మీ చిన్నారి పాపాయి కోసం.. ...
సింధుకి తను కోరుకున్నట్టు గానే పండంటి పాప పుట్టింది. చక్కగా చందమామలా ఉన్న ఆ పాపకి ఆకాంక్ష అని పేరు పెట్టారు. ఎంతో శ్రద్ధగా సంరక్షణ చేస్తున్నారు. ఐతే, సింధు పీజీ చేసినా కూడా పాపకి సంబంధించి కొన్ని విషయాల్లో, ముఖ్యంగా తన పాప జుట్టు సంరక్షణ గురించి టన్నుల కొద్దీ సందేహాలు ఉన్నాయి. పాప జుట్టును దువ్వాలా? ఎలా శుభ్రం చేయాలి? తల స్నానం చేయించాలా? ఎన్ని సార్లు? నూనె రాయాల్సిన అవసరం ఉందా? ఇలా ఎన్నెన్నో. మరి మీకూ అలాంటివే అనుమానాలు ఉన్నాయా? అయితే ఈ బ్లాగ్‌లో మీ శిశువు జుట్టు సంరక్షణ గురించి అన్ని విషయాలనూ తెలుసుకుందాం.. ఇంకెందుకాలస్యం.. రండి!
కొంతమంది పిల్లలు ఒత్తైనవెంట్రుకలతో పుడతారు, మరికొందరు దాదాపు బట్టతలతో ఉండవచ్చు. ఏదేమైనా, నవజాత శిశువు జుట్టు చక్కగా , మృదువుగా ఉంటుంది. అందుకే దానికి అదనపు జాగ్రత్త అవసరం. ఇక్కడ మరో విషయం ఏమిటంటే, పిల్లలకు తొలి నెలల్లో జుట్టు రాలడం సహజం. ఆపై వారి మొదటి పుట్టినరోజులోగా, అది మళ్లీ పెరగడం ప్రారంభమవుతుంది.
మీ గారాలపట్టి జుట్టును మీ వేళ్లతో మృదువుగా సవరించడం అంటే మీకెంతో ఇష్టం కదా? మరి అలాంటి వారి కేశాల సంరక్షణలో మీకు సహాయపడటానికి కొన్ని చిట్కాలు ఇవిగో:
మీ చిన్నారి ఎక్కువగా ఇంట్లోనే ఉంటాడు, ఎక్కువగా బయటికి వెళ్లడు కదా.. అందుకే మీరు తన జుట్టును మేగ్జిమం వారానికి రెండు సార్లు కడిగితే సరిపోతుంది.
స్నానం చేయిన్చేపుడు తమ తల ఇంకా ముఖాలపై నీరు ప్రవహించడంతో పిల్లలు భయపడవచ్చు. కాబట్టి మీ చిన్నారి భయం తగ్గించడానికి, దృష్టి మరల్చడానికి - విజర్, ఏదైనా బొమ్మ లేదా బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతున్న సంగీతం వంటివి ఏది ఉత్తమంగా పని చేస్తుందో మీరు కనుక్కోవాలి.
మీరు శిశువుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన మరియు హానికరమైన రసాయనాలు మరియు సువాసనలు లేని సున్నితమైన షాంపూని ఉపయోగిస్తున్నారని నిర్ధారించుకోండి.
కండిషనింగ్: ఒకోసారి మీ శిశువు జుట్టు చిక్కుబడి లేదా ముడిపడి ఉండవచ్చు. మంచి కండీషనర్ లేదా టూ-ఇన్-వన్ షాంపూ కండీషనర్ ఉపయోగించడం వల్ల ఆ చిక్కులను సులభంగా వదిలించుకోవచ్చు.
నూనె రాయడం: మీ శిశువు యొక్క జుట్టుకు నూనె రాయడం, సున్నితంగా మసాజ్ చేయడం వాళ్ళ రక్త ప్రసరణకి అదే సమయంలో చిన్నారి రిలాక్స్ కావడానికి ఒక గొప్ప మార్గం. ఐతేమీ శిశువు జుట్టుకు నూనె రాసేటప్పుడు గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి:
మీరు సీజన్ ఇంకా మీ శిశువు జుట్టు ఆకృతి ఆధారంగా నూనెను ఎంచుకొండి.
