మీ టీనేజ్ పిల్లలకు ఆర్ధి ...
హైదరాబాద్ లో మైనర్లను టార్గెట్‌గా చేసుకుని కాల్ మనీ గ్యాంగ్ విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. వీరు ఒక ముఠాగా ఏర్పడి అమాయకులైన మైనర్ల అవసరాలకి అప్పులు ఇచ్చి, ఖాళీ ప్రాంసరీ నోటుపై వారితో సంతకం చేయించుకుంటున్నారు. అనంతరం, చుక్కల్ని తాకే వడ్డీలతో చుక్కలు చూపిస్తున్నారు. చక్రవడ్డీలు వేసి డబ్బు వసూలు చేస్తున్నారు. అడిగినంతా కట్టకపోతే ఇస్తావా చస్తావా అంటూ బెదిరింపు లకు పాల్పడుతున్నారు. ఈ టార్చర్ భరించలేక కొంతమంది యువకులు ప్రాణాలు కూడా తీసుకున్నారు. ఇలాంటి మనీ ముఠా వలలో చిక్కుకొని, తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్న విద్యార్థి ఒకరు పోలీసులను ఆశ్రయించడంతో షాకింగ్ వివరాలు వెలుగులోకి వచ్చాయి. రూ. 15 వేలకు గాను మూడు నెలల్లో లక్ష చెల్లించినప్పటికీ, ఇంకా 90 వేలు బకాయి ఉందని అది తీర్చాలని బెదిరింపులకు పాల్పడటం గమనార్హం.
ఈ నేపధ్యంలో చదువుకునే పిల్లలు, ముఖ్యంగా యుక్తవయస్కులు, తమ జీవితాంతం పొదుపు చేయడానికి, బాధ్యతాయుతంగా ఖర్చు చేయడానికి చిన్నవయస్సులోనే డబ్బు విలువ తెలుసుకునేలా చూడడం చాలా ముఖ్యం. వాస్తవానికి, ఈ టీనేజ్ పిల్లలకు ఆర్థిక పాఠాలు బోధించాలంటే కొన్ని వందలు వృధా కావచ్చు, అయినప్పటికీ, పెద్దయ్యాక లక్షల్లో తప్పులను, మానసిక వేదనను నివారించడంలో ఇది వారికి సహాయపడుతుంది.
మీ యుక్తవయస్సు పిల్లలు ఆర్థికంగా క్రమశిక్షణ కలిగి ఉండటానికి డబ్బు గురించి ఈ కింది ముఖ్యమైన పాఠాలను బోధించడం ప్రారంభించండి:
బడ్జెట్ - మీ టీనేజ్జర్ కి బడ్జెట్ ఇవ్వండి. కాఫీ, సినిమాలు, షాపింగ్, ఫాస్ట్ ఫుడ్... అన్నీ ఖర్చులను రాయమని వారిని అడగండి. వారానికొకసారి దాన్ని సరిచూసుకోమని గుర్తు చేయండి. ఇక ఆయా అన్ని అంచు ఖర్చుల మొత్తాన్ని చూసి వారే ఆశ్చర్యపోతారని చాలెంజ్ ఇవ్వండి. అవసరాలు, కోరికల మధ్య వ్యత్యాసాన్ని వారికి వివరించడానికి ఇది సరైన అవకాశం. తమ డబ్బునంతా స్నేహితులతో కాఫీలకు, షికార్లకు ఖర్చు చేయడం వాళ్ళ, వారు తమకు అవసరమైన స్పోర్ట్స్ షూలను కొనుగోలు చేయలేకపోవచ్చు..అని వివరించండి.
గోల్ సెట్టింగ్ - మీ పిల్లలకు వారు నిజంగా కోరుకునే దాని కోసం ఆదా చేయమని అడగడం ద్వారా గోల్ సెట్టింగ్ యొక్క ప్రాముఖ్యతను నేర్పండి. మీ యుక్తవయస్సు పిల్లలు ఐప్యాడ్ కావాలంటే, దాని ధరను తెలుసుకోమననండి. వారు దానిని లక్ష్య౦ గా పెట్టుకుని, దాన్ని చేరుకోవడానికి ప్రతి నెల ఎంత ఆదా చేసుకోవాలో లేక్కవేయమని అడగండి.
తెలివిగా ఖర్చు చేయడం - మీ టీనేజ్ కోసం బట్టలు లేదా యాక్ససరీస్ కోసం ఎంత ఖర్చు చేస్తున్నారోలెక్కవేసి, ఒక నెల ఆమె కోసం షాపింగ్ చేయడానికి సరిపోయే డబ్బును వారికి అందజేయండి. వారు తప్పు ఎంపికలు చేసి, తనను తాను ఇరుకున పెట్టుకుననపుడు, వారికి డబ్బు ఇవ్వాలనే ఆలోచనను నిరోధించండి. అపుడే మీ టీనేజర్ కు తెలివిగా ఖర్చు చేయడంలో అమూల్యమైన పాఠాన్ని అందిస్తుంది.
నెలవారీ పొదుపు - మీ టీనేజర్ పాకెట్ మనీ సంపాదించడానికి ప్రోత్సహించండి. ఇంకా, ‘మీ బిల్లులు మీరే మొదట చెల్లించుకోవడం’ అనే భావనను వారికి నేర్పించడం మంచిది. అది తమ ప్రయోజనాన్ని ప్రదర్శించడానికి వారికి అవకాశం అవుతుంది. అంతేకాకుండా బిల్లులు వెంటనే చెల్లించడం వల్ల వడ్డీపై మిగులు అనే మాజిక్ ను ఆన్‌లైన్ కాలిక్యులేటర్‌లో వారికి అర్ధం అయ్యేలా చూపించండి.
ప్లాస్టిక్ డబ్బును నిర్వహించడం - చాలా మంది యువత తమ మొదటి జీతం సంపాదించడం ప్రారంభించే సమయానికి క్రెడిట్ కార్డ్ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. క్రెడిట్ కార్డ్‌ని స్వైప్ చేసిన ప్రతిసారీ, మీరు అప్పు తీసుకుంటున్నారని మీ పిల్లలకు చెప్పడం అలవాటు చేసుకోండి. ఇంకా ఒక అడుగు ముందుకు వేసి, అధిక వడ్డీ రేట్ల రసీదులను వారికి చూపించండి.
ఆర్థిక క్రమశిక్షణ అనేది మీరు మీ పిల్లలకి అందించగల ముఖ్యమైన లైఫ్ స్కిల్స్ లో ఒకటి. చిన్న వయస్సులోనే కష్టపడి పని యొక్క ప్రాముఖ్యతను, డబ్బు విలువను నేర్చుకోవడం, భవిష్యత్తులో సమర్థవంతమైన ఆర్థిక లక్ష్యాలను పెట్టుకోవడం, వాటిని సాధించడానికి తెలివిగా పెట్టుబడి పెట్టడం వారికి సహాయపడుతుంది. మీ యుక్తవయస్సు పిల్లలకు సంపన్నమైన భవిష్యత్తును సృష్టించడానికి ఇప్పుడే చర్య తీసుకోండి.
Be the first to support
Be the first to share
Comment (0)