1. మంకీ పాక్స్ గురించి మీరు ...

మంకీ పాక్స్ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు

All age groups

Ch  Swarnalatha

2.8M views

3 years ago

 మంకీ పాక్స్ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు
Disease management & Selfcare
Tests

ప్రపంచం ఇపుడు మంకీ పాక్స్  రూపంలో  కొత్త ఆరోగ్యపరమైన సవాలును ఎదుర్కొంటోంది. మంకీ పాక్స్ ఒక అరుదైన వైరల్ ఇన్‌ఫెక్షన్.  ఇది సాధారణంగా అంత ప్రమాదకారి కాదు. ఇది సోకిన వారిలో  చాలా మంది కొన్ని వారాల్లోనే కోలుకుంటారు. ఏదేమైనా, సోకిన 100 మందిలో ఒకరికి మాత్రమే ఈ వ్యాధి ప్రాణాంతకం అయ్యే అవకాశం ఉంది.  నిజానికి భారతదేశంలో ఇప్పటి వరకు ఎటువంటి కేసు నమోదు కానప్పటికీ,  కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పరిస్థితిని సునిశితంగా గమనిస్తున్నాయి. మరి, ఇంట ఆందోళనకు గురిచేస్తున్న మంకీ పాక్స్ గురించిన ముఖ్యమైన సమాచారాన్ని parentune మీ కోసం అందిస్తోంది. 

 Monkeypox గురించి మీరు తెలుసుకోవలసిన కొన్ని ముఖ్య అంశాలు

More Similar Blogs

    • మంకీపాక్స్ అనేది జంతువులూ, మనుషులలో సంభవించే వైరల్ వ్యాధి. ఇది ప్రధానంగా మధ్య మరియు పశ్చిమ ఆఫ్రికాలోని ఉష్ణమండల వర్షారణ్య ప్రాంతాలలో మొదట కనుగొన్నారు. ఇది అప్పుడప్పుడు ఇతర ప్రాంతాలకు కూడా వ్యాప్తిస్తుంది. 
    • అదృష్టవశాత్తు ఈ వైరస్ కు  అంత సులభంగా వ్యాపి౦చే స్వభావం లేదు, అందువల్ల  ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది.

    మంకీపాక్స్ ఎలా వ్యాప్తిస్తుంది?

    • పశ్చిమ మరియు మధ్య ఆఫ్రికాలోని ఉష్ణమండల ప్రాంతాలలో ఈ వ్యాధి సంక్రమణ అధికంగా ఉంది. ఇది సోకిన వ్యక్తితో  సన్నిహిత సంబంధం ద్వారా మంకీ పాక్స్ సంక్రమించవచ్చు. 
    • మొట్టమొదట కోతులలో కనుగొనబడిన ఈ వ్యాధి, సన్నిహిత శారీరక సామీప్యం  ద్వారా, ఇంకా  లైంగిక సంపర్కం ద్వారా కూడా ఒక వ్యక్తి నుండి ఇంకో వ్యక్తికి వ్యాపిస్తుంది. 
    • మంకీపాక్స్ జంతువు నుండి మనుషులకు అలాగే మనిషి నుండి మనిషికి సంక్రమిస్తుంది. 
    • చర్మం పగుళ్ళు (కనిపించనంత చిన్నవైనా ), శ్వాసనాళం లేదా కళ్ళు, ముక్కు లేదా నోటిలో  ఉండే శ్లేష్మ పొర ద్వారా ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది.
    •  వన్యప్రాణుల మాంసం, శరీర ద్రవాల వల్ల, అవి కాటు వేసినపుడు  లేదా గీరినపుడు, గాయం నుండి స్రవించే  పదార్థంతో పరోక్ష సంబంధం ద్వారా జంతువు నుండి మనిషికి వ్యాపిస్తుంది.
    • ఇక మానవుని నుండి మానవునికి ప్రధానంగా  శ్వాసకోశ తుంపర్ల  ద్వారా సంభవిస్తుందని భావించబడుతుంది. అంతేకాకుండా  ఇది సోకిన వ్యక్తి యొక్క శరీర ద్రవాలు లేదా గాయాలతో ప్రత్యక్ష౦గా,  ఇంకా  వారు వాడటం వల్ల కలుషితమైన దుస్తులు లేదా పక్కబట్టల  ద్వారా పరోక్ష౦గా కూడా వ్యాపిస్తుంది. 

    మంకీపాక్స్ లక్షణాలు

    • మంకీపాక్స్ సాధారణంగా వైద్యపరంగా జ్వరం, దద్దుర్లు మరియు వాపుతో ఉంటుంది. ఇది  అనేక వైద్యపరమైన సమస్యలకు దారితీయవచ్చు.
    • మంకీపాక్స్ లక్షణాలు  సాధారణంగా 2 నుండి 4 వారాల వరకు ఉంటాయి. 
    • మంకీపాక్స్ యొక్క లక్షణాలు మశూచిని పోలి ఉంటాయి. నిజానికి మశూచి  ప్రపంచవ్యాప్తంగా నిర్మూలించబడినట్లు 1980లో అధికారికంగా  ప్రకటించబడింది.  మంకీపాక్స్, మశూచి కంటే తక్కువ తీవ్రత కలిగింది మరియు  తక్కువ స్థాయిలో అనారోగ్యాన్ని కలిగిస్తుంది.
    • మంకీపాక్స్ ఇన్క్యుబేషన్ పీరియడ్  సాధారణంగా 7-14 రోజులు. ఒకోసారి ఇది  5-21 రోజుల వరకు ఉంటుంది. ఈ వ్యవధిలో వ్యాధి సోకిన వ్యక్తి ద్వారా  సాధారణంగా మంకీపాక్స్ వ్యాప్తించదు. 

    భారతదేశంలో మంకీపాక్స్ కేసులు

    ఈ రోజు వరకు భారతదేశంలో లో మంకీపాక్స్ అనుమానిత లేదా ధృవీకరించబడిన కేసులు ఉన్నట్టు సమాచారం ఏదీ లేదు.

    ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు

    మంకీపాక్స్ వ్యాధి ఉనికి- బెనిన్, కామెరూన్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, గాబన్, ఘనా (జంతువులలో మాత్రమే గుర్తించబడింది), ఐవరీ కోస్ట్, లైబీరియా, నైజీరియా, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సియెర్రా లియోన్ మరియు దక్షిణ సూడాన్ దేశాలలో ఉన్నట్టు తెలియవచ్చింది. 

    మంకీపాక్స్ వ్యాక్సిన్

    ప్రస్తుతానికి మంకీ పాక్స్‌ రాకుండా ముందుగానే నివారించగల  నిర్దిష్ట వ్యాక్సిన్ అదీ కనుగొనబడలేదు.  కానీ మశూచి,  మంకీపాక్స్‌  వైరస్‌లు చాలా సారూప్యం కలిగిఉంటాయి.  అందువల్ల  మశూచి టీకా, మంకీ పాక్స్‌ నుండి  85 శాతం రక్షణను అందిస్తుందని తెలియవచ్చింది. 

    Be the first to support

    Be the first to share

    support-icon
    Support
    bookmark-icon
    Bookmark
    share-icon
    Share

    Comment (0)