1. మంకీపాక్స్ గాలి ద్వారా వ్ ...

మంకీపాక్స్ గాలి ద్వారా వ్యాప్తిస్తుందా? దేశ, విదేశ నిపుణులు ఏమంటున్నారంటే..

All age groups

Ch  Swarnalatha

2.6M views

2 years ago

మంకీపాక్స్ గాలి ద్వారా వ్యాప్తిస్తుందా? దేశ, విదేశ నిపుణులు ఏమంటున్నారంటే..
రోజువారీ చిట్కాలు
వ్యాధి నిర్వహణ & సెల్ఫ్‌కేర్
రోగనిరోధక శక్తి

రాజేష్ చిన్నపాటి బిజినెస్ చేస్తూ ఉంటాడు. అలా అతని షాప్ కి ఎంతోమంది వస్తూ పోతూ ఉంటారు. కరోనా దెబ్బ  నుండి బిజినెస్ ఇపుడిపుడే కోలుకుంటోంది. ఐతే, ఇపుడు మంకీపాక్స్ అంటూ మరో కొత్త వైరస్ వ్యాధి తలెత్తింది. దీనిని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే అంతర్జాతీయ హెల్త్ ఎమర్జెన్సీ గా ప్రకటించింది. ఎక్కడో కేరళ లోనో, దిల్లీలోనో ఉందనుకున్న మంకీపాక్స్ ప్రమాదం తెలుగు రాష్ట్రాలకూ చేరే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

కామారెడ్డిలో మంకీపాక్స్‌ అనుమానిత కేసు బయటపడడంతో నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రికి రెఫర్‌ చేసిన సంగతి విదితమే.  ఇక తాజాగా.. ఖమ్మం పట్టణానికి చెందినా మరో వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు కానరావడంతో అతని నుంచి సేకరించిన సాంపిల్స్ పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి నిర్ధారణ కోసం పంపారు. ఈ పరిస్థితిలో.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తన షాపుకు వచ్చే వారి నుండి సోకే  గాలి ద్వారా తనకు మంకీ ఫాక్స్ వ్యప్తిస్తుం దేమో అని రాజేష్ భయపడుతున్నాడు. మరి, ఆ విషయమై నిపుణులు ఏమంటున్నారో ఈ బ్లాగులో చూద్దాం. 

More Similar Blogs

    గాలివల్ల మంకీపాక్స్ ..?

    మంకీపాక్స్‌ గురించి ప్ర­జ­లు ఆందోళన చెందాల్సిన పని లేదని, ఇది ప్రాణాంతక వ్యాధి కాదని హైదరాబాద్ నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్, మంకీపాక్స్‌ నోడల్‌ అధికారి డాక్టర్‌ కె.శంకర్‌ అన్నారు. అంతేకాకుండా, ఇది గాలి ద్వారా వ్యాప్తి చెందదని, రోగితో దీర్ఘకాలం పాటు సమీపంగా ఉండే వాళ్లకు మాత్రమే ఇది వ్యాపించే అవకాశముందని ఆయన వివరించారు. మంకీపాక్స్ ఎదుర్కొనేందుకు తెలంగాణా ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని కూడా ఆయన  తెలిపారు.

    మంకీపాక్స్ పై అమెరికా నిపుణులు ఏమన్నారంటే..

    “కోవిడ్-19 లేదా మీజిల్స్‌కు కారణమయ్యే వైరస్‌ల కంటే మంకీపాక్స్ వైరస్ పూర్తిగా భిన్నమైన వైరస్. ఇది గాలిలో వ్యాప్తిస్తు౦దని ఇంతవరకు నిర్ధారణ కాలేదు. ఒకే ప్రదేశంలో ఉన్నప్పటికీ తక్కువ వ్యవధిలో వారికి గాలి ద్వారా మంకీవాక్స్  సోకదు.” అని అమెరికా ప్రభుత్వానికి చెందిన సెంటర్స్ ఫర్ డిసీజెస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వైద్య నిపుణులు  స్పష్ట౦ చేశారు.

