పిల్లలు మాటలను అర్ధం చేస ...
ఎల్కేజీ చదువుతున్న కూతురు శ్రీనిజ డైరీని చూసింది దివ్య. పాప సరిగా వినటం లేదని, సమాధానాలు చెప్పటం లేదని కాస్త శ్రద్ధ వహించాలని వాళ్ళ క్లాస్స్ టీచర్ నోట్ పెట్టారు. తన పాప మామూలుగా చాలా తెలివైనది. ఇంకా స్కూల్ లో జాయిన్ చేయకుండానే అల్ఫాబెట్స్, నంబర్స్, రైమ్స్ అన్నీ జస్ట్ విని చెప్పేసేది… ఇపుడేంటి ఇలా అని ఆలోచనలో పడింది దివ్య. పాపని దగ్గర కూర్చోపెట్టుకుని, నవ్విస్తూ, తనకి ఇష్టమైన స్నాక్స్ ఇచ్చి మెల్లగా విషయం రాబట్టింది. ఇంతకీ పాప చెప్పిన కారణం విని ఆశ్చర్యపోయింది. అదేంటంటే.. వాళ్ళ టీచర్ మాస్క్ పెట్టుకుని చెప్పే లెసన్స్ శ్రీనిజకి అర్ధం కావడం లేదట. అలా చెప్తే టీచర్ ఏమంటుందో అనే భయంతో ఆమెకు చెప్పలేదట. మరి ఈ కొత్త కరోనా సమస్య గురించి వివరంగా తెలుసుకుందామా..
చాలా చోట్ల మాస్క్ ధరించడం తప్పనిసరి కానప్పటికీ, ఇది COVID-19 వైరస్‌కు వ్యతిరేకంగా నివారణ చర్యగా ఇప్పటికీ వాడుతున్నారు. మాస్క్‌లు కమ్యూనికేషన్‌ను మరింత సవాలుగా మార్చాయన్న విమర్శలను ఎదుర్కొంటున్నాయి. ఉదాహరణకు, UK డిపార్ట్‌మెంట్ ఫర్ ఎడ్యుకేషన్ తాజా విశ్లేషణ, పాండమిక్ సమయంలో మాస్క్ వాడకం తరగతి గది కమ్యూనికేషన్‌ను ప్రభావితం చేస్తుందని వెల్లడించింది.
ఐతే వినికిడి లోపం లేదా భాషా లోపాలు లేని వారికి స్పీచ్ కాంప్రహెన్షన్‌పై ఫేస్ మాస్క్‌ల ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని తాజా అధ్యయనం వెల్లడించింది.
ఈ కొత్త అధ్యయనంలో వినికిడి లేదా భాషా లోపాలు లేని పెద్దలు మరియు ఎనిమిది నుండి పన్నెండు సంవత్సరాల వయస్సు పిల్లలు సమాన సంఖ్యలో ఉన్నారు. క్లాత్ ఫేస్ మాస్క్ ధరించి ఎవరైనా మాట్లాడుతున్న వీడియోలను చూపించిన తర్వాత వారు విన్న ప్రతి వాక్యంలోని చివరి పదాన్ని తిరిగి చెప్పమని వారిని అడిగారు. దీని వల్ల శ్రోతలు ఎంత త్వరగా మరియు కచ్చితంగా ఫేస్ మాస్క్‌డ్ స్పీచ్‌ను గ్రహిస్తారో పరిశోధకులకు అంచనా వేయడానికి వీలు కలిగింది.
అంతే కాకుండా , మాస్క్ వేసుకుని ఇంకా మాస్క్ లేకుండా మాట్లాడినపుడు అది విన్నవారి గ్రహణశక్తి అంచనా వేసారు. మాస్క్ యొక్క ఆడియో మరియు విజువల్ ప్రభావాలను విడిగా అంచనా వేయడానికి, వారు వీడియోను కూడా మార్చారు. ఉదాహరణకు, వీడియోలోని స్పీకర్ మాస్క్ ధరించలేదు, కానీ ప్లే చేయబడుతున్న ఆడియో, మాస్కు వేసుకున్నప్పటిది .
ఈ అధ్యయనం ప్రకారం, పిల్లలు మాస్క్‌డ్ స్పీచ్‌ను 8% తక్కువ ఖచ్చితత్వంతో మరియు 8% నెమ్మదిగా ప్రాసెస్ చేసారు. అయితే పెద్దలు దానిని 6.5% తక్కువ ఖచ్చితంగా మరియు 18% నెమ్మదిగా ప్రాసెస్ చేస్తారు.
