ఆంధ్రాలో హీట్‌వేవ్ అలర్ట్ ...
ఆంధ్రప్రదేశ్ లో ఎండలు దంచికొడుతున్నాయి. తుఫాన్, అల్పపీడనం కారణంగా కొన్ని రోజులు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టినా.. మళ్లీ ఎండలు భయపెడుతున్నాయి. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఎండ తీవ్రత పెరిగింది. 83 మండలాల్లో తీవ్ర వడగాల్పులు , మిగిలిన చోట్ల 157 మండలాల్లో వడగాల్పుల ప్రభావం చూపనున్నాయని విపత్తుల నిర్వహణశాఖ హెచ్చరించింది. కనీసం ఆదివారం వరకు ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని అధికార్లు సూచించారు. పలు ప్రాంతాల్లో 44°C-46°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వారు తెలిపారు. ఈ నేపధ్యంలో మీరు మీ చిన్నారిని ఈ అధిక ఉష్నోగ్రతల నుండి మీ బిడ్డ వేసవి వేడిని సులభంగా తట్టుకోవడానికి కొన్ని చిట్కాలు.. ఇవిగో మీకోసం!
ఎండ నుంచి దూరంగా ఉంచ౦డి
అన్నింటిలో మొదటిది, మీ బిడ్డను ప్రత్యక్ష సూర్యకాంతి నుండి దూరంగా ఉంచండి. మీ చిన్నారి కోసం బేబీ సన్‌స్క్రీన్‌ని కూడా ఉపయోగించవచ్చు. ఇంకా మీ శిశువు యొక్క మృదువైన, సున్నితమైన చర్మంపై క్రమం తప్పకుండా వాడవచ్చు. ప్రత్యేకించి మీరు బీచ్ లేదా స్విమ్మింగ్ పూల్ ప్లాన్ లేదా బయటకి వెళ్ళే ప్లాన్లు ఏవైనా ఉంటే ఇది చాలా ముఖ్యం.
2. డీహైడ్రేషన్‌ను నివారించండి
వేసవిలో చిన్నారికి హైడ్రేటెడ్‌గా ఉండటం అంటే శరీరంలో సరైన నీటిని కలిగి ఉండటం చాలా ముఖ్యం. అదేవిధంగా, బయట శిశువు చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడం కూడా అంతే ముఖ్యం. మీ బిడ్డకు స్నానం చేయించిన తర్వాత, వారి చర్మాన్ని సున్నితంగా తడిలేకుండా తుడిచి, ఆపై తేలికపాటి బేబీ మాయిశ్చరైజర్‌తో వారి చర్మాన్ని మసాజ్ చేయండి. మీ బిడ్డకు ఆరు నెలల వయస్సు వచ్చే వరకు నీరు తాగించాల్సిన అవసరం లేదు. తల్లి పాలలో తగినంత నీరు ఉంటుంది. అది మీ శిశువు యొక్క రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ఇంకా వారికి అవసరమైన నీటిని కూడా అందిస్తుంది. ఇంకా మీ పాపకు ఫార్ములా మిల్క్ ఇస్తున్నట్లైతే, అది కూడా మీ బిడ్డకు తగినంత నీటిని కూడా అందిస్తుంది. నిర్జలీకరణాన్ని నివారించడానికి, ఈ సమయంలో తల్లిగా మీరు తాగే నీటి పట్ల కూడా జాగ్రత్తగా ఉండటం మర్చిపోవద్దు.
3. తేలికపాటి లైట్ కలర్ దుస్తులు వేయండి
ఎండలలో కాటన్ బట్టలు సరైన ఎంపిక. మీ చిన్నారి పాపకి లైట్ షేడ్స్ ఉన్న కాటన్ దుస్తులు వేయండి. తద్వారా వారు చల్లగా మరియు ఉల్లాసంగా ఉంటారు. ఆర్గానిక్ కాటన్ సాధారణ కాటన్ కంటే ఎక్కువ మన్నికగలదని మరియు చర్మంపై తేలికగా ఉంటుందని మీకు తెలుసా! అది మీ బిడ్డను వేసవి కాలం అంతా చల్లగా మరియు స్టైలిష్‌గా ఉంచుతుంది.
4. చర్మ సమస్యలు, అలెర్జీలు ఉన్నాయేమో చూడండి
స్కిన్ పైన దద్దుర్లు లేదా ఇన్ఫెక్షన్లు మీ బిడ్డను అశాంతిగా మరియు అసౌకర్యంగా చేస్తాయి. మీ శిశువుకు చాలా అసౌకర్యంగా ఉన్నపుడు మీరు చర్మ పరమైన సంకేతాలను చూసినట్లయితే మీ శిశువైద్యుని సంప్రదించండి. అయితే, చాలా సార్లు డైపర్ వాళ్ళ వచ్చే సాధారణ దద్దుర్లకు బేబీ డైపర్ క్రీమ్‌ను ఉపయోగించడం ద్వారా ఇంట్లోనే చికిత్స చేయవచ్చు. మీ శిశువు చర్మానికి గాలి ఆడనివ్వండి. తనని ప్రతిరోజూ కొద్దిసేపు డైపర్ రహితంగా ఉండనివ్వండి. మీ శిశువు యొక్క సున్నితమైన చర్మంపై పూర్తి సురక్షితమైన కాటన్ దుస్తులు తొడగండి.
