గర్భవతులు, పిల్లలకు స్వైన ...
స్కూల్ నుంచి వచ్చిన పదేళ్ళ అన్వేష్ ఒళ్ళు కాలిపోతోంది. ముక్కు కారడం, దగ్గు, జలుబుతో పాటు చాలా అలిసిపోయినట్టు ఉన్నాడు. చలేస్తోంది అని కూడా వాడు అనడంతో.. అది వర్షాకాలంలో ఎక్కువగా వచ్చే ఫ్లూ జ్వరం ఏమో అని వాళ్ళ అమ్మ పావనికి అనుమానం వచ్చింది.
ఆరోగ్యంగా ఉన్న పిల్లలు, టీనేజర్లకు ఇన్ఫ్లుఎంజా లేదా ఫ్లూ జ్వరం కలిగించే అనారోగ్యం ఎంత తీవ్రంగా ఉంటుందో చాలా మందికి తెలియదు. పిల్లలు తమ ఇళ్ళు, పరిసరప్రాంతాల్లో ఫ్లూని వ్యాప్తి చేయడంలో కూడా కారణమవుతారు. తల్లిదండ్రులుగా, మీ పిల్లలను, ఇతరులను ఫ్లూ నుండి రక్షించడానికి మీరు చేయగలిగే ఉత్తమమైన పని వారికి టీకాలు వేయించడమే.
అంటు స్వభావం, తీవ్రత ఉన్నప్పటికీ, వ్యాక్సినేషన్ ద్వారా స్వైన్ ఫ్లూను నివారించవచ్చు. మార్కెట్‌లో అందుబాటులో ఉన్న 4ఇన్1 ఫ్లూ వ్యాక్సినేషన్‌లు హెచ్1ఎన్1తో సహా 4 విభిన్న ఫ్లూ స్ట్రెయిన్‌ల నుంచి సంరక్షిస్తాయి. ఫ్లూ వ్యాక్సినేషన్ చక్కగా పనిచేస్తుంది. ముఖ్యంగా 6 నెలల నుంచి 5 సంవత్సరాల వయస్సు వరకు పిల్లలకు శిశువైద్యుల ద్వారా వేయాలని వైద్యనిపుణులు సిఫారసు చేస్తున్నారు. 6 నెలలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలందరికీ అందుబాటులోకి వచ్చినప్పుడు ఫ్లూ వ్యాక్సిన్ వేయించాలి. వాక్సిన్ వేసిన తర్వాత రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి దాదాపు రెండు వారాలు పడుతుంది.
ఇక 2009లో మనుషుల్లో స్వైన్ ఫ్లూ మొదటిసారి కనుగొనబడినప్పటి నుండి, అది దేశమంతా సీజనల్ వైరస్‌గా వ్యాప్తి చెందుతూనే ఉంది. భారతదేశం అంతటా నగరాలలో మరియు వాటి చుట్టుప్రక్కల స్వైన్ ఫ్లూ (హెచ్1ఎన్1) కేసులు పెరుగుతున్నాయని ఇటీవలి నివేదికలు సూచిస్తున్నాయి. స్వైన్ ఫ్లూ (హెచ్1ఎన్1) ఒక అంటువ్యాధి. ఇది వ్యాధి సోకిన వ్యక్తి నుంచి దగ్గు, తుమ్మడం, మాట్లాడటం ద్వారా వ్యాప్తి చెందుతుంది; లేదా కలుషితమైన వస్తువులు లేదా ఉపరితలాల ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది.
ఫ్లూ వచ్చినపుడు కనీసం ఒక వారం పాటు అనారోగ్యంగా ఉంటుంది. ఇది కొంతమందిపై చాలా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇన్ఫ్లుఎంజా మరియు దాని వల్ల వచ్చే తీవ్రమైన సమస్యలను నివారించడానికి టీకాలు వేయడం ఉత్తమ మార్గం. ఆస్తమా వంటి అధిక-ప్రమాదకర పరిస్థితులు ఉన్నవారికి ఇది అతిముఖ్యం. ఉదాహరణకు, ఫ్లూ న్యుమోనియాకు దారితీస్తుంది. ఫ్లూ వ్యాక్సిన్ ప్రజలను ఆసుపత్రికి దూరంగా ఉంచుతుంది. ఇది ఇన్ఫ్లుఎంజా నుండి సంభవించే తీవ్రమైన అనారోగ్యం, మరణాలను ఆపుతుంది.
1. 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలందరికీ ఆసుపత్రిలో చేరే ప్రమాదం 7 రెట్లు ఎక్కువ
2. గర్భిణీ స్త్రీలు ఆసుపత్రిలో చేరే ప్రమాదం 7 రెట్లు ఎక్కువ, కడుపులో శిశువు మరణించే ప్రమాదం 4 రెట్లు ఎక్కువ
3. మధుమేహ౦ లేదా షుగర్ ఉన్నవారికి ఆసుపత్రిలో చేరే ప్రమాదం 3 రెట్లు ఎక్కువ
4. ఆస్తమా రోగులకు తీవ్ర అనారోగ్యం కలగడానికి 4 కంటే ఎక్కువ రెట్లు ఎక్కువ అవకాశముంది
5. 65 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దలకు ఆసుపత్రిలో చేరే ప్రమాదం 2.5 రెట్లు ఎక్కువ.
1. జ్వరం, చలి, వణుకులు
2. దగ్గు మరియు గొంతు మంట
3. ముక్కు కారడం, ముక్కు పట్టేయడం
4. తలనొప్పి మరియు ఒళ్లు నొప్పులు
5. డయేరియా మరియు అలసట
ఫ్లూ ఒకోసారి న్యుమోనియా మరియు బ్రాంకైటిస్ కి దారితీయచ్చు. ఇవి ఆసుపత్రిలో చేరడానికి మరియు కొన్నిసార్లు మరణానికి కారణమవుతాయి.
అవును. గర్భధారణ సమయంలో మీ రోగనిరోధక, గుండె మరియు ఊపిరితిత్తుల పనితీరులో మార్పుల వల్ల మీరు ఫ్లూ కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. గర్భిణీ స్త్రీలు ఫ్లూ నుండి ఉత్తమ రక్షణ ఫ్లూ షాట్‌ను పొందాలని, అమెరికా ప్రభుత్వ వైద్య సంస్థ CDC సిఫార్సు చేస్తుంది. మీ గర్భం యొక్క ఏ త్రైమాసికంలో అయినా మీరు టీకాలు తీసుకోవచ్చు. టీకాలు వేయడం వలన మీ బిడ్డ పుట్టిన తర్వాత ఫ్లూ నుండి రక్షించవచ్చు. ఎందుకంటే గర్భధారణ సమయంలో తల్లి తన కడుపులో పెరుగుతున్న శిశువుకు ప్రతిరోధకాలను (ఆంటీబాడీస్) పంపుతుంది.
● తరచుగా చేతులను శుభ్రం చేసుకోవడం
● రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్క్‌లు పెట్టుకోవడం
● వ్యాధి సోకిన వ్యక్తితో కలవకుండా ఉండుట
మా బ్లాగ్ నచ్చిందా? ఉపయోగకరంగా ఉందా? ఐతే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మీ డాక్టర్‌ను సంప్రదించండి.
Be the first to support
Be the first to share
Comment (0)