1. తెలంగాణలో 2 వేలు దాటిన యా ...

తెలంగాణలో 2 వేలు దాటిన యాక్టివ్ కోవిడ్ కేసులు: మీ పిల్లలను స్కూలుకు పంపేటప్పుడుఈ జాగ్రత్తలు తీసుకోండి

All age groups

Ch  Swarnalatha

2.9M వీక్షణలు

3 years ago

తెలంగాణలో 2 వేలు దాటిన యాక్టివ్ కోవిడ్ కేసులు: మీ పిల్లలను స్కూలుకు పంపేటప్పుడుఈ జాగ్రత్తలు తీసుకోండి
విద్య ప్రపంచం
కరోనా వైరస్
వ్యాధి నిర్వహణ & సెల్ఫ్‌కేర్
పాఠశాలలో భద్రత
పాఠశాల

తెలంగాణా రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. సోమవారం 20,507 మందికి కరోనా నిరారణ పరీక్షలు చేయగా, అందులో 246 మంది వైరస్‌ బారినపడ్డారు. అత్యధికంగా హైదరాబాద్‌లో 185 మందికి వైరస్‌ సోకింది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7.96 లక్షలకు చేరింది. ఒకరోజులో 155 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 2,117 క్రియాశీలక కేసులున్నాయి.  ఆంధ్రాలో కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి. ఇక అనేక పాఠశాలలు ఇప్పుడు వ్యక్తిగతంగా తరగతులను అందిస్తున్న పరిస్థితిలో, COVID-19 మహమ్మారి సమయంలో మీ బిడ్డను సురక్షితంగా ఉంచడం అనేది తల్లిదండ్రుల ముందున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటి. మహమ్మారి ఇంకా ముగియనందున మీకు ఆందోళనగా ఉండవచ్చు. ఇంకా అసలు దానికంటే ఎక్కువ వ్యాపించే లక్షణమున్న ఈ వైరస్ యొక్క కొత్త రకాలు బయటపడుతున్నాయి.

మీ పిల్లలను స్కూళ్ళకు పంపేందుకు మీరు సిద్ధమవుతున్నప్పుడు, వారిని ఆరోగ్యంగా ఉంచటానికి మీరు కొన్ని చర్యలు తీసుకోవాలి. మీ పిల్లలు పాఠశాలలో COVID-19 నుండి సురక్షితంగా ఉండటానికి కొన్ని మార్గదర్శకాలు సహాయపడతాయి.

More Similar Blogs

    పాఠశాలకు వెళ్లే మీ పిల్లలను వీలైనంత సురక్షితంగా ఉంచే మార్గాలు

    మీరు మీ పిల్లలను తిరిగి పాఠశాలకు పంపడానికి సిద్ధమవుతున్నప్పుడు, ఫేస్ మాస్క్ ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం మరియు సబ్బుతో లేదా శానిటైజర్‌తో క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం వంటి ప్రామాణిక COVID-19 జాగ్రత్తలను పటిష్టం చేయండి.

    1. మాస్కులు ధరించడం: 2 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రతి ఒక్కరూ పాఠశాల లోపల ఉన్నప్పుడు మరియు పాఠశాల బస్సులలో ప్రయాణించేటప్పుడు, COVID-19 వ్యాప్తి చెందే ప్రమాదం ఎక్కువగా ఉన్న చోట ముక్కు మరియు నోటిని కప్పి ఉంచే ముసుగు ధరించాలని WHO సిఫార్సు చేసింది. మీ పిల్లలను మాస్క్‌తో పాఠశాలకు పంపేటప్పుడు ఈ చిట్కాలను పరిగణించండి

    మీ బిడ్డను ముఖానికి మాస్క్‌లతోనే పాఠశాలకు పంపండి. మీ పిల్లలకు ప్రతిరోజూ శుభ్రమైన ముసుగు మరియు బ్యాకప్ మాస్క్‌ను అందించండి. అలాగే, లంచ్‌లో వారు దానిని వేసుకోలేనప్పుడు, మాస్క్‌ని నిల్వ చేయడానికి సీల్ చేసేందుకు వేలయ్యే బ్యాగ్‌ను అందించండి.

