బాలింతలలో తల్లిపాల సరఫరాన ...
తల్లిపాలు మాతృత్వం యొక్క అత్యంతముఖ్యమైన అంశాలలో ఒకటి. అయితే, ఇది మొదటిసారి తల్లులలో చాలా ఆందోళనకు కారణం అవుతుంది కూడా. - "నేను నా బిడ్డకు సరిపడా పాలు ఉత్పత్తి చేస్తున్నానా?" "నా పాప ఇంకా ఆకలిగా ఉందా?" -ఇలాంటి విషయాల గురించి వారు ఆందోళన పడుతూ ఉంటారు. ప్రతి తల్లి పాలు తన బిడ్డకు సరిపోతాయని శిశువైద్యుడు పదే పదే స్పష్టం చేసినా, కొత్త తల్లికి భరోసా ఇవ్వడం అంత సులభం కాదు. మీ శిశువు యొక్క పెరుగుదల (ఎత్తు మరియు బరువు), తను తగినంత పోషకాహారం మరియు కేలరీలను పొందుతున్నాడా అనేదానికి బలమైన సూచిక. డాక్టర్ ఇచ్చే ఈ సమాచారంతో మీ మనస్సును తేలికగా ఉంచవచ్చు. అయితే, చనుబాలివ్వడం మెరుగుపరచడానికి ఇంకా తల్లిపాలను శిశువుకు చక్కగా అంద చేయడానికి మీరు ఏమి చేయగలరో తెలుసుకోవాలంటే.. ఆ బ్లాగ్ చదవండి.
తల్లి పాల సరఫరాను ఎలా పెంచాలి?
మీ తల్లి పాల సరఫరా తక్కువగా ఉందని మీరు ఆత్రుతగా ఉంటే, ఇక్కడ మీకు సహాయపడే 9 చిట్కాలు ఉన్నాయి.
రిలాక్స్ అవ్వండి మరియు హాయిగా ఉండండి: మీకు విరుద్ధమైనదిగా అనిపించవచ్చు, కానీ మీరు ఎంత ఎక్కువ ఒత్తిడి చేస్తే, మీ శరీరం అంత తక్కువ పాలు ఉత్పత్తి చేయగలదు. పాల ఉత్పత్తికి కారణమయ్యే హార్మోన్ అయిన ఆక్సిటోసిన్ ఉత్పత్తి, ఒత్తిడి వల్ల తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రశాంతమైన సంగీతాన్ని వినండి, సంతోషకరమైన విషయాలను ఆలోచించండి. రిలాక్స్‌గా ఉండండి. మీరు మీ బిడ్డకు పాలిచ్చేటప్పుడు లేదా బ్రెస్ట్ పంప్‌తో పాలు అందచేసినప్పుడు, సౌకర్యవంతమైన పొజిషన్లో కూర్చోండి. సౌకర్యవంతమైన పంపులను మాత్రమే ఎంచుకోండి.
మరింతగా అందించండి: తల్లిపాల విషయానికి వస్తే, మీ శరీరం సాధారణ సరఫరా మరియు డిమాండ్ సూత్రాన్ని అనుసరిస్తుంది. మీరు మీ బిడ్డకు ఎంత ఎక్కువ పాలు ఇస్తున్నారో, మీ రొమ్ములు ఎక్కువ పాలు ఉత్పత్తి చేస్తూనే ఉంటాయి. మీరు పాలు ఇవ్వకపోతే, మీ శరీరం పాలు అవసరం లేదని సిగ్నల్ పొందుతుంది, ఇక తగినంత పాలు ఉత్పత్తి చేయదు. కొన్ని కారణాల వల్ల మీ బిడ్డకు తల్లిపాలు ఇవ్వలేకపోతే, సౌకర్యవంతమైన బ్రెస్ట్ పంప్‌తో రొమ్ము పాలను బయటకు తీయండి మరియు బిడ్డకు ఆహారంగా ఇవ్వండి. సౌకర్యవంతమైన బ్రెస్ట్ పంప్‌తో సేకరించడం కూడా పాలు అవసరమని శరీరానికి తెలియజేస్తుంది
కాన్ఫిడెంట్ గా ఉండండి: మీ గర్భం మరియు ప్రసవానంతరం కూడా, కుటుంబం మరియు స్నేహితులు ఎన్నో రకాల సలహాలను అందిస్తారు. చాలా సార్లు, మీరు అడగకుండానే సలహాలిస్తారు. తగినంత పాలు అందటం లేదని, మీ బిడ్డ ఆకలితో ఉందని అత్తగారు సూచించవచ్చు. కానీ నిన్ను నువ్వు నమ్ముకో. నెగెటివ్ అంశాలను ఎక్కువగా వినడం, మీ బిడ్డకు ఇచ్చే పాలపై ప్రభావితం చేస్తుంది. కొంచెం గ్యాప్ తర్వాత మీ బిడ్డ మళ్లీ కావాలంటే, పాలు ఇస్తానని, అంతేకానీ మీ బిడ్డకు ఒకేసారి ఎక్కువ ఫీడ్ ఇవ్వడ౦ మంచిది కాదని ఆమెకు మర్యాదగా చెప్పండి.
