1. పేరెంట్స్ పిల్లల్ని బలవ ...

పేరెంట్స్ పిల్లల్ని బలవంతం చేస్తే…ఇలాగే ఉంటుంది: ఫన్నీ వీడియో!

All age groups

Ch  Swarnalatha

2.5M వీక్షణలు

3 years ago

  పేరెంట్స్ పిల్లల్ని బలవంతం చేస్తే…ఇలాగే ఉంటుంది: ఫన్నీ వీడియో!
Core Values

మీరు ఎపుడైనా చేశారా? అదేం ప్రశ్న.. ఎవరికి ఇంట్రస్ట్ ఉంటె వాళ్ళు చేస్తారు కానీ.. అంటున్నారా? మరదే… ఈ బుడ్డోడు కూడా చెప్పేది. కిక్‌బాక్సింగ్ అంటే కరాటే మరియు బాక్సింగ్‌లో ఉపయోగించే సాంకేతికతలను మిళితం చేసే హైబ్రిడ్ మార్షల్ ఆర్ట్ అని మీకుతెలిసిందే. ముఖ్యంగా, ఇది పవర్ఫుల్ మూమెంట్స్ తో ఉంటుంది. అయితే, ఒక చిన్న పిల్లవాడు ఇప్పుడు తన కిక్‌బాక్సింగ్ మూమెంట్ తో ఇంటర్నెట్‌లో గొప్పగా ఫేమస్ అయిపోయాడు. అద్భుతమైన  కిక్‌లు లేదా పంచ్‌ల వాళ్ళ కాదండోయ్.. కేవలం అతని బాధాకరమైన ఎక్స్ ప్రెషన్ల వల్ల!  ఆ సంగతేంటో ఇక్కడ చూసేయండి..

ఈ చిన్న వీడియో  క్లిప్‌ లో బాలుడి మానసిక స్థితి చూసిన  నెటిజన్లు వెంటనే తమ  మెమొరీ లేన్‌లోకి వెళ్ళిపోయారు. వారి తల్లిదండ్రులు తమకు ఆసక్తి లేనిదాన్ని కొనసాగించమని బలవంతం చేసిన చిన్ననాటి సందర్భాలను చాలా మంది గుర్తుచేసుకున్నారు.

More Similar Blogs

    ఇంతకీ ఈ వైరల్ వీడియోలో ఏం ఉందంటే..

    ఒక బాలుడు ఉత్సాహంగా కిక్‌బాక్సింగ్ క్లాస్‌లో నిమగ్నమై ఉన్నట్లు కనిపిస్తాడు, కానీ కెమెరా జూమ్ చేస్తున్నప్పుడు, బాక్ గ్రౌండ్ లో మరో చిన్నారిదే అసలు కధ.  ఆ అబ్బాయి ఏడుపు మొహంతో గాలిలో బలహీనమైన పంచ్‌లను విసురుతూ ఉంటాడు. చూడబోతే  ఏ క్షణంలోనైనా భోరుమని ఏడిచేలా ఉన్నాడు. అతని వెనుక ఉన్న మూడవ అబ్బాయి దీనిని చూసి నవ్వుతూ ఉంటె..ఒక వ్యక్తి అతనికి నిశ్శబ్దంగా ఉండమని సైగ చేశాడు.

    "మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఏదైనా చేయమని బలవంతం చేసినప్పుడు.." అని ఓ ట్విట్టర్ యూజర్ ఈ  క్లిప్‌కి క్యాప్షన్ ఇచ్చారు. చాలా మంది నెటిజన్లు బాలుడి మానసిక స్థితిని ఇతర నిజ జీవితంలోని దృశ్యాలతో పోల్చారు. ఇంకొందరు పిల్లలను మరికరితో, అంటే బాగా వచ్చిన వారితో  పోల్చడం సరికాదని సూచించారు. ఈ సరదా వీడియోను మీరూ చూసేయండి.. 

    మరి మీకేమనిపిస్తోంది? కామెంట్ సెక్షన్లో తెలియచేయండి! మీ పిల్లలని మాత్రం వారి ఆశక్తి, ఇష్టాలకు వ్యతిరేకంగా ఏదైనా నేర్చుకోమని బలవంతం చేయకండే౦! 

    Be the first to support

    Be the first to share

    support-icon
    Support
    bookmark-icon
    Bookmark
    share-icon
    Share

    Comment (0)