1. దేశంలో మళ్ళీ బ్లాక్ ఫీవర్ ...

దేశంలో మళ్ళీ బ్లాక్ ఫీవర్: పశ్చిమ బెంగాల్ లో 60కి పైగా 'కాలా-అజార్' కేసులు నమోదు

All age groups

Ch  Swarnalatha

2.2M వీక్షణలు

3 years ago

దేశంలో మళ్ళీ బ్లాక్ ఫీవర్: పశ్చిమ బెంగాల్ లో  60కి పైగా 'కాలా-అజార్' కేసులు నమోదు
కరోనా వైరస్
రోగనిరోధక శక్తి
వైద్య

మూలిగే నక్కపై పిడుగు పడినట్టు.. కరోనా వైరస్ మహామ్మరి వ్యాపించిన కాలంలోనే బ్లాక్ ఫీవర్ కూడా ప్రజలను వణికించింది. అనంతర, టీకా కార్యక్రమాల ద్వారా కోవిడ్ శాంతించింది..అలాగే బ్లాక్ ఫేవర్ కేసులు కూడా సున్నకు చేరుకున్నాయి. ప్రజలు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకునేంతలో దేశంలో మళ్ళీ కాలా-అజార్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. 

గత రెండు వారాల వ్యవధిలో  పశ్చిమ బెంగాల్‌లోని 11 జిల్లాల్లో కనీసం 65 బ్లాక్ ఫివర్  లేదా కాలా-అజర్ కేసులు నమోదయ్యాయి. డార్జిలింగ్, మాల్డా, ఉత్తర దినాజ్‌పూర్, దక్షిణ్ దినాజ్‌పూర్ మరియు కాలింపాంగ్‌లలో అత్యధికంగా కేసులు నమోదైన జిల్లాలు ఉన్నాయని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ సీనియర్ అధికారి తెలిపారు.

More Similar Blogs

    నిజానికి పశ్చిమ బెంగాల్ నుండి కాలా-అజర్ ఆచరణాత్మకంగా నిర్మూలించబడింది. అయితే ఇటీవల జరిపిన సర్వే 11 జిల్లాల్లో 65 కేసులను గుర్తించడానికి దారితీసింది. ఇప్పుడు ఈ కేసులు తెరపైకి వచ్చిన నేపధ్యంలో రాష్ట్రంలో వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చు. బీర్భూమ్, బంకురా, పురూలియా, ముర్షిదాబాద్ జిల్లాల్లో కూడా కొన్ని నల్ల జ్వరం కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి ప్రధానంగా ‘లీష్మానియా డోనోవానీ’ అనే పరాన్నజీవి సోకిన ఈగలు ద్వారా వ్యాపిస్తుంది. కాగా, 

    అధికారిక సమాచారం ప్రకారం, రాజధాని  కోల్‌కతాలో ఇంకా ఎటువంటి కేసు కనుగొనబడలేదు.

    బ్లాక్ ఫీవర్ ఎక్కడంటే..

    బీహార్, జార్ఖండ్ మరియు ఉత్తరప్రదేశ్‌లలో ఎక్కువ సమయం గడిపిన వ్యక్తులలో ఈ వ్యాధి ఎక్కువగా ప్రబలిందని, బంగ్లాదేశ్‌కు చెందిన కొంతమంది వ్యక్తులు కూడా కాలా-అజర్ లక్షణాలు కలిగిఉన్నారని ఆ అధికారి తెలిపారు. నిఘా ప్రక్రియ కొనసాగుతుందనే ఆయన తెలియచేసారు. 

    బ్లాక్ ఫీవర్ కు ఉచిత చికిత్స

    ఇదిలా ఉండగా, వ్యాధి నిర్ధారణ అయిన వారందరికీ ఉచితంగా చికిత్స అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రోగులకు పౌష్టికాహారం అందించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ ఇన్ఫెక్షన్ ప్రైవేట్ లేబొరేటరీ లేదా ఆసుపత్రిలో గుర్తించబడినప్పటికీ, డాక్టర్లు  వెంటనే విషయాన్ని జిల్లా ఆరోగ్య అధికారి దృష్టికి తీసుకురావలసి ఉంటుందని వివరించారు. భోజనంతో పాటు చికిత్సకు అయ్యే ఖర్చులన్నీ రాష్ట్ర ఆరోగ్య శాఖ భరిస్తుంది. జిల్లా చీఫ్ హెల్త్ ఆఫీసర్ ఈ మొత్తం ప్రక్రియను పర్యవేక్షిస్తారు.

    మీ అభిప్రాయాలను, మరింత సమాచారాన్ని కామెంట్ సెక్షన్లో పంచుకోండి!

    Be the first to support

    Be the first to share

    support-icon
    Support
    bookmark-icon
    Bookmark
    share-icon
    Share

    Comment (0)

    When is a Child ready for a Pet?

    When is a Child ready for a Pet?


    All age groups
    |
    2.2M వీక్షణలు
    Celebrating Independence at 65

    Celebrating Independence at 65


    All age groups
    |
    11.4M వీక్షణలు