    తెలంగాణలో మంకీపాక్స్?

    దేశంలో మంకీపాక్స్‌ వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించినందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారి సూచించారు. ఈ నేపథ్యంలో డాక్టర్‌ కె.శంకర్‌ ఈ నెల మొదటి వారంలో కువైట్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చి కామారెడ్డిలో స్వగ్రామానికి వెళ్లిన వ్యక్తి ఈ నెల 20న జ్వరంతో అస్వస్థతకు గురయ్యాడని.. తాజా పరీక్షల్లో అతనికి లక్షణాలే తప్ప మంకీపాక్స్ సోకలేదని ఆయన చెప్పారు. 

    ఇది గాలి ద్వారా వ్యాపించదు, కానీ ఎవరైనా సోకిన వ్యక్తికి దగ్గరగా ఉన్నట్లయితే, అతను లేదా ఆమె మంకీపాక్స్ వ్యాధి బారిన పడవచ్చు.

    గాంధీ ఆస్పత్రికి డీఎన్‌ఏ ఎక్సాక్షన్‌ మిషన్‌ 

    స్మాల్‌పాక్స్‌ (మశూచి) వ్యాక్సిన్‌ తీసుకున్న వాళ్లలో 90 శాతం మంకీపాక్స్‌ వచ్చే అవకాశాల నుంచి రక్షణ ఉంటుందని డా.శంకర్‌ చెప్పారు. నిర్ధారణ పరీక్షల కోసం మరో రెండు రోజుల్లో గాంధీ మె­డికల్‌ కాలేజీ నోడల్‌ కేంద్రంలో డీఎన్‌ఏ ఎక్సాక్షన్‌ మిషన్‌ అందుబాటులోకి వస్తుందన్నారు. పరీక్షలకు సంబంధించిన కిట్స్‌ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలిస్తే.. గతంలో స్మాల్‌పాక్స్‌ కేసులకు వాడిన యాంటీ వైరల్‌ డ్రగ్స్, ఇమ్యునోగ్లోబులిన్‌ డ్రగ్స్‌ మంకీపాక్స్‌ రోగులకు వాడతామని చెప్పారు. ఈ డ్రగ్స్‌ గత 40 ఏళ్లుగా వాడటం లేదని, ఐసీఎంఆర్‌ నుంచి అనుమతి వస్తే ఆ యాంటీ వైరల్‌ డ్రగ్స్‌ వాడతామన్నారు.

    నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే

    మంకీపాక్స్‌ వైరస్‌ సోకినా, సోకిందని అనుమానం వచినా నిర్లక్ష్యం చేయవద్దని డా.శంకర్‌ సూచించారు. లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స పొందడంలో నిర్లక్ష్యం చేస్తే ఊపిరితిత్తులకు చేరి న్యుమోనియాకి దారితీయవచ్చని తెలిపారు. తద్వారా మెదడుపై ప్రభావం చూపి ఫిట్స్‌ వచ్చే అవకాశం ఉందన్నారు. రెండో దశలో ప్రాణాలకు కూడా ప్రమాదముందని హెచ్చరించారు. ఎవరికైనా జ్వరం వచ్చి శరీరంపై దద్దుర్లు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. మంకీపాక్స్‌ వ్యాధికి ప్రత్యేకంగా చికిత్సలేమీ లేవని, చికెన్‌పాక్స్‌ మాదిరిగానే చికిత్సలు అందిస్తామని తెలిపారు.

    ఈ బ్లాగ్ మీకు నచ్చిందా? ఉపయోగకరం అనిపించిందా.. ఐతే తప్పక షేర్ చేయండి.. మరింతమందికి ఈ ముఖ్యమైన సమాచారం చేరేలా చూడండి!

    Be the first to support

    Be the first to share

    support-icon
    Support
    bookmark-icon
    Bookmark
    share-icon
    Share

    Comment (0)