అధ్యయనంలో ఉన్న పెద్దలు పిల్లల కంటే త్వరగా ప్రసంగానికి ప్రతిస్పందించారు,
బ్రిటన్ అధ్యయనం ప్రకారం, ఫేస్ మాస్క్‌లు మన భాషా వినియోగాన్ని రెండు రకాలుగా ప్రభావితం చేస్తాయి. అవి స్పీకర్ స్వరాన్ని మారుస్తాయి మరియు వారి ప్రసంగం అర్ధం కాకుండా చేయవచ్చు. చాలా మాస్క్‌లు స్పీకర్ పెదవులను కూడా మూసివేస్తాయి.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మాట్లాడేవారి పెదవుల కదలిక కనపడకపోవడం కంటే.. మాస్క్‌లు ప్రసంగ ధ్వనిని మార్చడం పిల్లలపై ఎక్కువగా ప్రభావ౦ చూపుతోందని అధ్యయనం నిరూపిస్తుంది.
వింటున్నప్పుడు మరియు చూసేటప్పుడు ధ్వని మరియు దృశ్య సమాచారాన్ని ఒకదానితో ఒకటి అనుసంధానించడంలో పెద్దల కంటే యువకులకు తక్కువ నైపుణ్యం ఉండటం దీనికి కారణం కావచ్చు. ఫలితంగా, ముసుగు వేసుకున్న వక్త పెదవుల కదలికలను గమనిస్తూ ప్రసంగం విన్నంత మాత్రాన వినేవారికి అవగాహన పెరగదు.
అదేవిధంగా, మాట్లాడేవారి స్వరం స్పష్టంగా ఉన్నప్పుడు, వారి నోరు కనిపించకపోవడం వల్ల ఎటువంటి ప్రభావం ఉండదని పేర్కొంది. అయితే చాలా మాస్క్‌లు పెదవులను దాచిపెదాటాయి, అదే సమయంలో ప్రసంగ ధ్వనిని మారుస్తాయి కూడా.
సంభాషణ యొక్క టాపిక్ లేదా సబ్జెక్ట్ కూడా తగినంత ముఖ్యమైనదే. సంభాషణలో ఎదుటివారు ఏమి చెబుతారో అంచనా వేయగలిగినప్పుడు, ఫేస్ మాస్క్‌లు వినే వ్యక్తి యొక్క అవగాహనపై తక్కువ ప్రభావాన్ని చూపుతాయని అధ్యయనం తేల్చింది.
సంభాషణ సందర్భాన్ని అర్థం చేసుకోవడం వల్ల త్వరగా మరియు అప్రయత్నంగా భాషా గ్రహణశక్తి లభించడమే దీనికి కారణం.
ఉదాహరణకు, "పుట్టినరోజు" మరియు "బేక్డ్" అనే పదాలు చివరి పదం "కేక్"కి సంబంధించి అర్థాలను కలిగి ఉంటాయి. కొన్నిసార్లు "మీ పుట్టినరోజు కోసం నేను ఈ కేక్ వండాను" అనే వాక్యంలో ఇవి కలిసి కనిపిస్తాయి. వక్త ఏమి చెబుతాడో ఊహించడానికి ఈ జ్ఞానాన్ని మనిషి మెదడు ఉపయోగించుకోవచ్చు.
అధ్యయనం ప్రకారం, ఈ రకమైన సందర్భోచిత సమాచారాన్ని అందించడం వలన ప్రజలు మాస్క్ వేసుకున్న ప్రసంగాన్ని కూడా సులభంగా అర్థం చేసుకోవచ్చు. సందర్భాన్ని గురించిన సమాచారం ఇచ్చినప్పుడు, పిల్లలు మరియు పెద్దలు ఇద్దరూ మాస్క్ వేసిన ప్రసంగంలో కూడా కేవలం 1% తక్కువ ఖచ్చితత్వంతో అర్ధం చేసుకున్నారు. కమ్యూనికేట్ చేసేటపుడు మాస్క్‌ని ఉపయోగించడం కొన్ని సందర్భాల్లో మాత్రమే సవాలుగా ఉందటానికి గల కారణాన్ని ఇది వివరిస్తుంది.
ఈ బ్లాగ్ లో సమాచారం మీకు నచ్చిందా.. ఐతే like, comment ఇంకా share చేయండి.. మీ లాంటి పేరెంట్స్ అందరికీ తెలిసేలా చేయండి!
Be the first to support
Be the first to share
Comment (0)