కొబ్బరి నూనె వంటి చాలవ చేసే నూనెలు వేసవిలోమంచివి. ఇక బాదం నూనె శీతాకాలంలో మంచి ఎంపిక.
కొబ్బరి నూనె కూడా మంచి కండీషనర్. ఇది విటమిన్ E మరియు లారిక్ యాసిడ్ కలిగి ఉంటుంది.
మరీ ఎక్కువ నూనె రాయకండి, కొద్దిసేపట్లో మంచి షాంపూతో కడిగేయండి
జుట్టు దువ్వడం: చిన్నారి పాపల దువ్వడం అనేది పూర్తిగా విభిన్నమైన విషయం. వారి దువ్వెన పదునైన పళ్ళు లేదా గుచ్చుకునేవి కానివి, విశాలమైన పళ్ళు ఉండేదిగా ఎంచుకోండి. మీ బేబీ జుట్టు దువ్వెనతో దువ్వడానికి ముందు, ఏదైనా చిక్కులు ఉంటే మీ వేళ్లను ఉపయోగించి సున్నితంగా విడదీయండి. అందువల్ల దువ్వెనతో చిక్కులను తీస్తే వచ్చే నొప్పిని నివారించవచ్చు
స్టైలింగ్: మీ శిశువు వెంట్రుకలు చాలా చక్కగా ఉంటాయి అదేవిధంగా సులభంగా ఊడిపోతాయి కూడా. కాబట్టి, మీ శిశువు జుట్టును ఎక్కువగా లాగుతూ గట్టిగా అల్లడం లేదా స్టైలింగ్ చేయడం మానుకోండి.
మీ శిశువు నెత్తిమీద చుండ్రును పోలి ఉండే పొడి ఇంకా గోధుమ లేదా పసుపు రంగు పొలుసులతో పాచెస్ - వీటిలో దేనినైనా చూసినట్లయితే, అది 'క్రెడిల్-క్యాప్' కావచ్చు. అసలు కారణం స్పష్టంగా తెలియనప్పటికీ, ఇది అదనపు నూనె కారణంగా వస్తుందని నమ్ముతారు. ఇది శిశువు యొక్క సెబోర్హీక్ గ్రంధుల నుండి ఉత్పత్తి అవుతుంది. క్రెడిల్-క్యాప్ ని ఎదుర్కోవటానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి:
మసాజ్: మీ శిశువు యొక్క స్కాల్ప్‌ను సున్నితంగా మసాజ్ చేయడం వల్ల ఆ ఫ్లేక్స్ వదులుతాయి. మీ శిశువు జుట్టును తరచుగా షాంపూతో శుభ్రం చేసుకోండి. మీరు మీ బిడ్డ జుట్టుకు నూనె రాస్తే, ఆ తర్వాత నూనెను బాగా కడిగివేయండి, ఎందుకంటే ఎక్కువగా ఉండే నూనెలు మళ్లీ రంధ్రాలు మూసుకుపోయేలా చేస్తాయి.
షాంపూ: క్రెడిల్-క్యాప్ ని పరిష్కరించడానికి ప్రత్యేకంగా రూపొందించిన షాంపూని ఉపయోగించండి, శిశువైద్యుని సంప్రదించండి
క్రెడిల్-క్యాప్ తీవ్రంగా ఉంది, అది శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించినట్లు లేదా రక్తస్రావం అయినట్టు మీరు గమనిస్తే, వెంటనే డాక్టర్ని సంప్రదించండి.
మీ పాపాయి జుట్టు సంరక్షణకు సంబంధించిన ఈ బ్లాగ్ ఉపయోగకరంగా ఉందా? మీ స్వంత చిట్కాలను మాతో పంచుకోండి.. కామెంట్ సెక్షన్లో!
Be the first to support
Be the first to share
Comment (0)