పిల్లలలో మత్తుమందుల దుర్వ ...
ఇటీవల హైదరాబాద్ లో అధికారులు సుమారు రూ. 150 కోట్ల విలువైన నిషేధిత మాదకద్రవ్యాలను లను పట్టుకుని ధ్వంసం చేసారు. తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో డ్రగ్స్ సరఫరా మరియు వినియోగం జరుగుతున్నట్టు పలు సంఘటనలు, నివేదికలలో వెల్లడి అవుతూనే ఉంది. తెలుగు టీనేజర్లు, యువత ఈ దురలవాటుకు బానిస అయ్యే అవకాశం ఎంతైనా ఉంది. ఈ నేపధ్యంలో, పిల్లల్లో మత్తుమందుల దుర్వినియోగం, దాని లక్షణాలు, నివారణ తదితర అంశాల్లో తల్లిదండ్రులకు కీలక సూచనలు..
ఆల్కహాల్ మరియు అక్రమ మాదకద్రవ్యాలతో సహా సైకోయాక్టివ్ పదార్థాల హానికరమైన లేదా ప్రమాదకరమైన ఉపయోగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మాదకద్రవ్యాల దుర్వినియోగాన్నినిర్వచించింది. దుష్ప్రభావాల పరంగా చూస్తే, ఇతర కార్యకలాపాలు కంటే మాదకద్రవ్యాల వినియోగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది.
మత్తు పదార్ధాల దుర్వినియోగ లక్షణాలు
మాదకద్రవ్యాల దుర్వినియోగం చేసినపుడు వివిధ సంకేతాలు ఉంటాయి. డ్రగ్స్ లేదా ఆల్కహాల్ ఉపయోగించే వ్యక్తులు సాధారణంగా నిర్లక్ష్య ప్రదర్శన, ప్రవర్తనలో మార్పులు, మరియు అసహజమైన నిద్ర విధానాలు వంటి లక్షణాలను ప్రదర్శిస్తారు. అంటే కాకుండా డబ్బు కోసం పదే పదే అభ్యర్థనలు కూడా చేస్తుంటారు.
భౌతిక సంకేతాలు
ప్రవర్తన, మానసిక పరమైన సంకేతాలు
తల్లిదండ్రులు ఏమి చేయగలరు?
తల్లిదండ్రులతో పిల్లలకు గల సంబంధం వారి నిర్ణయాలు, ప్రవర్తన పై లోతైన ప్రభావం చూపుతుంది. అయితే, మీ బిడ్డకు ఒక మంచి రోల్ మోడల్‌గా ఉండటానికి, ఉక్కిరిబిక్కిరి చేసే లేదా అతిగా ప్రేమ చూపే తల్లిదండ్రులుగా ఉండటానికి మధ్య తేడా ఉంది. యువత ఎప్పటికైనా తమ౦త తాము నిర్ణయాలు తీసుకోవాల్సిందే. అయినప్పటికీ, తల్లిదండ్రులు తమ పిల్లలు డ్రగ్స్‌తీసుకునే సంభావ్యతను తగ్గించడానికి కొన్ని చర్యలు తీసుకోవచ్చు. వాటిలో కొన్ని:
వారి స్నేహితులను తెలుసుకోండి
మాదక ద్రవ్యాలపై వారి వైఖరిలో మీ పిల్లల స్నేహితుల సమూహాలు అపారమైన పాత్రను పోషిస్తాయి.పాఠశాల లేదా కాలేజ్ కి ద్వారా వెళ్లడం, కొత్త వ్యక్తులను కలుసుకోవడం వల్ల వారు వేర్వేరు సర్కిల్‌ల చుట్టూ తిరిగే అవకాశం ఉంది. వీరిలో కొందరు మద్యం మరియు ఇతర మత్తు మందులను తీసుకోమని మీ పిల్లలను ఒప్పించవచ్చు. అందువల్ల మీ పిల్లవాడు ఎవరితో తిరుగుతున్నాడో తెలుసుకోవడం మరియు హానికరమైన ప్రభావాల పట్ల జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. మీరు మీ టీనేజ్‌పిల్లల్లో ప్రతికూల మార్పును గమనించినట్లయితే, వారి స్నేహితులను గుర్తించండి. మంచిగా ప్రభావితం చేయగల వ్యక్తుల చుట్టూ తిరిగేలా మీ పిల్లలను ప్రోత్సహించండి.