    మీ పిల్లల మాస్క్‌పై స్పష్టంగా లేబుల్ వేయండి. అపుడు , ఇది మరొక చిన్నారి మాస్కుతో మారిపోదు.

    మీ పిల్లల మాస్క్‌ను తాకడానికి ముందు మరియు తర్వాత చేతులను శుభ్రం చేయమని వారికి గుర్తు చేయండి.

    మీ పిల్లల మాస్క్‌లను ఇతరులతో పంచుకోవద్దని లేదా మార్చుకోవద్దని వారికి నూరిపోయండి.

    1. భౌతిక దూరం: పాఠశాలలో ఉన్నప్పుడు ఇతరులకు కనీసం 3 అడుగుల దూరంలో ఉండేలా మీ పిల్లలకు నేర్పండి. కొంతమంది వ్యక్తులు (సిబ్బంది మరియు ఉపాధ్యాయులు వంటివారు) లేదా కొన్ని పరిస్తితులలో (కేఫెటేరియా లేదా ఆడిటోరియంలో) 6 అడుగుల దూరంలో ఉండటం చాలా సురక్షితం.

    2. శుభ్రంగా ఉంచుకోవడం: తమను తాము శుభ్రంగా ఉంచుకోవడం, నీరు మరియు సబ్బుతో చేతులు కడుక్కోవడం, హ్యాండ్ శానిటైజర్‌ని ఉపయోగించడం వంటి వాటి ప్రాముఖ్యత గురించి మీ పిల్లలతో మాట్లాడండి. వారి దగ్గు లేదా  తుమ్ములను టిస్స్యూతో లేదా మోచేయి లోపలి భాగంలో కవర్ చేయడం కూడా అంతే ముఖ్యం.

    3. అనారోగ్యంగా ఉంటే ఇంట్లోనే ఉంచ౦డి: COVID-19 సంకేతాలు మరియు లక్షణాల కోసం ప్రతిరోజూ మీ బిడ్డను పర్యవేక్షించండి. వీటితొ కొన్ని కింద ఇవ్వబడ్డాయి: :

    జ్వరం, దగ్గు, ముక్కు కారటం లేదా ముక్కుదిబ్బడ, అలసట, శ్వాస ఆడకపోవుట

    గొంతు మంట, తలనొప్పి, కండరాల నొప్పులు, ఆకలి లేకపోవడం, వికారం లేదా వాంతులు, కడుపు నొప్పి, అతిసారం, వాసన లేదా రుచి కోల్పోవడం, కళ్ళు ఎర్రబడటం 

    సమాజం,  కుటుంబ౦ మరియు పాఠశాల సంయుక్తంగా  విద్యార్థులు క్షేమంగా ఉండేలా చూసుకోవాలి. పిల్లలతో సహా అర్హులైన ప్రతి ఒక్కరూ COVID-19 టీకాను పొందాలి. అదనంగా, పిల్లలు ఇన్ఫెక్షన్లను నివారించడానికి ఇతర సాధారణ బాల్యం మరియు కౌమారదశకు సంబంధించిన టీకాలతో సహా ఫ్లూ వ్యాక్సిన్‌ను కూడా పొందాలి. ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేస్తే మొత్తం సమాజమే గెలుస్తుంది.

    Be the first to support

    Be the first to share

    support-icon
    Support
    bookmark-icon
    Bookmark
    share-icon
    Share

    Comment (0)

    3 Summer Veg & Non-Veg Recipes Ideas for Kids

    3 Summer Veg & Non-Veg Recipes Ideas for Kids


    All age groups
    |
    130.7K వీక్షణలు
    When is a Child ready for a Pet?

    When is a Child ready for a Pet?


    All age groups
    |
    2.2M వీక్షణలు
    Celebrating Independence at 65

    Celebrating Independence at 65


    All age groups
    |
    11.4M వీక్షణలు