1. తల్లి కడుపులో పిల్లలు ఏం ...

తల్లి కడుపులో పిల్లలు ఏం చేస్తారు? తెలుసుకోండి!

Pregnancy

Ch  Swarnalatha

2.8M views

3 years ago

తల్లి కడుపులో పిల్లలు ఏం చేస్తారు? తెలుసుకోండి!
జననం - డెలివరీ
వ్యాధి నిర్వహణ & సెల్ఫ్‌కేర్
పిండం యొక్క అభివృద్ధి

తల్లికావడం  అనేది ఏ స్త్రీకైనా జీవితంలో సంతోషకరమైన క్షణం. గర్భధారణ సమయంలో, వారు తమ కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి రకరకాల ఊహాగానాలు చేస్తారు. ఈ సందర్భంగా గర్భిణులు, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే వీటన్నింటి మధ్య, మీ మనస్సులో ఒక ఉత్సుకత ఏర్పడి ఉండాలి.. మీ కడుపులో పెరుగుతున్న శిశువు కడుపు లోపల ఏమి చేస్తుందో తెలుసుకోవాలనే ఆసక్తి ఉండాలి.. కదా? పెద్దలు చెప్పినదాని ప్రకారం, కడుపులో పెరుగుతున్న శిశువు కూడా చాలా నేర్చుకుంటుంది. అటువంటి పరిస్థితిలో, గర్భిణీ స్త్రీలు వారి దినచర్య, ప్రవర్తన మరియు ఇతర విషయాలపై కూడా శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం.  తద్వారా కడుపులో పెరుగుతున్న బిడ్డ మంచి విషయాలు నేర్చుకుంటుంది. ఈ బ్లాగ్‌లో కడుపులో ఉన్న బిడ్డ ఏమి చేస్తుందో చర్చిద్దా౦.

మన దేశంలో గర్భస్త శిశువు చర్యల  గురించిన నమ్మకాలు ఏవి?

More Similar Blogs

    పౌరాణిక విశ్వాసాల ప్రకారం, మీరు మహాభారతంలో అభిమన్యుడి పాత్రను గుర్తుంచుకోవాలి. మహాభారత యుద్ధం జరుగుతోంది.  అర్జునుడు ఒక వైపు యుద్ధం చేస్తున్నాడు. ఆ సమయంలో కౌరవుల తరపున చక్రవ్యూహం (పద్మవ్యూహం) రచించారు. ఈ చక్రవ్యూహాన్ని ఛేదించడంలో అర్జునుడు మాత్రమే ప్రావీణ్యం కలవాడు.  ఆ సమయంలో అర్జునుడు అక్కడ లేకపోవడం ఆందోళన కలిగించింది. చక్రవ్యూహాన్ని ఛేదించే కళ తనకు తెలుసని అర్జునుడి కొడుకు అభిమన్యుడు అపుడు చెప్పాడు. అభిమన్యుడి మాటలకు పాండవులు ఆశ్చర్యపోగా.. తల్లి కడుపులో ఉన్నప్పుడు, తాను తండ్రి నుండి చక్రవ్యూహాన్ని చేదించే చేసే విధానాన్ని విన్నానని చెప్పాడు. అంటే, అభిమన్యుడు తన తల్లి కడుపులో ఈ కళను నేర్చుకున్నాడు.  కానీ అర్జునుడు చక్రవ్యూహం నుండి ఎలా బయటపడాలో చెబుతుంటే, అతని తల్లి సుభద్ర నిద్రలోకి జారుకుంది, కాబట్టి అతను చక్రవ్యూహం నుండి బయటపడే కళను నేర్చుకోలేకపోయాడు.

    గర్భంలో ఉన్నప్పుడు శిశువు ఏమి నేర్చుకుంటుంది?

    ఆహారం, రుచి, స్వరం, మాట్లాడటం వంటి విషయాలను నేర్చుకునే పునాది తల్లి గర్భంలోనే ఉందని శాస్త్రవేత్తలు కూడా నమ్ముతున్నారు.  మరి వారు ఏమి నేర్చుకుంటాడో చూద్దాం.

