రెండేళ్ళ బాలికను కిడ్నాప ...
తెలంగాణా రాష్ట్రంలోని కరీంనగర్ పట్టణంలో రెండేళ్ల చిన్నారి కిడ్నాప్ కు గురయ్యింది. ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిని ఓ ఆటోడ్రైవర్ ఎత్తుకుపోయాడు. పాప కనిపించకపోవడంతో ఆందోళన పడిన తల్లిదండ్రులు స్థానికుల సాయంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. అయినా ఆచూకీ లభించకపోవడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేసారు. విచారణ చేపట్టిన పోలీసులు, పాప కరీంనగర్ మండలం ఖాహీపూర్‌లో ఉన్నట్లు గుర్తించారు. ఆటోడ్రైవర్‌ను అరెస్ట్ చేసి చిన్నారికి తల్లిదండ్రులకు అప్పగించడంతో కథ సుఖాంతమైంది.
అయితే, స్కూళ్ళు ఓపెన్ అయిన నేపధ్యంలో పిల్లలను బయటకు పంపక తప్పదు. స్కూల్, ట్యూషన్ వదిలాక పిల్లలు ఇంటికి వచ్చేలోగా, లేదా ఇంటి పరిసరాలలో అయినా వారికి అపరిచితుల నుండి ప్రమాదం పొంచి ఉంటుంది. ఒకసారి వారి మాటలు నమ్మి తెలియని వ్యక్తుల వెంట వెళితే ఆ తర్వాత జరిగే పరిణామాలు ఊహించడం కూడా కష్టమే. ఇక తల్లితండ్రులు ఇద్దరూ జాబ్స్ లో ఉంటే.. పిల్లల భద్రత మరీ కష్టం అవుతుంది. ఈ నేపధ్యంలో అపరిచితుల గురించి పిల్లలకు అర్ధం అయేలా చెప్పడం, వారి భద్రతా కోసం కొన్ని రూల్స్ పాటించేలా అలవాటు చేయడం తప్పనిసరి. ఏ వయసువారైనా, మీ పిల్లలను సురక్షితంగా ఉంచడానికి వారికి తప్పనిసరిగా నేర్పించాల్సిన రూల్స్ ఈ బ్లాగ్ లో తెలుసుకోండి.
అపరిచిత వ్యక్తుల ప్రమాదాన్ని ఎదుర్కోవడంలో ముఖ్యమైన దశలలో ఒకటి సరిహద్దులను నిర్దేశించడం. ఈ విషయంలో మీ పిల్లలకు సహాయపడటానికి మీరు వారితో పంచుకోవాల్సిన 10 ముఖ్యమైన నియమాలు ఇక్కడ ఉన్నాయి:
1. అపరిచిత వ్యక్తి నుండి బహుమతులు లేదా స్వీట్లను ఎప్పుడూ స్వీకరించవద్దు.
2. తప్పిపోయిన పెంపుడు జంతువు లేదా పోయిన వస్తువులు వెతకడంలో ఎవరైనా సహాయం చేసినప్పటికీ, ఆ అపరిచితులతో ఎప్పుడూ ఎక్కడికీ వెళ్లవద్దు.
3. కారు లేదా ఏదైనా వాహనంలో ఉన్న తెలియని వారిని ఎప్పుడూ లిఫ్ట్ అడగద్దు. వారంతట వారు అడిగినా అంగీకరించవద్దు.
4. అపరిచిత వ్యక్తుల కారులో ఎప్పుడూ వెళ్లవద్దు. ఎవరైనా ఏదైనా అడ్రస్ అడిగినపుడు నోటితో చెప్పాలి కానీ చూపించడానికి వాళ్ళ కారు లేదా వాహనం ఎక్కరాదు.
5. టెలిఫోన్ నంబర్లు, మీ అడ్రస్ తో సహా మీ లేదా మీ ఫామిలీ గురించిన ప్రైవేట్ వివరాలను ఎవరికీ ఎప్పుడూ ఇవ్వకండి.
6. అపరిచిత వ్యక్తితో మీకు ఎపుడైనా ప్రమాదకర పరిస్థితి ఎదురైతే పరిగెత్తడం మరియు కేకలు వేయడం సరైంది. మనుషులు, వెలుతురు ఎక్కువగా ఉన్న ప్రదేశాల వైపు పరుగెత్తండి.
7. చీకటి ప్రదేశాల్లో ఆటలు ఆడకండి.
8. ఎపుడూ సమూహంలో అంటే గ్రూప్ గా ఉండండి. ఒక్కరే, ఒంటరిగా మీ స్వంతంగా ఎప్పుడూ తిరగకండి.
9. ఎవరైనా — మీకు తెలిసిన వారైనా సరే — మిమ్మల్నితేడాగా లేదా భయ౦కలిగే విధంగా తాకినట్లయితే వెంటనే ఎవరికైనా చెప్పండి. స్నేహితులు, ఫామిలీ మెంబర్స్ తో సహా ఎవరూ మిమ్మల్ని ముద్దు, కౌగిలించుకోవడం లేదా తాకినా విషయాన్ని రహస్యంగా ఉంచమని అడగకూడదు. అలా ఎవరైనా అడిగితే మీరు వెంటనే పేరెంట్స్ కి లేదా పెద్దవారికి చెప్పాలి.
10. తెలీయని వ్యక్తుల విషయంలో ఏ మాత్రం డౌట్ వచ్చినా వారి నుంచి దూరంగా వెళ్ళడానికి కానీ, ఇతరులను సహాయం అడగటానికి కానీ ఎపుడూ వెనకడుగు వేయవద్దు, ఆలస్యం చేయవద్దు.
మా బ్లాగ్ మీకు నచ్చిందా, ఐతే లైక్ షేర్ కామెంట్ చేయండి!
Be the first to support
Be the first to share
Comment (0)