పెద్ద వయసులో గర్భం ధరిస్త ...
50, 60 మరియు 70 లలో తల్లి అయిన స్త్రీల గురించి మనం వింటూనే ఉన్నాం. అయితే, ఇది సాధారణంగా డోనార్ నుంచి సేకరించిన అండాలు మరియు ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) తో సాధ్యం అవుతుంది. మీరు సహజంగా గర్భవతి అయ్యేందుకు మాగ్జిమం ఏజ్ అంటూ ఏదీ లేదు. కానీ మీ వయస్సు పెరిగే కొద్దీ సంతానోత్పత్తి తగ్గడం ప్రారంభమవుతుంది. సాధారణంగా మెనోపాజ్‌కు ముందు 5 నుండి 10 సంవత్సరాల మధ్య గర్భవతి కాలేరు.
నిజానికి స్త్రీ పుట్టినపుడే పూర్తీ స్థాయి అండాలతో జన్మిస్తుంది. వయస్సు పెద్దయ్యాక, ఆండాల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. వాటిలో సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఎక్కువ అవుతుంది. అంతేకాకుండా, వయసు పెరిగేకొద్దీ ఎండోమెట్రియోసిస్ వంటి రుగ్మతల వల్ల గర్భవతి అయ్యే అవకాశం తక్కువ అవుతూ వస్తుంది. 45 సంవత్సరాల వయస్సు దాటాక, మీరు సహజంగా గర్భవతి అయ్యే అవకాశం ఇంచుమించు ఉండదు.
గర్భవతి అయ్యే అవకాశాలు, వయస్సుల ప్రకారం (ఒక సంవత్సరం ప్రయత్నించిన తర్వాత) :
మీరు 30 ఏళ్లలోపు ఉంటే 85%
30 వద్ద 75%
35 వద్ద 66%
40 వద్ద 44%
పెద్ద వయసులో గర్భం దాల్చడం వల్ల కలిగే నష్టాలు
35 ఏళ్ల తర్వాత గర్భం దాల్చే మహిళలకు అడ్వాన్స్‌డ్ మెటర్నల్ ఏజ్ (AMA) వైద్య పదం వర్తిస్తుంది. అంతేకాకుండా ఇది తల్లి, బిడ్డలకు అదనపు ప్రమాదాలు కలిగించవచ్చు. మీరు 35 ఏళ్ల తర్వాత గర్భం దాల్చాలనే ఆలోచనలో ఉంటే.. కింది అంశాలతో సహా రాబోయే పరిణామాల గురించి మీ డాక్టర్ తో మాట్లాడండి:
కవల శిశువులు
మధుమేహం (డయాబెటిస్)
పుట్టుకతో వచ్చే లోపాలు
గర్భ నష్టం
అధిక రక్త పోటు
తక్కువ బరువు లేదా ప్రీమేచ్యూర్ శిశువుల జననం
నిజానికి 35 ఏళ్లు పైబడిన చాలా మంది గర్భిణీ స్త్రీలు సహజంగా గర్భం ధరించి ఆరోగ్యకరమైన బిడ్డను కనే అవకాశం ఉంది. అయితే, అందుకు ప్రత్యేక జాగ్రత్తలు అవసరం కావచ్చు, అవి ఏమిటంటే:
మీరు గర్భవతి అయ్యే ముందు సమస్యల గురించి కౌన్సెలింగ్
మొదటి నెలల్లో తరచుగా ప్రినేటల్ విజిట్స్
బర్త్ డిఫెక్ట్ స్క్రీనింగ్, టెస్టింగ్ మరియు కౌన్సెలింగ్
మీకు మరియు మీ బిడ్డకు వయస్సు-సంబంధిత ప్రమాదాలను స్పెషలిస్ట్ లతో చర్చించడ౦
వైద్యుల సాయంతో మీ ప్రస్తుత ఆరోగ్య సమస్యల నిర్వహణ
మీ శిశువు యొక్క పెరుగుదల మరియు అభివృద్ధిని నిశితంగా పర్యవేక్షించడం
గర్భధారణ మధుమేహం, రక్తపోటు కోసం ముందస్తు స్క్రీనింగ్, చికిత్స
సిజేరియన్ అవసరాన్ని నివారించడానికి డెలివరీ ప్లాన్
సమస్యలు తలెత్తే అవకాశాలను తగ్గించడ౦ ఎలా?
ధూమపానం చేయవద్దు.
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి.
