ఈ మూడు రాఖీ స్పెషల్ వంటక ...
రితిక ఈవేళ తన అన్న దమ్ములకి రాఖీ కట్టింది. కానీ స్వీట్లు, మిఠాయిలు లేకుండా ఏదై పండుగైనా అసంపూర్ణంగా ఉంటుంది. కనీ, ప్రతిసారీ కొబ్బరి లడ్డూ, కాజు కట్లీ వంటి పాత స్వీట్లు బోరింగ్‌గా ఉంటాయి కదా. కాబట్టి కొత్తగా ఏమి చేయాలి? అనుకుంది. మీరు కూడా అదే ఆలోచిస్తున్నారా? ఇదిగో మీ అందరి కోసం ఇక్కడ కొన్ని ఈజీ, హేల్తీ అండ్ స్టైలిష్ రాఖీ వంటకాలు..
కావలసినవి:
నీరు - 1 కప్పు
ఆపిల్ జూస్ - ¼ కప్పు
యాపిల్ ( తరిగినది) -1
రోల్డ్ ఓట్స్ - 2/3 కప్పు
దాల్చిన చెక్క పొడి - 1 స్పూన్
పాలు - 1 కప్పు
ఆపిల్ సినమోన్ వోట్మీల్ రెసిపీ ఎలా తయారు చేయాల౦టే..
అధిక వేడి మీద ఒక లోతుగిన్నేలో లో ఆపిల్ రసం, తరిగిన యాపిల్ తోపాటు నీరు కలిపి మరిగించండి.
మరిగిన తర్వాత, ఓట్స్ మరియు దాల్చినచెక్క జోడించండి.
బాగా కలపండి. మంట తగ్గించండి.
మిశ్రమం చిక్కబడే వరకు అంటే సుమారు 3 నిమిషాలు ఊపిగ్గా వెయిట్ చేయండి.
దానిని సర్వింగ్ బౌల్స్‌లోకి మార్చండి. ప్రతి గిన్నెలో సమానంగా పాలు పోయాలి.
వేడివేడిగా సర్వ్ చేయండి.
.నోట్: మీరు దీనిని నట్స్ తో అలంకరించవచ్చు
కావలసినవి:
జామ (మధ్యస్థ పరిమాణం) - 1 పండినది
అల్లం రసం - 1 టేబుల్ స్పూన్
సగం నిమ్మ రసం
అవసరమైతే చక్కెర లేదా తేనె
చిటికెడు ఉప్పు
జామ జింజర్ & లైమ్ స్మూతీని ఎలా తయారు చేయాల౦టే..
జామకాయను పొట్టు తీసి చిన్న ముక్కలుగా కోయాలి.
ఒక బ్లెండర్‌లో, తరిగిన జామ, అల్లం రసం, నిమ్మరసం, చక్కెర లేదా తేనె మరియు చిటికెడు ఉప్పును కలిపి మెత్తగా ప్యూరీ లాగా చేయండి.
స్మూతీ మీకు కావలసినంత చిక్కగా ఉండటానికి తగినంత నీరు జోడించండి. విత్తనాలను తొలగించడానికి రసాన్ని వడకట్టండి.
రిఫ్రిజిరేటర్‌లో చల్లగా చేసి లేదా ఐస్ క్యూబ్స్ వేసి స్మూతీని సర్వ్ చేయండి.
నోట్: మీరు మీ టెస్ట్ ప్రకారం అల్లం రసం మరియు నిమ్మరసం పరిమాణాన్ని మార్చవచ్చు.
కావలసినవి
600 ml డబుల్ టోన్డ్ మిల్క్ (1.5% కొవ్వు)
2 స్పూన్ నిమ్మరసం
2 మధ్యస్థ సైజు అల్ఫోన్సో మామిడి పండ్లు
5 స్పూన్ పొడి చక్కెర
మ్యాంగో టాంగో రోల్ ఎలా తయారు చేయాల౦టే..
పాలు మరిగించి మంటను ఆపివేయండి. వెంటనే నిమ్మరసం వేసి పాలు విరిగే వరకు కలపాలి. మస్లిన్ వస్త్రం ద్వారా వడకట్టండి. పాలవిరుగుడు నుంచి నీరంతా పోయేలా తొలగించబడిందని నిర్ధారించుకోండి. ఇపుడు గుడ్డలో పనీర్ మిగులుతుంది.
పనీర్‌ను ముక్కలు చేసి, వేడిగా ఉన్నప్పుడే 5-7 సెకన్ల పాటు బ్లెండర్‌లో కలపండి. ఒక ఫ్లాట్ ప్లాట్‌లోకి తీసి, వెంటనే చక్కెర పొడిని జోడించండి. పూర్తిగా మెత్తగా కలిసే వరకు (సుమారు 5 నిమిషాలు) మీ చేతితో మాష్ చేయండి.
12 భాగాలుగా విభజించి పక్కన పెట్టండి.
మామిడిపళ్ళ నుండి 12 సన్నని, ఫ్లాట్ పూర్తి ముక్కలను కట్ చేయండి.
ప్రతి మామిడి ముక్క మధ్యలో ఒక మాష్ చేసిన మెత్తని పనీర్ ముక్కను ఉంచండి. లోపలికి రోల్ చేయండి. అంటే, మామిడి పనీర్‌ను కప్పి ఉంచాలి.
మొత్తం 12 రోల్స్, ఈ విధంగానే రిపీట్ చేయండి.
వెంటనే సర్వ్ చేయండి లేదా ఫ్రిజ్‌లో ఉంచి అపుడు రుచి చూపండి .
మీకు ఈ రుచికరమైన రాఖీ వంటకాలు బాగా నచ్చాయా?. మీరు కూడా ఈ రాఖీకి కొన్ని కొత్త స్వీట్లు మరియు స్నాక్స్ కూడా ప్రయత్నించారా? దయచేసి దిగువ వ్యాఖ్యల విభాగంలో మీ వంటకాలను మాతో పంచుకోండి…
హ్యాపీ రాఖీ, మరియు హ్యాపీ పేరెంటింగ్!!!
Be the first to support
Be the first to share
Comment (0)