బడికి వెళ్లనని బిడ్డ మారా ...
తెలంగాణతో సహా అనేక రాష్ట్రాల్లో వేసవి సెలవులు ముగిశాయి. స్కూళ్లన్నీ తెరుచుకు౦టున్నాయి. కరోనా పుణ్యమా అని దాదాపు రెండు సంవత్సరాల తరువాత బడి తలుపులు తీశారు. ఈ నేపధ్యంలో, కొంతమంది చిన్న పిల్లలు ఉత్సాహంగా బడికి వస్తే.. మరికొంత మంది మాత్రం తము స్కూలుకు వెళ్ళమని మొండికేస్తున్నారు. ఏది ఏమైనా, చిన్నారులను బడికి పంపటం తల్లికి ముఖ్యమైన బాద్యత అనే చెప్పాలి. అది ఎంతపెద్ద పదవిలో ఉన్నా, చివరికి కలెక్టర్ అయినా సరే.. మినహాయింపు లేదనే చెప్పాలి. తన కుమారుణ్ని బడిలో దిగబెట్టడానికి కలెక్టర్ స్వయంగా రావటమే కాకుండా , బాబు క్లాసుకు వెళ్లనని మారం చేయడంతో బుజ్జగించి, బతిమాలి పంపక తప్పలేదు. ఇంతకీ ఎవరు ఆ కలెక్టర్ అనుకుంటున్నారా?
కరోనా వ్యాప్తి మరోసారి తన విశ్వరూపాన్ని చూపిస్తున్నప్పటికీ.. తగినన్ని జాగ్రత్తలు తీసుకునే పాఠశాలలు నడుపుతామని కేసీఆర్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. దాంతో తల్లిదండ్రులు కూడా ముందుకు వచ్చి తమ పిల్లలను పాఠశాలలకు పంపుతున్నారు. చాలా రోజుల తరువాత పాఠశాలల ఆవరణలు అన్నీ పిల్లలతో కళకళలాడాయి.
కాగా, ఆదిలాబాద్ జిల్లాలోని ఒక ప్రైవేటు పాఠశాల పిల్లలు ఉదయాన్నే బడికి వచ్చారు. వారిలో కలెక్టర్ సిక్తా పట్నాయక్ కుమారుడు సారంగ్ కూడా ఉన్నాడు. కుమారుణ్ని స్కూల్లో దించడానికి స్వయంగా ఆమె పాఠశాలకు వచ్చారు. కానీ, ఆ బుడ్డోడు మాత్రం తరగతి గదిలోనికి వెళ్లనని మారాం చేశాడు. కాసేపు ఏడ్చాడు కూడా.
ఇక కుమారుడిని బుజ్జగించడానికి కలెక్టర్ మాడంకి చాలా సమయమే పట్టింది. ఎంతోసేపు తరవాత కానీ సారంగ్ క్లాస్ లోకి వెళ్లలేదు. కాగా, ఈ ప్రహసనాన్ని అక్కడ ఉన్నవారు వీడియో తీయడంతో అది కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు, అమ్మ మనసు అంటే ఇదే అని, జిల్లాకు కలెక్టర్ అయినా కొడుకుకు అమ్మే కదా అంటూ కామెంట్లు పెడుతున్నారు.
బిడ్డను బుజ్జగించిన కలెక్టర్..
కలెక్టర్ సిక్తా పట్నాయక్ కుమారుడు సారంగ్ మొదట కొద్దిసేపు మారాం చేసినప్పటికి చివరకు అమ్మ మాట విని తరగతి గదిలోకి వెళ్ళాడు. బాబును మహిళా ఉపాధ్యాయులు కూడా దగ్గరుండి క్లాస్‌లోకి తీసుకువెళ్ళారు. జిల్లాకు కలెక్టర్ అయి ఉండి ఏమాత్రం అధికారం, దర్పం ప్రదర్శించకుండా, తన బిడ్డను స్కూల్‌కి తీసుకెళ్లేందుకు ఓ సాధారణ తల్లిలా పాఠశాలకు వచ్చి, దింపి వెళ్లిన కలెక్టర్ తీరును చూసి పలువురు ప్రసంశించారు. మరి, ఆ సంఘటనను మీరూ చూసేయండి!

బడిబాటపట్టిన చిన్నారులు – మారాం చేసిన కలెక్టర్ కొడుకు – నచ్చజెప్పి తరగతి గదిలో వదిలి వెళ్ళిన ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్#AdilabadCollector #SiktaPatnaik pic.twitter.com/CoPPmFCfCp
— News18 Telugu (@News18Telugu) June 14, 2022

Be the first to support
Be the first to share
Comment (0)