5. స్నాన సమయాన్ని తగ్గించండి
వేసవిలో కూడా మీ పసిబిడ్డను గోరువెచ్చని నీటిలో స్నానం చేయించడం మంచిది. అయితే, చల్లగా ఉంటుందని ఎక్కువ సేపు నీటిలో స్నానం చేయించడం వాళ్ళ తనచర్మం పొడిబారుతుంది. అలాకాకుండా ఉండేందుకు స్నానాన్ని ఎక్కువసేపు కాకుండా తగిన౦త సమయం మాత్రమే చేయడానికి ప్రయత్నించండి. మీ మణికట్టు పై వేసుకుని స్నానం చేయించే నీటి ఉష్ణోగ్రతను పరీక్షించ౦డి. ఇంకా ఆ నీటిలో మీ బిడ్డను ఉంచే ముందు నీటిని కొద్దిగా కలియతిప్పండి. స్నానపునీరు వెచ్చగా ఉండాలి కానీ వేడిగా ఉండకూడదు. సాధారణంగా సరైన నీటి ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్. ప్రశాంతమైన మసాజ్ ఆయిల్‌తో మీ పోస్ట్ బాత్ రొటీన్‌ను కొనసాగించండి. రోజువారీ మసాజ్ మీ శిశువు యొక్క ప్రసరణను మెరుగుపరుస్తుంది.
6. తేలికపాటి, ఇంట్లో తయారుచేసిన ఆహారాన్నివ్వండి
వేసవిలో నూనె లేదా మసాలా అధికంగా ఉండే ఆహారాలు పనికిరావు. మీ చిన్నారి భోజనం తేలికగా ఉంచండి. మీ పసిబిడ్డను అధిక డ్రింక్స్, ఐస్ క్రీమ్‌లు లేదా గాస్ ఉన్న డ్రింక్స్‌తో ఓవర్‌లోడ్ చేయవద్దు. సహజమైన, చలువ చేసే పదార్ధాలను ప్రయత్నించండి. ఆరు నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు, పాలు తీసుకోవడం యొక్క ఫ్రీక్వెన్సీని పెంచండి. మీరు మీ బిడ్డకు పాలిస్తుంటే,సరిపడా పాలు సమకూరే౦దుకు మీరు కూడా తగినంత ద్రవాలను తీసుకోవాలి.
7. నాపీ లేని బేబీయే హాపీ
డైపర్‌లు ఎటువంటి ప్రమాదాలు మరియు గందరగోళాన్ని నివారించడంలో సహాయపడతాయి. పిల్లలను శుభ్రపరచడాన్ని సులభతరం చేస్తాయి. కానీ, మీ శిశువు సంరక్షణ దినచర్యలో కొంత న్యాపీ సమయం లేకుండా ప్రేరేపించడం చాలా అవసరం. దీనివల్ల మీకు శుభ్రం చేసేపని ఎక్కువ కావచ్చు, కానీ మీ బిడ్డ చాలా సంతోషంగా మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. నడుస్తూ లేదా నేలపై పాకుతున్నపుడు వచ్చే నొప్పీని నివారించవచ్చు. నాపీ వేయకపోవడం వాళ్ళ వారి చర్మం శ్వాస పీల్చుకోగలుగుతుంది, దద్దుర్లు మరియు చర్మ ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచుతుంది.
8. వర్షపు జల్లుల కోసం సిద్ధం చేయండి
కొన్ని రోజుల పాటు మనం చాలా వేడిని భరించాల్సిందే. కానీ ఉన్నట్టుండి అకస్మాత్తుగా వర్షం పడవచ్చు. చిన్నపిల్లల రోగనిరోధక శక్తి ఇంకా అభివృద్ధి చెందుతున్నందున, మమ్మీలు ఇటువంటి అనుకోని సందర్భాలు, పరిస్థితులు ఎదుర్కోవడం కోసం సిద్ధంగా ఉండాలి. అంటే వర్షం, తుఫానుల కోసం ఒక గొడుగు, మీకు మరియు మీ బిడ్డ కోసం అదనపు బట్టలు, కొన్ని క్యారీ బ్యాగ్‌లు, నేప్‌కిన్‌లు, టవల్స్ సిద్ధంగా ఉంచుకోండి.
ఈ చిన్న విషయాలు, జాగ్రత్తలు మీరు ఇంకా మీ బిడ్డ రోజంతా ప్రశాంతంగా మరియు ఉల్లాసంగా ఉండటానికి సహాయపడతాయి. అన్నింటికంటే, మీరు మీ బిడ్డకు సూపర్ మమ్మీ కదా మరి!
మా టిప్స్ మీకు నచ్చాయా? మీకు మరిన్ని తెలుసా? అయితే, ఈ కింది కామెంట్ సెక్షన్ లో వాటిని బోలెడంతమంది తోటి తల్లిదండ్రులతో పంచుకోండి!
Be the first to support
Be the first to share
Comment (0)