పాప్‌కార్న్ వల్ల మీ బిడ ...
కొన్ని వస్తువులు ఎపుడూ మనచుట్టూ ఉన్నా, అవి పసిబిడ్డలకు ప్రమాదకరం కాగలవని మనం ఏమాత్రం ఊహించలేము. వాస్తవానికి ఇవన్నీ చాలా సాధారణమైనవే, కానీ ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా మన బుజ్జి పాపలకు తీవ్రమైన ముప్పును కలిగిస్తాయి. మీ బిడ్డ పాకడం (క్రాలింగ్) ప్రారంభించిన వెంటనే మీ ఇంటిని పసిపిల్లల సేఫ్ జోన్‌గా మార్చడం చాలా ముఖ్యం. మీరు చూసేలోగానే, పిల్లలు వాటిలో దేనినైనా అందుకుంటారు. ఇక అది నేరుగా ఆ చిన్న నోటిలోకి వెళుతుంది.. వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అటువంటి ఎనిమిది వస్తువులు, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ఇపుడు చూద్దాం.
చిరుతిండి / స్నాక్స్: పాప్‌కార్న్, వేరుశెనగ గింజలు లేదా డ్రై నట్స్ వంటి సాధారణ చిరుతిండ్లు, స్ట్రా మాదిరిగా సన్నగా ఉండే పసివారి వాయుమార్గంలో సులభంగా చిక్కుకుపోతాయి. పిల్లలు వీటిని తింటుప్పుడు, సాధారణంగా గమనించకుండా వదిలేస్తా౦. కానీ, ఇది ప్రమాదకరమైనది.
ద్రాక్ష: చిన్న చిన్న బంతులలా ఉండేద్రాక్షపండ్లు పిల్లల నోటి లోపలికి జారి, వారు ఉక్కిరిబిక్కిరి అయ్యేలా ఉంటాయి. #ParentuneTip:వాటిని ముక్కలు చేసి పిల్లలకు తినిపించడంఎల్లప్పుడూ మంచిది.
చాక్లెట్/కాండీ/చూయింగ్ గమ్: నాలుగు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు గట్టిగా ఉండే కాండీలను (బిళ్ళలు లేదా గట్టి చాక్లెట్లు) సులభంగా తినవచ్చు. కానీ, అంతకంటే చిన్న వయసు వారిని అవి తినకుండా నివారించాలి. ఇక మీ పిల్లలను నోటిలో చాక్లెట్/కాండీ/చూయింగ్ గమ్ ఉన్నపుడు వారిని అస్సలు పరిగెత్తనివ్వవద్దు.
లేటెక్స్ బెలూన్‌లు: పిల్లలు ఆడుకునే బెలూన్‌లు పగిలిపోవాదం సాధారణం. గాలి పోయిన ఈ బెలూన్‌ల ముక్కలు వారి నోటిలోకి వెళితే, వాయుమార్గాన్ని సులభంగా అడ్డుకుని, ఊపిరి ఆడకుండా చేసేస్తాయి.
బొమ్మలు: చిన్న బొమ్మలు, గుండ్రని వస్తువులు, గోళీలు, చిన్న బంతులు లేదా బొమ్మల భాగాలు పిల్లలకు పెద్ద ముప్పు కలిగిస్తాయి. బొమ్మలపై సిఫార్సు చేయబడిన వయస్సు ప్రకారం మాత్రమే మీ పిల్లలకు బొమ్మలు ఇవ్వండి. పొరపాటున అలాంటివి ఎవైనా ఉంటే.. వాటిని వదిలించుకోవడానికి మీచిన్నారి బొమ్మల బుట్టను క్రమం తప్పకుండా క్లియర్ చేయాలి.
బటన్లు: చిన్న బటన్లు లేదా గుండీలు సాధారణంగా ప్రతి ఇంట్లోనూ ఉండేవే. ఇవి సాధారణంగా చెల్లాచెదురుగా పడి ఉంటాయి. వాటిని పిల్లలకి అందకుండా సరైన స్థలంలో ఉంచేలా చూసుకోవాలి. ఇవి పిల్లలకు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి, కానీ అంతే సులభంగా వారిని ఉక్కిరిబిక్కిరి చేయవచ్చు.
నాణేలు: బటన్‌ల మాదిరిగానే, నాణేలు కూడా సాధారణంగా డ్రాయర్‌లు, టేబుల్ టాప్‌లు, అలమారాలు, కప్ బోర్డులు మొదలైన వాటిలో కనిపిస్తాయి. ఈ మెరిసే నాణేలను పిల్లలు చేతిలోకి తీసుకుని, ఆటలో భాగంగా నోటిలో పెట్టుకోవచ్చు. అలాకాకుండా ఉండాలంటే, కాయిన్స్ ఉంచడం కోసం ఏదైనా క్లోజ్డ్ బాక్స్ లేదా పిగ్గీ బ్యాంక్ వంటి సరైన ప్లేస్ ని కేటాయించండి. పసిపిల్లలకు పిగ్గీ బ్యాంకు ఇచ్చి, ఈ నాణేలను దానిలో ఉంచడం నేర్పించవచ్చు. (వ్యక్తిగతంగా, నా 2 సంవత్సరాల బేబీకి తన స్వంత పిగ్గీ బ్యాంకు ఉంది. ఆమె నాణేలు తనకు ఎక్కడ దొరికినా, దానిలో ఉంచమని మేము మా పాపకి నేర్పించాము. తను చక్కగా విని, దానికి పూర్తిగా కట్టుబడి ఉంటుంది!).
టాల్కమ్ పౌడర్: పౌడర్ అంటే పిల్లలకు చాలా సరదా. దానితో ఆడుకోవడానికి ఇష్టపడతారు. అయితే, పిల్లలు నోటిలో టాల్కమ్ పౌడర్ పోసుకోవడం, అది వారి గాలి మార్గాన్ని అడ్డుకోవడం, వారికీ ఊపిరి ఆడకుండా చేయడం.. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే పౌడర్ డబ్బా ఎపుడూ వారికి అందని అల్మారా లోపల ఉండేలా చూసుకోండి.
అన్నిటికన్నా ముఖ్య విషయం ఏమిటంటే అప్రమత్తంగా ఉండటం, మీ బిడ్డకు ప్రమాదకర౦ కాగల విషయాలపై అప్రమత్తంగా ఉండటం. వారికి అందని ఎత్తులో, అల్మారాలు లేదా బాక్సుల లోపల మీకు వీలైనంత ఎక్కువ వస్తువులను ఉంచడం, అవాంఛిత వస్తువులను వదిలించుకోవడానికి రోజూ కనీసం రెండుసార్లు ఇంటిని తుడుచుకోవడం ఎల్లప్పుడూ మంచిది.
ఈ బ్లాగ్ మీకు ఉపయోగకరంగా ఉందా? ఇతర సాధారణ వస్తువులు మరికొన్ని పరమాడం కావచ్చని మీరు భావిస్తున్నారా? లైక్ చేయండి, షేర్ చేయండి, దిగువ కామెంట్ సెక్షన్ లో మాకు తెలియజేయండి!
Be the first to support
Be the first to share
Comment (0)