చిన్న వయసు నుంచి మీ బిడ్డ ...
చిన్నారి పిల్లలకి వారు చేయవలసినవి మరియు చేయకూడనివి, ఒప్పు మరియు తప్పుల గురించి మార్గనిర్దేశం చేయడం తల్లిదండ్రుల బాధ్యత. పసిపిల్లలు 3 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు, వారు విషయాలను నేర్చుకోవడం మరియు అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. మీరు కోపంగా ఉన్నారా, సంతోషంగా ఉన్నారా లేదా విచారంగా ఉన్నారా అని అర్థం చేసుకోవడానికి వారు మిమ్మల్ని గమనిస్తారు. అందువల్ల, తల్లిదండ్రులు లేదా సంరక్షకులు పిల్లలను క్రమశిక్షణలో ఉంచడానికి, వారు సరైన దిశలో అభివృద్ధి చెందడానికి కొన్ని పరిమితులను నిర్వచించడం చాలా కీలకమైనది.
పిల్లలలో క్రమశిక్షణను ప్రేరేపించడానికి చిట్కాలు:
1 పదే పదే వినిపించకండి- అదే విషయాన్ని మళ్లీ మళ్లీ చెప్పడం వల్ల మీకు అధికారం ఉండదు. అది మీ పిల్లలకి చిరాకు కలిగించడమే కానీ, ఏ ప్రభావం చూపదు.
2 బాస్ లాగా మాట్లాడడం మానుకోండి- మీ బిడ్డతో మాట్లాడుతున్నప్పుడు మీ భాష మామూలుగా సరళంగా ఉండేలా చూసుకోండి, ఉదాహరణకు పిల్లలు అరుస్తున్నపుడు "అరవ వద్దు" అనే బదులు "ఎవరితోనైనా ఇలా అరవడం మంచి పద్ధతి కాదని మీకు తెలుసు" అని ఉపయోగించండి.
3 పిల్లలకు ప్రేమ చూపించడంలో ఎప్పుడూ విఫలం కావద్దు- వారి పట్ల మీరు చూపించే ప్రేమ భావం మరియు శ్రద్ధ, ఆ అమాయకమైన మనసులకు సమయస్ఫూర్తిగా ప్రవర్తించగల సామర్థ్యాన్ని ఇస్తుంది. ఐతే, మీ చర్చలు లేదా సూచనను సానుకూలమైన దృక్పధంతో ముగించాలని గుర్తుంచుకోండి.
4 మీ వ్యూహాలను అభివృద్ధి చేస్తూ ఉండండి- కొంటెతనం కలిగిన మీ పసిబిడ్డను ఎదుర్కోవటానికి మీరు ఉపయోగించిన వ్యూహాలు అతని చిన్నతనంలో బాగా పని చేసి ఉండవచ్చు. కానీ ఇప్పుడు తనకు అవన్నీ అలవాటు అయిపోయాయి. మీరు వాళ్ళని ఎదుర్కోవటానికి కొత్త టెక్నిక్‌ల కోసం వెతకడానికి ఇది సమయం.
5 మంచి ప్రవర్తనకు రివార్డ్‌లు- పొగడ్తలను, రివార్డ్‌లను మెచ్చుకోని వారు ఎవరూ ఉండరు. చిన్న్నపిల్లల మంచి ప్రవర్తనను గుర్తి౦చి కితాబునిస్తే వారు మరింత మెరుగైన స్వభావాన్ని, వ్యక్తిత్వాన్ని పొందేలా ప్రేరేపిస్తుంది.
6 సహజ పర్యవసాన విధానాన్ని ప్రయత్నించండి- ఈ పద్ధతిలో పిల్లలు వారు చేసిన పనుల యొక్క తరువాతి ప్రభావాలను అనుభవించడం ద్వారా వారు చేసిన తప్పులను గ్రహిస్తారు, వాటి నుండి నేర్చుకుంటారు. ఉదాహరణకు, ఒక పిల్లవాడు వేడి పాత్రను తాకితే, ఒకసారి కాలిన తర్వాత అతను దానిని తాకడానికి ధైర్యం చేయడుకదా!
7 నో అనండి: మీ సంతానం ఇబ్బందుల్లో పడకుండా ఉండటానికి వారి భద్రతకు సంబంధించిన పరిస్థితులలో "NO"ని ఉపయోగించండి. అది తప్పు కాదు.
8 మీ ప్రవర్తనతో వారి బాల్యాన్ని ప్రభావితం చేయండి- మీరు రోల్ మోడల్‌గా వ్యవహరించడం ద్వారా మీరు మీ బిడ్డను మీలాగే తీర్చిదిద్దుతున్నారు. వారు మీ చర్యలకు మరియు ప్రవర్తనకు అద్దంలాగా ప్రతిబి౦బిస్తారు. కాబట్టి, మీరు మీరు మీ కోపం, ప్రవర్తన, ఇతరులతో వ్యవహరించే విధానంతో జాగ్రత్తగా ఉండండి.
9 పర్యవసానాల గురించి వారికి తెలియజేయండి- మీ పిల్లలకు వారి చర్యలు, ప్రవర్తన యొక్క పరిణామాల గురించి తెలియజేయండి, తద్వారా వారు ఫలితం గురించి తెలుసుకుంటారు.
10 ఉపన్యాసాలు, చర్చలు జరపడం మానుకోండి- మీరు ఒక గంటసేపు అరిచినా, మీ ప్రసంగాన్ని వినడానికి మీ బిడ్డ కనీసం ఆసక్తిని కలిగి ఉండదు. అదేవిధంగా, ప్రత్యామ్నాయాలు మరియు ఎంపికలతో వారిని ప్రలోభపెట్టడం కూడా వారి ప్రవర్తనను పాడు చేస్తుంది. చిన్నపిల్లలు ఎల్లప్పుడూ లాభదాయకమైన చర్చల కోసమే ఎదురు చూస్తారు.
ఈ సమాచారం పేరె౦ట్ ట్యూన్ నిపుణుల ప్యానెల్‌లోని వైద్యులు మరియు నిపుణులచే తనిఖీ చేయబడింది మరియు ధృవీకరించబడింది. మా ప్యానెల్‌లో నియోనాటాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్, చైల్డ్ కౌన్సెలర్, ఎడ్యుకేషన్ & లెర్నింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్, లెర్నింగ్ డిజేబిలిటీ ఎక్స్‌పర్ట్ మరియు డెవలప్‌మెంటల్ పీదియాట్రిషియన్ ఉన్నారు.
Be the first to support
Be the first to share
Comment (0)