ఆదర్శవంతమైన మంచి ప్రవర్తన
సమాజం, పరిసరాలు మరియు తల్లిదండ్రులు పిల్లల జీవితంపై అతిపెద్ద ప్రభావాన్ని కలిగి ఉంటారు. తమ చెడు అలవాట్లతో చాలా మంది తల్లిదండ్రులు ఈ బాధ్యతను విస్మరిస్తారు. సిగరెట్‌లు, మద్యం తాగడం వంటివి మీ పిల్లల భవిష్యత్తు ప్రవర్తనకు ఉదాహరణగా ఉంటుంది. తల్లిదండ్రులు వారి ప్రభావం గురించి తెలుసుకోవాలి. పిల్లల సమక్షంలో మంచిగా ప్రవర్తించడానికి వారి వంతు కృషి చేయాలి. కౌమారదశలో ఉన్నవారు మద్యం లేదా ఇతర మాదకద్రవ్యాల వినియోగంతో సహా చాలావరకు వారి తల్లిదండ్రుల ప్రవర్తనను అనుకరిస్తారని పరిశోధనలు చెబుతున్నాయి.
సానుకూల వాతావరణాన్ని సృష్టించండి
తల్లిదండ్రులు మంచి ప్రవర్తనను కలిగి, వారి పిల్లలకు సానుకూల వాతావరణాన్ని సృష్టించాలి. యుక్తవయసులో, పిల్లలకు మంచి నడవడిక, ఆత్మగౌరవాన్ని పెంపొందించే ఇల్లు అవసరం. తమను తాము అనుమానించుకునే లేదా వారి తల్లిదండ్రులచే నిర్లక్ష్యం చేయబడినట్లు భావించే టీనేజర్లు తరచుగా మద్యం లేదా ఇతర మాదకద్రవ్యాలకు బానిస అవుతారు. తల్లిదండ్రులు తమ పిల్లల జీవితంలో తమకు వీలైనంతగా పాలుపంచుకోవాలి. వారిపై ఒత్తిడిని తగ్గించడానికి, విశ్రాంతి తీసుకోవడానికి, ఆరోగ్యకరమైన మార్గాలను నేర్పడానికి మీ పిల్లలతో వ్యూహాలను ఆచరించండి.
టీనేజ్ పిల్లలతో మాట్లాడండి
దాదాపు తొమ్మిది శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు మాదక ద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే ప్రమాదాల గురించి బోధించరని అధ్యయనాలు సూచిస్తున్నాయి. తల్లిదండ్రుల పాఠాలు, వారి శ్రద్ధ పిల్లల మాదకద్రవ్యాల దుర్వినియోగ అలవాట్లని తగ్గిస్తాయని పరిశోధనలు చూపిస్తున్నాయి. అందువల్ల, తల్లిదండ్రులు తమ పిల్లలతో మత్తు మందుల గురించి మాట్లాడటం చాలా ముఖ్యం. డ్రగ్స్‌తో పాలు తీసుకోవడం వల్ల కలిగే ప్రమాదాల గురించి, మీకు అది ఆమోదయోగ్యం కాదని వారికి సష్టంగా తెలియజేయండి.
తోటివారి ఒత్తిడి గురించి హెచ్చరించండి
టీనేజర్లు తమ మధ్య లేదా ఉన్నత పాఠశాల విద్యలో కొత్త స్నేహితులు లేదా అపరిచితుల నుండి కానీ, పీర్ ప్రెజర్ (తోటివారి ఒత్తిడి)ని ఎదుర్కొంటారు. అది ఒక సహచరుడు, స్నేహితుడు, సహోద్యోగి, క్లాస్‌మేట్, పరిచయస్తుడు లేదా వారు ఆరాధించే హీరో.. ఇలా ఎవరైనా కావచ్చు.మీరు మీ పిల్లలతో మాదకద్రవ్యాల దుర్వినియోగం గురించి చర్చించినప్పుడు, తోటివారి ఒత్తిడి గురించి మరియు దానిని ఎలా ఎదుర్కోవాలో వారిని హెచ్చరించడం మర్చిపోవద్దు. . "జస్ట్ సే నో" అనే ప్రసిద్ధ నినాదం మీరు వారికి నూరిపోయాలి.
మీరు ఆరోగ్యకరమైన నిర్ణయాలు కలిగి, ప్రోత్సాహకరమైన సంఘం కార్యకలాపాలకు మద్దతు ఇచ్చినప్పుడు, పిల్లలు మిమ్మల్ని రోల్ మోడల్‌గా చూస్తారు. మీ సలహాలను సూచనలను మాతో ఇంకా ఇతర మీతోటి తల్లిదండ్రులతో షేర్ చేసుకోండి.
Be the first to support
Be the first to share
Comment (0)