    రుచి - బిడ్డ తల్లి కడుపులో రుచి నేర్చుకుంటుంది. చాలా మంది పెద్దలు కూడా గర్భధారణ సమయంలో తల్లి ఏది తిన్నా లేదా త్రాగినా, ఆమె అలవాటు కూడా బిడ్డపై పడుతుందని నమ్ముతారు. నిజానికి గర్భిణి ఏది తిన్నా అది రక్తం ద్వారా బిడ్డకు చేరుతుంది మరియు బిడ్డ కూడా తల్లి రుచికి అలవాటుపడటం ప్రారంభిస్తుంది. అతను రుచి నేర్చుకుంటాడు. మంచి ఆహారం మరియు జీవనశైలిని గడపాలని వారికి సలహా ఇవ్వడానికి ఇదే కారణం. ప్రెగ్నెన్సీ సమయంలో క్యారెట్ ఎక్కువగా తినే మహిళలు.. పుట్టిన తర్వాత బేబీ ఫుడ్ ఇస్తే వారి పిల్లలు క్యారెట్ రుచిని ఇష్టపడతారని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. అంటే కడుపులోనే రుచి చూడటం నేర్చుకున్నాడు.

    మాట్లాడటం, శబ్దం చేయడం - స్వరం నేర్చుకునే విధానం కూడా బిడ్డ కడుపులోనే  నేర్చుకుంటుంది. ఇది అనేక పరిశోధనలలో కూడా ధృవీకరించబడింది. ఇది న్యూయార్క్ యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడైంది. ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ లేదా పాట వంటి, పదాలతో కూడిన శబ్దాలను వినేందుకు పిల్లలు  ఎక్కువ ఇష్టపడతారని పరిశోధనలో తేలింది.  తల్లిదండ్రుల స్వరాలు మొదలైనవి.

    సంగీతం - వినడానికి ఆశ్చర్యంగా ఉంటుంది కానీ సంగీతంపైన అవగాహన కూడా బిడ్డ చాలా వరకు కడుపులో ఉండే నేర్చుకుంటుంది. గర్భిణీ స్త్రీ గర్భధారణ సమయంలో ఎక్కువ సంగీతాన్ని వింటే, అప్పుడు పుట్టబోయే బిడ్డ కూడా ఆ సంగీతాన్ని అర్థం చేసుకుంటుంది. పుట్టిన తర్వాత, బిడ్డ ఆ ధ్వనిని సులభంగా గుర్తిస్తుంది. కానీ పిల్లల్ని సంగీతానికి ఎక్కువగా అలవాటు చేయడం సరికాదు.

    సువాసన గుర్తింపు - బిడ్డ కూడా సువాసనను గుర్తించే కళను గర్భంలోనే నేర్చుకుంటుంది. అతను తల్లి రక్తం ద్వారా వివిధ సువాసనలను గుర్తించడం ప్రారంభిస్తాడు మరియు అతను బయటకు వచ్చినప్పుడు, అతను చెప్పిన సువాసనను సులభంగా గుర్తిస్తాడు.

    వివిధ స్వరాలు - మనుషులే కాకుండా, పిల్లలు కూడా కడుపులోనే వివిధ జంతువుల గొంతులను అర్థం చేసుకుని, గుర్తుపట్టే కళను నేర్చుకుంటాడు. ఈ విషయంపై ఉత్తర ఐర్లాండ్ రాజధాని బెల్ ఫాస్ట్ యూనివర్సిటీకి చెందిన పీటర్ హెప్పర్ ఎన్నో పరిశోధనలు చేశారు. గర్భధారణ సమయంలో స్త్రీలు వెల్లుల్లిని తింటే, వారి పిల్లలు కూడా వెల్లుల్లిని చాలా ఇష్టపడతారని ఆయన తన పరిశోధనలో కనుగొన్నారు. పీటర్ ప్రకారం, గర్భం యొక్క పదవ వారం నుండి, పిండం తల్లి రక్తం నుండి పోషకాలను గ్రహించడం ప్రారంభిస్తుంది. ఆ సమయం నుండి అతను తన తల్లి టెస్ట్ లను అనుభవించడం ప్రారంభిస్తానని హెప్పర్ చెప్పాడు. అంటే తల్లి అలవాట్లు, ప్రవర్తన, మాటలు, జీవన అలవాట్లు కడుపులోపల పెరుగుతున్న బిడ్డను చాలా దగ్గరగా నేర్చుకుని, అనుభవించడానికి ప్రయత్నిస్తాడని కూడా ఈ పరిశోధనలు చెబుతున్నాయి.

    మీ సూచనలు మా తదుపరి బ్లాగును మరింత మెరుగుపరుస్తాయి. అందుకే దయచేసి కామెంట్ చేయండి. ఈ బ్లాగ్‌లో అందించిన సమాచారంతో మీరు సంతృప్తి చెందితే, ఖచ్చితంగా ఇతర తల్లిదండ్రులతో భాగస్వామ్యం చేయండి.

     

    Be the first to support

    Be the first to share

    support-icon
    Support
    bookmark-icon
    Bookmark
    share-icon
    Share

    Comment (0)