముఖ్యం. SARS-CoV-2 సోకిన జంతువులను అనవసరంగా వదిలేయడం లేదా హాని చేయడం అవసరం లేదు. మా బ్లాగ్ నచ్చితే like, కామెంట్ షేర్ చేయడం మర్చిపోకండి!
Be the first to support
Be the first to share
Comment (0)