మహిళలలో సెర్వికల్ కాన్సర్ ...
పొద్దుట చేయాల్సిన పనంతా ముగించిన రాజేశ్వరి, కాస్త రిలాక్స్ అవుదామని కాఫీ కలుపుకుంది. హాల్లోని సోఫాలో కూర్చుని పేపర్ చదువుతూ కాఫీ తాగుతోంది. ఇంతలో ఒక వార్త ఆమె దృష్టిని ఆకర్షించింది. ఆడవారికి వచ్చే గర్భాశయ ముఖద్వార కేన్సర్ (సెర్వికల్ కాన్సర్-cervical cancer) నివారణకు ఉచిత టీకాను అందచేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన సన్నాహాలు చేస్తున్నాయి.. అని ఆ వార్త సారంశ౦. ఇదివరకు పోలియో, BCG, TB, ఇపుడు తాజాగా కరోనా వంటి అతి ప్రమాదకర వ్యాధులకు మాత్రమే ఉచిత వాక్సిన్ అందచేస్తున్నారు. ఇపుడు సర్వికల్ కాన్సర్ కూడా ఆ జాబితాలో చేరిందంటే.. ఇది తనలాంటి స్త్రీలందరూ దృష్టి పెట్టాల్సిన విషయమే అని అనుకుంది. మరి, మీరు కూడా వెంటనే దాని వివరాలు, కారణాలు, లక్షణాలు తెలుసుకొవాలా? అందుకే అన్నీ ఈ బ్లాగ్ లో అందించాం..
గర్భాశయ ముఖద్వార (సేర్విక్స్) అంటే యోనికి అనుసంధానమై ఉండే గర్భాశయం యొక్క దిగువ భాగం. సర్వికల్ కాన్సర్ అనేది అనేది ఆ భాగం లోని కణాలలో సంభవించే ఒక రకమైన క్యాన్సర్.
సర్వికల్ కాన్సర్ కు, లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్ అయిన హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) యొక్క వివిధ స్ట్రైన్ లు కారణ౦ అవుతాయి. HPVకి గురైనప్పుడు, సాధారణంగా, ఆ వైరస్ హాని చేయకుండా శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థ నిరోధిస్తుంది. అయితే, కొద్ది శాతం మహిళల్లో, వైరస్ సంవత్సరాలు జీవించి ఉంటుంది. కొన్ని గర్భాశయ కణాలు క్యాన్సర్ కణాలుగా మారడానికి దోహదం చేస్తుంది.
ప్రారంభ దశలో సర్వికల్ క్యాన్సర్ సాధారణంగా ఎటువంటి సంకేతాలు లేదా లక్షణాలను ఉత్పత్తి చేయదు.
అడ్వాన్సుడు దశలో సర్వికల్ క్యాన్సర్ లక్షణాలు:
సంభోగం తర్వాత, పీరియడ్స్ మధ్య లేదా మెనోపాజ్ తర్వాత యోని నుంచి రక్తస్రావం
యోని నుంచి నీరు లేదా రక్తంతో కూడిన స్రావాలు.. ఇవి చాలా దుర్వాసన కలిగి ఉండవచ్చు
సంభోగం సమయంలో పెల్విక్ (గర్భాశయ ముఖద్వారం) వద్ద నొప్పి లేదా బాధ
గర్భాశయ ముఖద్వారంలోని ఆరోగ్యకరమైన కణాలు వాటి DNAలో మార్పులు (మ్యుటేషన్లు) చోటుచేసుకున్నప్పుడు గర్భాశయ క్యాన్సర్ ప్రారంభమవుతుంది. వివరంగా చెప్పాలంటే.. ఆరోగ్యకరమైన కణాలు నిర్ణీత రేటుతో పుడతాయి, విభజన చెందుతాయి, చివరికి నిర్ణీత సమయంలో చనిపోతాయి. ఐతే అవాంచిత మ్యుటేషన్ల వాళ్ళ కణాలు పెరుగుతాయి, నియంత్రణ లేకుండా పెరిగిపోతాయి, అవి చనిపోవు. ఈ విధంగా పేరుకుపోయిన అసాధారణ కణాలు, ఒక కణితి లాగా (ట్యూమర్) ఏర్పడతాయి. ఈ క్యాన్సర్ కణాలు, సమీపంలోని కణజాలాలపై దాడి చేస్తాయి. కణితి నుండి విడిపోయి శరీరంలోని ఇతర చోట్ల వ్యాప్తి చెందుతాయి.
గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్‌కు కారణమేమిటో స్పష్టంగా తెలియదు, కానీ HPV పాత్ర పోషిస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. నిజానికి, HPV చాలా సాధారణ వ్యాధే. ఈ వైరస్ ఉన్న చాలా మందికి క్యాన్సర్ రాడు. అంటే.. దీని అర్థం - మీ చుట్టూ ఉన్న వాతావరణం, మీ లైఫ్ స్టైల్ వంటి ఇతర కారకాలు కూడా మీకు గర్భాశయ క్యాన్సర్ వస్తుందో, రాదో నిర్ణయిస్తాయి.
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు కారణం కాగల ప్రమాద కారకాలు:
ఎక్కువ మందితో శారీరిక సంబంధం లైంగిక భాగస్వాములు
చిన్న వయస్సులోనే లైంగిక చర్య (సెక్స్) ప్రారంభ౦ కావడం
క్లామిడియా, గోనేరియా, సిఫిలిస్ మరియు HIV/AIDS వంటి లైంగికంగా సంక్రమించే ఇతర అంటువ్యాధులు (STIలు)
ధూమపానం లేదా పొగ తాగడం
గర్భస్రావం నివారణకు మందులు వాడటం
పైన చెప్పిన విధంగా మీకు ఆందోళన కలిగించే ఏవైనా సంకేతాలు లేదా లక్షణాలు ఉంటే, వెంటనే మీ వైద్యునితో అపాయింట్‌మెంట్ తీసుకోండి.
గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి ఇలా చేయండి:
HPV వ్యాక్సిన్ తీసుకోవడం.
రెగ్యులర్ గా పాప్ పరీక్షలను చేయించుకోండి
సురక్షితమైన శృంగారం, లైంగిక భాగస్వాముల సంఖ్య పరిమితం చేయడం
ధూమపానం చేయవద్దు.
ఇంకా, సెర్వికల్ కాన్సర్ నివారణలో మీకు సహాయపడే వ్యూహాల గురించి మీ డాక్టర్ లేదా వైద్య నిపుణులతో మాట్లాడండి.
ఈ బ్లాగ్ ద్వారా చాల మంచి విషయాలను తెలుసుకున్నాం కదా..మరి వీటిని అందరికీ తెలిసేలా లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం మా పేరెంట్యూన్ మెడికల్ ఎక్స్పర్ట్ లను అడగండి!
Be the first to support
Be the first to share
Comment (0)