ఒత్తిడికి లోనవకండి: ప్రతి 45 నిమిషాలకు మీరు ఆహారం ఇవ్వాలని మీ బిడ్డ అడుగుతోందా? పర్వాలేదు! ప్రతి బిడ్డకు తనదైన ఒక ప్రత్యేక ఫీడింగ్ విధానం ఉంటుంది. మీ బిడ్డ ప్రతి ఫీడ్ సెషన్ మధ్య మీకు 45 నిమిషాల గ్యాప్ ఇచ్చినప్పటికీ, మీ బిడ్డకు తగినంత పాలు లభిస్తున్నాయని నిర్ధారించుకోండి.
సంకేతాల కోసం చూడండి: మీ బిడ్డ తగినంత ఆహారం తీసుకుంటున్నాడని మీకు ఎలా తెలుస్తుంది? కేవలం అతని అవుట్‌పుట్ ద్వారా! మీ పాలు సరిపోతాయో లేదో నిర్ధారించడానికి ఒక సులభమైన మార్గం- శిశువు ఎన్నిసార్లు మూత్ర విసర్జన చేస్తుందో లెక్కించడం. రోజుకు 6 కంటే ఎక్కువ సార్లు పాస్ చేసినట్లయితే, శిశువుకు తగినంత ఆహారం లభిస్తుందని అర్థం. బీ హాపీ!
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి: మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే, మీ శరీరం తగినంత పాలను ఉత్పత్తి చేయగలదు. కాబట్టి, హెవీ ఫుడ్స్‌పై దృష్టి పెట్టడం కంటే, సరైన ఆహారంపై దృష్టి పెట్టండి. తగినంత తినండి మరియు శిశువు కొవ్వును తగ్గించాలని, మీరు ఆహార౦ తినకూడదని ఆలోచించకండి. అది తరవాత చూడవచ్చు. ముందు మీరు తగినంత తృణధాన్యాలు, పాలు మరియు పాల ఉత్పత్తులు, డ్రై ఫ్రూట్స్ మరియు ఆకు కూరలు తినండి.
పాలు తగ్గడంపై దృష్టి పెట్టండి: కొన్నిసార్లు, మీ శరీరం తగినంత పాలను ఉత్పత్తి చేస్తున్నప్పటికీ, పాలను సరిగ్గా రాకపోవడం వల్ల అది మీ చిన్నారికి అందుబాటులో ఉండకపోవచ్చు. దీనిని పరిష్కరించేందుకు మీరు తినే ముందు, తర్వాత మరియు తినే సమయంలో పుష్కలంగా ద్రవాలు తాగుతున్నారని నిర్ధారించుకోండి.
ఒత్తిడి లేకుండా ఉండండి. ఇంతకు ముందే చెప్పినట్లు, తల్లి పాలివ్వడానికి ప్రశాంతమైన మనస్సు తప్పనిసరి! మీ బిడ్డ సరిగ్గా ఉండేలా నిర్ధారించుకోండి పిల్లవాడు చనుమొన మీద కాకుండా మొత్తం అరోలా మీద అందుకునేట్టుగా ఉండాలి. పాలిచ్చే ముందు వెచ్చని నీటితో లేదా వెచ్చని టవల్‌తో మీ రొమ్మును మసాజ్ చేయండి. మీరు బ్రెస్ట్ పంప్‌ని ఉపయోగిస్తుంటే, పాల ప్రవాహాన్ని ఉత్తేజపరిచేందుకుఅనువైన లెట్-డౌన్ మోడ్‌ను ఉపయోగించండి.
పాలను పెంచే ఫుడ్స్‌పై దృష్టి పెట్టండి: శాస్త్రీయ ఆధారాలు లేనప్పటికీ, పాల పాలసరఫరాను పెంచడానికి పాలిచ్చే తల్లులకు కొన్ని సాంప్రదాయక ఆహారాలు ఇస్తారు. వాటిని మితంగా ప్రయత్నించండి, వాటిలో మీకు ఏది బాగా పని చేస్తుందో చూడండి - సోంపు, జీరా, వాము వంటి వాటిని నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగండి. లేదా వీటిని మెత్తగా చూర్నంలా చేసి దానిని తీసుకోండి.
చనుబాలివ్వడం గురించి, అవి సరిపోతున్నాయా లేదా అని మీకు ఇంకా నమ్మకం లేకుంటే, పాల సరఫరాను పెంచడానికి తీసుకోగల పౌడర్ మరియు క్యాప్సూల్ రూపంలో మార్కెట్‌లో కొన్ని సప్లిమెంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటి వాడవచ్చు. పై సలహా కోసం మీరు మీ వైద్యుడిని అడగవచ్చు.
Be the first to support
Be the first to share
Comment (0)