మద్యం సేవించవద్దు లేదా చట్టవిరుద్ధమైన మందులు వాడవద్దు.
మీ బరువు పెరుగుదలను నిర్వహించండి.
చురుకుగా ఉండండి.
గర్భధారణకు ముందు మరియు గర్భధారణ సమయంలో కెఫిన్ (కాఫీ) పరిమితం చేయండి.
రుబెల్లా వంటి ఇన్ఫెక్షన్లకు గురికాకుండా ఉండండి.
గర్భధారణ సమయంలో ప్రమాదకరమైన ఆహారాలు, ఉడకని మాంసం వంటి వాటిని నివారించండి.
పెద్ద వయసులో గర్భం దాల్చడం
ఇది చాలా కష్టం ఐనప్పటికీ, అసాధ్యం కాదు. సంతానోత్పత్తి అనేది మీ అండాశయ౦ పనితీరు, మీ పూర్తీ ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. మీలో క్రమం తప్పకుండా, మంచి అండాలు విడుదల అవుతూ ఉంటే, మీరు సహజంగా అంటే సెక్స్ ద్వారా ఒక సంవత్సరంలోపు గర్భవతి అవుతారు. మీరు మీ అండాశయ పనితీరును పరీక్షించడానికి ఇంకా సహజంగా గర్భం దాల్చడానికి ప్రారంభంలోనే మీ వైద్యుడిని సందర్శించవచ్చు. డాక్టర్ సలహా ప్రకారం సూచించిన సమయాల్లో కలుస్తూ, 6 నెలల పాటు సహజ ప్రసవం కోసం ప్రయత్నిచాలి. అయినప్పటికీ విజయవంతం కాకపొతే, IVF వంటి ఇతర అవకాశాలను పరిశీలించాలి.
పెద్ద వయసులో తల్లికావడం వల్ల ప్రయోజనాలు
వయసు ఎక్కువగా ఉన్నపుడు గర్భం దాల్చడం కష్టతరమైనప్పటికీ, మీకు మరియు మీ బిడ్డకు కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
పిల్లలు మెరుగైన భాషా నైపుణ్యాలతో ఆరోగ్యకర౦గా ఉంటారు.పెద్ద వయసు తల్లులు ఉన్న ప్రీస్కూలర్లు పూర్తీ ఆరోగ్యంగా ఉంటారు. చిన్న తల్లులకు జన్మించిన వారి కంటే వారిలో అధిక రోగనిరోధకత, తక్కువ ఆసుపత్రిలో చేరడం ఉంటుంది. ఇంకా అనుకోకుండా గాయాలు తగలడం కూడా వీరిలో తక్కువే. వారు మంచి భాషా, సంభాషణ నైపుణ్యాలు కలిగి ఉంటారు.
అమ్మల తెలివితేటలు పెరుగుతాయి. 35 ఏళ్ల తర్వాత ప్రసవించిన మహిళలు 41 నుండి 92 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు ఆలోచన, శబ్ద జ్ఞాపకశక్తి పరీక్షలలో అధిక స్కోర్ సాధించారు. అంతేకాకుండా, 10 సంవత్సరాలకు పైగా గర్భనిరోధకాలను ఉపయోగించే మహిళలు పెద్దయ్యాక మెరుగైన ప్రాబ్లెం సాల్వింగ్ స్కిల్స్ ఇంకా అధిక పనితీరు నైపుణ్యాలను కలిగి ఉంటారు.
మెరుగైన సంతాన నైపుణ్యాలు.పెద్దవారు, చిన్నవారికంటే ఎక్కువ ఓపిక కలిగి ఉన్నారనేది రహస్యం కాదు. పెద్దవయసు తల్లులు తమ పిల్లలను కఠిన క్రమశిక్షణలో పెట్టడం లేదా వారిపై కేకలు వేయడం చాలా తక్కువ. పిల్లలను అదుపులో పెట్టడంలో కూడా వారు మెరుగ్గా ఉన్నారు. వీరి పిల్లలు తక్కువ ప్రవర్తన, సామాజిక మరియు భావోద్వేగపరమైన సమస్యలను కలిగి ఉంటారు.
మా బ్లాగ్ మీకు నచ్చిందా? ఉపయోగకరంగా ఉందా? ఐతే అవసరమైన అందరు parents కి తెలిసేలా లైక్, కామెంట్, షేర్ చేయండి!
Be the first to support
Be the first to share
Comment (0)