మీ పిల్లలకు చాలా చెమట పడు ...
12 సంవత్సరాల ప్రియాంక, పదేళ్ళ రోషన్ పార్క్ లో ఆడుతున్నారు. వాళ్ళ మమ్మీ సాధన ఒక కంటితో వాళ్ళను కనిపెడుతూనే, వాళ్ళ ఆటలను ఎంజాయ్ చేస్తూ౦ది. రన్నింగ్ రేస్ చేసి వచ్చిన ఇద్దరినీ కాసేపు కూర్చోమని చెప్పింది. ఇంతలో గేంలో గెలిచిన ప్రియాంక కి విపరీతంగా చెమట కారటం చూసింది. ఇదివరకు గమనించలేదు కాని.. ఇపుడు మాత్రం పాప టీ షర్ట్ చెమటతో ముద్ద అయిపోయింది. అది చూసిన సాధన, ఇదేంటి ఇంత చెమట పట్టింది.. ఇది ఓకేనా లేదా ఏదైనా సమస్యా అని ఆలోచించడం మొదలుపెట్టింది. ఆశ్చర్య౦ కలిగించే ఏమిటంటే, సాధన లాగే చాలా మంది తల్లిదండ్రులకు చెమట వల్ల కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాల గురించి ఇప్పటికీ తెలియదు. అందువల్ల, ఈ బ్లాగ్ లో మనం చెమట ఎందుకు పడుతుంది, చెమట వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి వంటి కీలక అంశాలపై దృష్టి పెడడాము.
టీనేజ్ ముందు (ప్రీటీన్స్) మరియు టీనేజర్లలో అధిక చెమట చాలా సాధారణం. సాధారణంగా పిల్లలకు అరచేతులు, పాదాలు లేదా చంకలు ఎక్కువగా చెమటలు పడతాయి. వారి ముఖ౦పైన కూడా చాలా చెమటలు పడతాయి! మీ పిల్లలు పార్క్‌లో ఆడుతున్నా, సైకిల్ తొక్కుతున్నా చెమటలు పట్టడం అనేది పూర్తిగా సాధారణమైనది. శరీర౦ చక్కగా, నార్మల్ గా పనిచేస్తుంది అనేందుకు ఇది సూచన. అవసరమైనపుడు శరీరం నుండి నీటిని ఆవిరి చేయడం ద్వారా శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే విధంగా మనిషి శరీరం రూపొందించబడింది.
మన శరీరం యొక్క ఉష్ణోగ్రతను నియంత్రించే ప్రక్రియగా చెమట పట్టడాన్ని నిర్వచించవచ్చు. చెమట గ్రంథులు శరీరం అంతటా కనిపిస్తాయి, కానీ అవి సాధారణంగా నుదురు, చంకలు, అరచేతులు మరియు పాదాల అరికాళ్ళపై ఎక్కువగా ఉంటాయి. గ్రంధుల ద్వారా ఉత్పత్తి చేయబడిన చెమట, చర్మం నుండి ఆవిరైపోతుంది. చెమటలో చాలా లవణాలు ఉన్నప్పటికీ, నీరు దానిలో ఎక్కువ భాగం ఉంటుంది. వీటన్నింటి ఫలితంగా, చెమటలోని నీరు ఆవిరైనప్పుడు చర్మం యొక్క ఉపరితలం చల్లబడుతుంది.
పిల్లలకు చెమట పట్టడం వల్ల కలిగే కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలను ఇప్పుడు పరిశీలిద్దాం-
1. శరీర ఉష్ణోగ్రతను సరిగ్గా నియంత్రిస్తుంది- చెమట యొక్క అతి ముఖ్యమైన పని శరీరాన్ని చల్లబరచడం. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, స్వేద గ్రంధుల ద్వారా ఉత్పత్తి చేయబడిన చెమట చర్మం ద్వారా ఆవిరైపోతుంది. ఇది శరీర ఉష్ణోగ్రత తగ్గించేందుకు కూడా ఉపయోగపడుతుంది. ఇంకా, చెమట చర్మం తేటగా, మెరుస్తూ కనిపించడానికి సహాయపడుతుంది, ఇది మొత్తం రూపాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
2. స్లీప్ ప్యాటర్న్‌ను మెరుగుపరుస్తుంది- రోజూ 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం వల్ల ఒంటికి చక్కగా చెమట పడుతుంది. ఇది నిద్రలేమిని అధిగమించడంలో సహాయపడుతుందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీరు చేయాల్సిందల్లా మీ పిల్లలకి చెమట పట్టేలా చేసే శారీరక శ్రమ లేదా వ్యాయామం చేయమని ప్రోత్సహించడం. మీ పిల్లల స్లీప్ పాటర్న్ (నిద్రా విధానం) క్రమరహిత౦గా ఉంటే, పడుకునే ముందు కొన్ని వ్యాయామాలు చేయమని వారికి చెప్పండి. మీ పిల్లలను సురక్షితంగా మరియు ఆరోగ్యంగా ఉంచడంలో ఈ చిట్కా భలే ఉపయోగపడుతుంది.
3. మరింత శక్తికి దారి చూపిస్తుంది- మీ పిల్లలు వివిధ రకాల శారీరక కార్యకలాపాలలో మునిగిపోతారు. మరి, ఆ కార్యకలాపాలు చెమటతో కలిసి ఉంటాయి. రెగ్యులర్ గా వ్యాయామ౦ చేయడం దినచర్యగా మారితే దానివల్ల ఎనర్జీ లెవెల్స్ పెరిగి ఆరోగ్యకరమైన పెర్ఫెక్ట్ బరువుతో సహా అనేక రకాల ఆరోగ్యప్రయోజనాలను అందిస్తుంది.
4. మన మెదడు కణాల మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది- మెదడులో హిప్పోకాంపస్ అని పిలువబడే ఒక ప్రాంతం ఉంది, ఇది శబ్ద జ్ఞాపకశక్తి మరియు అభ్యాసంలో పాల్గొంటుంది. ఇది సాధారణ ఏరోబిక్ కార్యకలాపాలతో ఇది పెద్దదిగా అవుతుంది. దానివల్ల పిల్లలు చడులో చురుగ్గా ఉంటారు.
చివరిగా..
మీ బిడ్డకు మరీ ఎక్కువగా చెమట పట్టి౦ది అనిపిస్తే.. వారితో ఒక గ్లాసు ఉప్పు వేసిన నిమ్మరసం తాగించడం ద్వారా శరీర ద్రవాల నష్టాన్ని భర్తీ చేయవచ్చు. అది వారి శరీరంలోని ఎలక్ట్రోలైట్‌లను సరిగ్గా బాలన్స్ చేయడంలో సహాయపడుతుంది. అయితే, మీ బిడ్డకి సాధారణం కంటే చాలా ఎక్కువ చెమటపడుతోందని అనిపిస్తే, మీరు మీ చైల్డ్ స్పెషలిస్ట్ సలహా తీసుకోండి. ఇంకా అవసరమైనప్పుడు వైద్య సహాయం తీసుకోండి. మా బ్లాగ్ ఉపయోగం అనిపిస్తే లైక్, షేర్, కామెంట్ చేయండి!
Be the first to support
Be the first to share
Comment (0)