నిపిల్స్ పై బుడిపెలు సాధా ...
మాధవి ఒక వర్కింగ్ వుమన్. ఇద్దరు పిల్లలకు తల్లి కూడా కాబట్టి ఆమె రోజు మొత్తం ఉరుకులు, పరుగులు పెడుతూనే ఉంటుంది. ఐతే ఈ మధ్య స్నానం చేస్తున్నపుడు తన చనుమొనల (నిపిల్స్) చుట్టూ చిన్న గుండ్రని బుడిపెల మాదిరిగా ఉన్నాయని ఆమె గమనించింది. ఆడవారిలో ఇది మమూలేనా లేదా డాక్టర్ ని సంప్రదించాలా అని ఆలోచనలో పడింది. మనలో చాలామందికి కూడా ఇదే సందేహం ఉండవచ్చు. సో, మన అందరి సందేహాలను ఆ బ్లాగ్ లో ఇపుడు డిస్కస్ చేద్దాం..
ఆడవారు తమ శరీరానికి, ముఖ్యంగా వ్యక్తిగత అవయవాలకు సంబంధించి అంతగా పట్టించుకోరు. కానీ వారు కాస్త సమయం కేటాయించి, కొన్ని రోజులకు ఒకసారైన తమ శరీరం తీరుతెన్నులు, మార్పులు వంటివాటి పట్ల శ్రద్ధ వహించడం వల్ల చాలా సమస్యలను నివారించవచ్చని డాక్టర్స్ మరీమరీ చెప్తున్నారు.
మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మొదట విన్నపుడు ఇది వింతగా అనిపించినప్పటికీ, ఇది పూర్తిగా సాధారణమైనది. మీ చనుమొనల చుట్టూ ఉన్న గడ్డల గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. పైగా చాలామంది స్త్రీలకు అరోలాపై చిన్న, నొప్పిలేని బుడిపెల వంటి గడ్డలు ఉంటాయి. ఇంకా మొటిమలు, చర్మం లోపల ఉండిపోయిన హెయిర్ ఫోలికల్స్ కూడా చాలా సాధారణం ఇవి ఎవరికైనా ఉండవచ్చు. ఇక గడ్డల గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే, చర్మం యొక్క పెరిగిన పాచెస్, మొటిమలు, వైట్ హెడ్స్ ఈ విధంగా మారి ఉండవచ్చు. అయితే, అవి బాధాకరంగా లేదా దురదగా మారినా, దద్దుర్లు, ఎర్రగా మారడం, చీము లేదా ద్రవాలు వెలువడటం వంటి సంకేతాలు కనిపిస్తే, వైద్య పర్యవేక్షణ అవసరం అని గుర్తుంచుకోండి.
పైన చెప్పినట్లుగా, చనుమొన చుట్టూ మొటిమలు లేదా గడ్డలు ఉండటం చాలా సాధారణం. కొన్ని చిన్నవి, నిరపాయమైనవి. మరికొన్ని గడ్డలు వివిధ రకాల సమస్యలను సూచిస్తాయి. అలాంటి సందర్భాల్లో వాటికి కారణాలను చూద్దాం-
1. ఐరోలార్ గ్రంధులు- వీటిని మోంట్‌గోమెరీ గ్రంధులు అని కూడా పిలుస్తారు. అవి ఐరోలాపై కనిపించే చిన్న గడ్డలు, ఇవి కొంత పరిమాణంలో నూనెను కూడా స్రవిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, అవి చాలా సాధారణం. బహుసా పరిమాణం మారవచ్చు కానీ ప్రతి మహిళా వాటిని కలిగి ఉంటుంది. ఇవి నొప్పిలేవని కూడా మీరు తెలుసుకోవాలి.
2. ఈస్ట్ ఇన్ఫెక్షన్- మీ చనుమొనపై గడ్డలు దద్దుర్లు, దురదతో కూడి ఉంటే, ఇది ఈస్ట్ ఇన్ఫెక్షన్ కారణంగా కావచ్చు. ఈ ఇన్ఫెక్షన్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఎర్రగా, దురదతో కూడి ఉంటాయి.
3. మొటిమలు - మొటిమలు అనేది చనుమొనలతో సహా శరీరంలోని ఏ భాగానైనా కనిపించవచ్చు. మొటిమలు సాధారణంగా చిన్న తెల్లటి మచ్చల రూపంలో ఉంటాయి. ఇది ఏ వయస్సులోనైనా రావచ్చు. స్పోర్ట్స్ బ్రా వాడేవారిలో చెమటతో చర్మానికి ఎక్కువగా అంటిపెట్టుకుని ఉంటుంది కాబట్టి, వర్కవుట్ పని చేసే మహిళల్లో ఇది సాధారణం.
4. బ్లాక్డ్ హెయిర్ ఫోలికల్ - ప్రతి ఒక్కరికి వారి అరోలా చుట్టూ హెయిర్ ఫోలికల్స్ (వెంట్రుకల కుదుళ్ళు) ఉంటాయి. ఈ హెయిర్ ఫోలికల్స్ బ్లాక్ అవడం వల్ల చర్మం కిందనే వెంట్రుక ఉండిపోయి బ్లాక్ హెడ్స్ లేదా మొటిమలకు దారి తీస్తుంది. అరుదైన సందర్భాల్లో మాత్రమే బ్లాక్ అయిన హెయిర్ ఫోలికల్స్ గడ్డలుగా మారతాయి.
5. సబ్ ఐరోలార్ అబ్సెస్- రొమ్ము కణజాలంలో చీము పేరుకుపోవడాన్ని సబ్‌ఐరోలార్ అబ్సెస్ అంటారు. ఇది సాధారణంగా మాస్టిటిస్ అంటే పాలిచ్చే తల్లుల్లో సంభవిస్తుంది. ఒకోసారి పాలివ్వని మహిళలకు కూడా రావచ్చు. సబ్‌రియోలార్ అబ్సెస్, ఐరోలార్ గ్రంధి కింద చిన్న, వాచిన గడ్డ మాదిరిగా కనిపిస్తుంది. ఇది తరచుగా నొప్పిని కలిగిస్తుంది.
చివరిగా..
చనుమొన చుట్టూ ఉన్న గడ్డలకు ఏ విధమైన చికిత్స చేయాలి అనేది పూర్తిగా ఈ గడ్డల ఉనికి, అవి వచ్చిన కారణంపై ఆధారపడి ఉంటుంది. చనుమొన చుట్టూ ఉన్న బొబ్బ లేదా మొటిమ వాచిపోయి, బాధాకరంగా ఉంటే, మీరు త్వరగా మీ డాక్టర్‌తో అపాయింట్‌మెంట్ తీసుకోవాలని నిర్ధారించుకోండి. ఇవి నిపుల్ ప్రాబ్లెమ్స్ కి సంకేతాలు కావచ్చు. ఐతే, టెన్షన్ పడకుండా వీలైనంత త్వరగా మీ డాక్టర్ ని కలవండి .
మా బ్లాగ్ మీకు నచ్చిందా.. యూజ్ ఫుల్ అనిపించిందా.. దయచేసి like, comment, share చేయండి.. మరింతమందికి ఈ సమాచారం చేరేలా చేయండి!
Be the first to support
Be the first to share
Comment (0)