వర్షాకాలంలో ఈ నాలుగు కూరగ ...
రుతుపవనాలు తమ ప్రతాపం చూపిస్తూ ఊర్లు, పట్టణాలను ముంచెత్తుతున్నాయి. మరి ముసురు వేసి జోరున వర్షాలు కురిసే ఈ సమయంలో, మీ ఆహారంలో కూడా కొన్ని మార్పులు అవసరం. వర్షాకాలంలో ఈ నాలుగు రకాల కూరగాయలను దూరంగా ఉంచండి.
రుతుపవనాలు చల్లని జల్లులను తమతో తెస్తాయి. మండు వేసవి వేదన నుండి మన ఇంద్రియాలను రిఫ్రెష్ చేస్తాయి. ఇది పెరుగుదల ఇంకా పోషణల సీజన్. అందుకే మీరు మీ మాన్‌సూన్ డైట్‌పై తప్పనిసరిగా దృష్టి సారించాలని మా సలహా. వానాకాలం అంటే పొట్లకాయ, కాకరకాయ, బూడిద గుమ్మడికాయ, బెండకాయ ఇంకా ఎన్నో కూరగాయలు పుష్కలంగా లభించే సమయం. ఇవేకాకుండా కాకుండా, వర్షాకాలంలో దోసకాయలు, టమోటాలు, బీన్స్ కూడా ఉన్నాయి. మీ రెగ్యులర్ డైట్ ప్లాన్‌లో ఈ కూరగాయలను విరివిగా జోడించడం, మన పొట్టలోని పేగులు, జీర్ణాశయం వంటి అవయవాలకు ఆరోగ్యకరం.. ఇంకా రోగనిరోధక శక్తి పెంపొందించడానికి సహాయపడుతుంది. అయితే, కొన్ని కూరగాయలు తినడం వల్ల వర్షాకాలంలో మీ రోగనిరోధకశక్తి పై భారం పడుతుంది. అందుకే పోషకాహార నిపుణులు మరియు డైటీషియన్ ల సలహాతో వర్షాకాలంలో అంత ఉత్తమం కాని నాలుగు కూరగాయల జాబితాను మీకోసం రూపొందించాము.
రుతుపవనాలు వివిధ సూక్ష్మజీవులు మరియు బ్యాక్టీరియాల వృద్ధికి సరైన సమయం. అవి ఈ ఆకుకూరలను సులభంగా కలుషితం చేస్తాయి. అవి పెరిగే నేల కూడా చాలా కలుషితమై ఉండవచ్చు. ఆపై ఈ మొక్కల ఆకుల్లోకి చేరడం వాటికి చాలా సులభం. ఆకులతో కూడిన మొక్కలను అవి తమ నివాసం చేసుకుంటాయి. అందువల్ల, వాటిని నివారించడం మంచిది. అయినప్పటికీ మీరు వాటిని తినాలనుకుంటే, బ్యాక్టీరియాను చంపడానికి కనీసం 30 నిమిషాలు ఉడికించి, వాటిని ఉడికించాలని గుర్తు౦చుకోండి.
చక్కగా నిగనిగలాడే వ౦కాయాలలో ఆల్కలాయిడ్స్ అని పిలువబడే రసాయన సమ్మేళనాలు ఉంటాయి. కీటకాలు మరియు తెగుళ్ళ నుండి తమను తాము రక్షించుకోవడానికి అటువంటి కూరగాయలు ఉత్పత్తి చేసే విష రసాయనాలు ఇవి. వర్షాకాలంలో చీడపీడల ఉధృతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి, వంకాయ లేదా బైంగన్ వినియోగాన్ని పరిమితం చేయాలి. ఆల్కలాయిడ్ వల్ల అలెర్జీ, దద్దుర్లు, దురద, వికారం మరియు చర్మంపై రాష్ రావచ్చు. కాబట్టి, మీకెంతో ఇష్టమైన వంకాయ కూరను కాస్త దూరం పెట్టండి!
కాప్సికం వేసవిలో చాలా ప్రసిద్ధమైన వెజిటబుల్. అవి రుచికరమైనవవె కాకుండా విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉన్నాయి. అయితే, బెల్ పెప్పర్ ను మీ మాన్సూన్ డైట్‌లో చేర్చుకున్నప్పుడు సమస్యలను కలిగిస్తుంది. అవి గ్లూకోసినోలేట్స్ అనే రసాయనాలను కలిగి ఉంటాయి. కాప్సికంని కట్ చేసినపుడు లేదా నమలినప్పుడు అవి ఐసోథియోసైనేట్‌లుగా విచ్ఛిన్నమవుతాయి. ఈ రసాయనాలు పచ్చిగా లేదా ఉడికించి తిన్నా కూడా వికారం, వాంతులు, విరేచనాలు మరియు శ్వాస సమస్యలను కలిగిస్తాయి. ఈ లక్షణాలు సాధారణంగా ఆహారం తిన్న తర్వాత చాలా గంటలు ఉంటాయి. అందువల్ల, ఈ సీజన్లో వాటిని పూర్తిగా నివారించడం మంచిది.
కాలీఫ్లవర్స్ లేదా ఫూల్ గోబీలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. డీని ఆకులు క్యాబేజీ కుటుంబానికి చెందిన ఆకులను పోలి ఉంటాయి. ఇది క్యాబేజీ లాగే ఉంటుంది.. అదే బొటానికల్ కుటుంబానికి చెందినది. వర్షాకాలంలో మనం కాలీఫ్లవర్‌ను నివారించదానికి ప్రధాన కారణం ఏమిటంటే, ఇందులో గ్లూకోసినోలేట్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి సున్నితంగా ఉండే వ్యక్తులకు సమస్యలను, ఎలర్జీని కలిగిస్తాయి. ఈ కెమికల్స్ నివారించడానికి ఉత్తమ మార్గం కాలీఫ్లవర్స్ ని అస్సలు తినకపోవడం!
మీ ఫేవరిట్ కూరగాయలు తినద్డా అని వర్రీ అవుతున్నారా? ఏం పర్లేదు! మీ మాన్సూన్ డైట్‌లో మరింత రుచికరమైన ఈ క్రింది కూరలను చేర్చడం ద్వారా దానిని భర్తీ చేయవచ్చు: పొట్లకాయ, ఆనపకాయ, కాకరకాయ,బీట్‌రూట్, దోసకాయ. ఇంకెందుకు ఆలస్యం.. వీటిని ఓ పట్టు పట్టండి మరి!
Be the first to support
Be the first to share
Comment (0)